మొబైల్ రీచార్జ్‌కు సంబంధించి సాధారణంగా మంత్లీ రీచార్జ్ ప్లాన్లు అంటే 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంటాయి. కానీ నెలంతటికీ అంటే 30 రోజులూ వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియోలో రెండు చౌకైన రీచార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలకు సరిపడా డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు కళ్లు చెదిరే అదనపు బెనిఫిట్స్, ముఖ్యంగా ఏఐ (AI) ప్రియుల కోసం ఈ ప్లాన్‌లో భారీ ఆఫర్లను చేర్చింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
జియో రూ. 365 ప్లాన్
జియో తన వెబ్‌సైట్, యాప్‌లో రూ. 365 ధరతో కూడిన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌లకు భిన్నంగా ఇది పూర్తి 30 రోజుల కాలపరిమితితో వస్తుంది.
ప్రయోజనాలు
డేటా: మొత్తం 25 GB హై-స్పీడ్ డేటా
కాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్.
SMS: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.
టాక్ టైమ్: అదనంగా రూ. 7.47 విలువైన టాక్ టైమ్ లభిస్తుంది.
ఈ ప్లాన్ కేవలం డేటాకే పరిమితం కాకుండా, భారీ సబ్-స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్-స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 2000 GB క్లౌడ్ స్టోరేజ్, అధునాతన ఏఐ ఫీచర్లు ఉంటాయి. (గమనిక: ఈ బెనిఫిట్ కొనసాగాలంటే రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉండాలి).
డిస్నీ+ హాట్‌స్టార్: 3 నెలల పాటు మొబైల్/టీవీ సబ్-స్క్రిప్షన్.
జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud): 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.
ఇతర యాప్‌లు: జియో టీవీ, జియో సినిమా సబ్-స్క్రిప్షన్లు.
రూ. 355 'ఫ్రీడమ్ ప్లాన్'
దాదాపు ఇవే ప్రయోజనాలతో జియో రూ. 355 కేటగిరీలో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీ, 25 GB డేటా, అపరిమిత కాలింగ్ , పైన పేర్కొన్న ఏఐ (AI), ఓటీటీ సబ్-స్క్రిప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో అదనంగా నానో బనానా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ రూ. 365 ప్లాన్‌లో అపరిమిత 5G డేటా గురించి జియో అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం 4G డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.


