వరసిద్ధుడి సేవలో ప్రముఖులు | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుడి సేవలో ప్రముఖులు

Mar 21 2026 5:02 AM | Updated on Mar 21 2026 5:02 AM

కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ నరేంద్ర పాడల్‌ కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర విద్యుత్‌, సహజవాయువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీఐ వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అలాగే రాష్ట్ర సమాచార కమిషనర్‌ శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో పెంచల కిషోర్‌ దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈ రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ కోదండపాణి, వాసు, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి పాల్గొన్నారు.

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి, డీజీఐ వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement