డీఎల్‌ఏటీఓకు రాష్ట్ర స్థాయి అవార్డు | - | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఏటీఓకు రాష్ట్ర స్థాయి అవార్డు

Mar 22 2026 1:53 AM | Updated on Mar 22 2026 1:53 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): టీబీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీటీసీసీఓఎన్‌–2026 (ఏపీ టీబీ చెస్ట్‌ కాన్ఫరెన్స్‌) కార్యక్రమంలో జిల్లా డీఎల్‌ఏటీఓ డాక్టర్‌ జి.వెంకట ప్రసాద్‌కు బెస్ట్‌ డీఎల్‌ఏటీఓ–2025–26శ్రీ అవార్డు ప్రదానం చేశారు.శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీబీ నియంత్రణలో విశేష కృషి చేసినందుకు ఆయనను ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకట ప్ర సాద్‌ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, టీబీ నిర్మూలన లక్ష్యంతో మరింత కృషి చేస్తానని తెలిపారు.

ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట భద్రత

చిత్తూరు అర్బన్‌: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. శనివారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని మసీదులు, ప్రార్థనా మందిరాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను, నిఘాను ఉంచా రు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement