అర్హులు ఎవరంటే? | - | Sakshi
Sakshi News home page

అర్హులు ఎవరంటే?

Mar 24 2026 7:55 AM | Updated on Mar 24 2026 7:55 AM

9వ తరగతి విద్యార్థులకు

సువర్ణావకాశం

14 రోజుల పాటు ఉచిత శిక్షణ

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్‌, సైన్స్‌ క్లబ్‌లో ఉంటే ఐదు శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌న్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగాల్లో ఉన్న వారికి ఐదు శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్‌ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31లోగా (www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్‌ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనుంది. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30వ తేదీ వరకు ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.

ఏడు కేంద్రాల్లో నిర్వహణ

ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్‌), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్‌ (గుజరాత్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), షిల్లాంగ్‌ (మేఘాలయ)లలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

భావి శాస్త్రవేత్తలకు

వేదికగా యువికా–2026

సద్వినియోగం చేసుకోవాలి

9వ తరగతి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యువ విజ్ఞాని కార్యక్రమానికి జిల్లాలోని 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ణానం పై ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదిక. ఈ శిక్షణలో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 శాతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. – సుమిత్‌కుమార్‌గాంధీ, కలెక్టర్‌, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement