జూనియర్‌ కళాశాలలకు సరికొత్త క్యాలెండర్‌ | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ కళాశాలలకు సరికొత్త క్యాలెండర్‌

Mar 21 2026 5:02 AM | Updated on Mar 21 2026 5:02 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ బోర్డు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా సంవత్సరాన్ని ముందస్తుగా ఏప్రిల్‌1 నుంచే ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు జూని యర్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతా యి. ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 1వ తేదీ నుంచి కళాశాల లు తిరిగి పూర్తిస్థాయిలో పని చేస్తాయి.

మొత్తం పనిదినాలు ఇలా...

ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 314 రోజులకు గాను, 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. మిగిలిన 82 రోజులు ఆదివారాలు, పండుగ సెలవులుగా ప్రకటించారు. ప్రభుత్వ కళాశాల ల్లో సంఖ్యను పెంచడ మే లక్ష్యంగా జిల్లా ఇంటర్మీడియట్‌ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్ప టికే గత ప్రభుత్వంలో చేపట్టిన ‘నాడు–నేడు’ తో కళాశాలల రూపురేఖలు మారాయని, డిజిటల్‌ విద్యాబోధన అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయా లని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు అందాయి.

అర్ధగిరి అభివృద్ధికి

ప్రణాళిక సిద్ధం చేయాలి

తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి అన్నిశాఖల సమన్వయంతో పనిచేయాలని ఉపాధి పథకం రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్‌ అధికారి గోపీచంద్‌ ఆదేశించారు. శుక్రవారం అర్ధగిరి క్షేత్రంను దర్శించుకొని అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆలయంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ రఘుపతితో సమావేశమై అభివృద్ధి పనుల ప్రణాళిక తయారీపై చర్చించారు. అర్ధగిరి క్షేత్రంలో సుమారు 179 ఎకరాల్లో కొండ చుట్టూ పైభాగంలో ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేసి(డిపిఆర్‌) నివేదిక పంపాలన్నారు. ఆయనతో పాటు డ్వామా పీడీ రవికుమార్‌, ఏపీడీలు మల్లికార్జున, సుబ్రమణ్యం, ఏపీఓ బాల, వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ , ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement