సంక్షేమం పట్టదా బాబూ? | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం పట్టదా బాబూ?

Mar 24 2026 7:55 AM | Updated on Mar 24 2026 7:55 AM

కార్వేటినగరం: సంపద సృష్టించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతానని నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు విస్మరించారని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు.సోమవారం ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల కడుపుకొట్టేందుకు సిద్ధమైందన్నారు. గత వైఎస్సార్‌సీపీ హ యాంలో పేదల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలను అమలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు రెండేళ్లు అవుతు న్నా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్‌సిక్స్‌ హిట్‌ అంటూ ప్లాప్‌ షోలు చూపించి పేదల నడ్డి విరుస్తోందన్నారు. యువతకు కొత్తగా రుణాలు ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. గ్రామాల్లో నీటి పన్ను, చెత్త పన్ను, చిరు వ్యాపారస్తులపై కూడా ట్రేడ్‌ ఫీజుల పేరిట ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని చెప్పారు.

పరామర్శ

ఆళత్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకు డు ముత్యాలశెట్టి(53) అనారోగ్యంతో మృతి చెందా రు. సమాచారం అందుకున్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆయన గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి పిల్లల భవిష్యత్తుకు తాను బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా కొత్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనివాసులునాయుడు అన్న సుబ్రమణ్యంనాయుడు భార్య లక్ష్మీదేవి(65) అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామానికి వెళ్లి లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మాజీ జేసీఎస్‌ కన్వీనర్‌ పురంధర్‌, నాయకులు చిరంజీవిరెడ్డి, మురాజ్‌, శ్రీనివాసులునాయుడు, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చిరంజీవులునాయుడు, ధర్మయ్య, శేఖర్‌రెడ్డి, కుమార్‌, ధనకోటేశ్వరరావు, అర్జున్‌, పెద్దబ్బ, సురేష్‌నాయుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement