ఐరాల: జాతీయ స్థాయి పారా ఫెన్సింగ్ పోటీ ల్లో మండలంలోని కాకర్లవారిపల్లెకు చెందిన విద్యార్థి గురుప్రసాద్ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినట్లు ఫెన్సింగ్ కోచ్ రాఘవకార్తీక్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పారా ఫెన్సింగ్‌లో చిత్తూ రు నగరం విజయం జూనియర్ కళాశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి గురుప్రసాద్ పాల్గొన్నట్టు తెలిపారు. అక్కడ ప్రతిభ చూపి కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు చెప్పారు. కాణిపాకం జెడ్పీ హైస్కూల్‌లో పారా ఫెన్సింగ్‌కు శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో పతకం సాధించడం జిల్లాకు గర్వకారణమని తెలిపా రు. ఈ సందర్భంగా గురుప్రసాద్‌ను జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, కోచ్, తల్లిదండ్రులు, విజ యం కళాశాల యాజమాన్యం అభినందించారు.
గంజాయి స్వాధీనం : నలుగురి అరెస్టు
పాకాల : అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని సీఐ చినగోవిందు సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఆదివారం వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ తన సిబ్బందితో పాకాల మండల పరిధిలోని కుందేటివారిపల్లి, శంకంపల్లి రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు అనుమానాస్పద ప్రవర్తన కలిగిన నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఒక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో తిరుపతి మంచాల వీధికి చెందిన పూజారి ముని, లింగేశ్వర్ నగర్‌కు చెందిన ముల్లతంటి రాకేష్, తాతయ్యగుంటకు చెందిన సింగనమల్లి సునీల్‌కుమార్, అక్కనగారి వెంకటసాయి ఉన్నారని తెలిపారు. వీరు తిరుపతికి చెందిన జనార్దన్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందని అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిందితులపై సీఐ చినగోవిందు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.


