ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ బాధ్యతలు

Mar 24 2026 7:55 AM | Updated on Mar 24 2026 7:55 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు మునిసిప ల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌, కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కలెక్టరేట్‌లోని చాంబర్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్యేక అధికారిగా సుమిత్‌కుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే పాలకవర్గాల (కౌన్సి ల్‌) గడువు పూర్తవడంతో.. కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి మునిసిపల్‌ ఎన్నికలు జరిగేంత వరకు కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు.

ఏడాదిగా పెండింగ్‌

చిత్తూరు కార్పొరేషన్‌: వ్యవసాయ సర్వీసుకు గత ఏడాది ఫిబ్రవరిలో డబ్బులు కట్టినా విడుదల చేయలేదని సోమల నుంచి రైతు మునేంద్రబాబు ఫిర్యాదు చేశారు. సోమవారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే పుంగనూరులోని నగరి ఎస్‌ఎస్‌ గ్రామంలో ఉదయం 7–8 గంటల మధ్యలో లోఓల్టేజీ సమస్య వేధిస్తోందని వినియోగదారుడు వాసుదేవయ్యశెట్టి తెలిపారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్‌ఈ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement