చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. వాటిని దశ ల వారీగా పరిష్కారించనున్నట్లు వివరించారు.
‘సంపన్న కారి కార్యక్రమం’ వరం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు సంపన్న కారి కార్యక్రమం వరం లాంటిందని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. సోమవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాల అభివృద్ధికి రూపొందించినదే సంపన్న కారి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటు నాలుగు లక్షల వరకు సున్నా వడ్డీ రుణ సదుపాయం అందిస్తారన్నారు. జిల్లాలో ఇందుకు అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం రవి, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, రవి, డీఆర్‌డీఏ అధికారులు కేశవులు , మణి పాల్గొన్నారు.


