చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఎన్.పి.సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రథ మ సెమిస్టర్ ఫలితాలు సోమవారం ఎస్వీ యూ నివర్సిటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రణాళిక, అభివృద్ధి మండలి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎన్.పి.వెంకటేశ్వరచౌదరి మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు కేవలం విద్యలోనే కాకుండా క్రీడలు, ఇతర అంశాల్లో సైతం ప్రతిభను చాటుతుండడం గర్వ కారణమన్నారు. సీపీడీసీ సభ్యులు, పూర్వ విద్యార్థిని డాక్టర్ ఎం.శైలజా మాట్లాడుతూ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను గౌర వించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.మనోహర్ మాట్లాడుతూ కళాశాల స్వయం ప్రతిపత్తి సాధించిన తొలి ప్రయత్నంలోనే 76.54 శా తం ఉత్తీర్ణత సాధించడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు మార్కుల మెమోలను అందజేశారు.


