– అపోలోలో రాష్ట్ర స్థాయి
ఎన్‌ఆర్పీ వర్క్‌షాప్ ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): నవజాత శిశువుల అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని ది అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ హెచ్.వినోద్‌భట్ పేర్కొన్నారు. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో, అరగొండ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సహకారంతో నిర్వహిస్తున్న బేసిక్ నియోనేటల్ రీసస్సిటేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌ఆర్‌పీ) రాష్ట్ర స్థాయి రెండు రోజుల వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలల నుంచి అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ హెచ్.వినోద్ భట్ మాట్లాడుతూం నవజాత శిశువుల ప్రాణరక్షణలో వైద్య సిబ్బంది సమయోచిత నిర్ణయాలు, సరైన నైపుణ్యాలు అత్యంత కీలకమన్నారు. ఈ కార్యక్రమానికి ఎపీఎన్‌ఎంసీ అబ్జర్వర్‌గా కె.ఎన్.సత్యనారాయణబాయి హాజరయ్యారు. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.జయంతి స్వాగత ఉపన్యాసం చేశారు. వర్క్‌షాప్‌నకు రిసోర్స్ పర్సన్స్‌గా నేఐఎంఎస్‌ఆర్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ రాజేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గ్నానవేల్, తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మైలా గీత పాల్గొని శిక్షణ అందించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్, ప్రీ–టెస్ట్ నిర్వహించి, అనంతరం శాసీ్త్రయ సెషన్లు, స్కిల్ స్టేషన్ల ద్వారా శిక్షణ అందించారు. పాల్గొన్న వారిని చిన్న గ్రూపులుగా విభజించి నిర్వహించిన హ్యాండ్స్–ఆన్ ట్రైనింగ్ ఈ వర్క్‌షాప్ ప్రత్యేకతగా నిలిచింది. కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె అగస్టీన్, నర్సింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జింటో మాథ్యూ, అధ్యాపకులు, రాష్ట్రంలోని వివిధ నర్సింగ్ కళాశాలల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.


