ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశ ‘గృహ గణన’
రెండో దశలో జనాభా లెక్కల సేకరణ
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో
శిక్షణ పూర్తి
డిజిటల్ పద్ధతిలో వివరాల నమోదు
దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే
‘జనగణన–2027’ ప్రక్రియకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈసారి రెండు దశల్లో గణనను నిర్వహించనున్నారు. గ్రామ, పట్టణ స్థాయిల నుంచి జాతీయ స్థాయి వరకు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ గణాంకాలు దోహదపడనున్నాయి. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం ఆనవాయితీ. అయితే 2021లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. చివరి సారిగా 2011లో జనాభా లెక్కల సేకరణ చేయగా, ప్రస్తుతం కొత్తగా సేకరణకు చర్యలు చేపట్టారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2027 జనగణన ప్రక్రియకు సంబంధించి ముందస్తు కసరత్తు వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది.
మొదటి దశ :
రెండో దశ :
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సమాచారం
మొత్తం జనాభా 5732,66చ.కి.మీ
జిల్లా విస్తీర్ణం 16,43,224
రెవెన్యూ డివిజన్‌లు 4
అర్బన్ జనాభా 3,13,898
రూరల్ జనాభా 13,29,326
అసెంబ్లీ నియోజకవర్గాలు
5 (పూర్తి), 2 (పాక్షికం)
మండలాలు 28
రెవెన్యూగ్రామాలు 762
ఎస్సీలు 3,61,461
ఎస్టీలు 44,367
‘జనగణన’కు కసరత్తు
పకడ్బందీగా చేస్తాం
జిల్లా వ్యాప్తంగా జనగణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్, నియమ, నిబంధనల ప్రకారం ఈ కసరత్తు చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బంది, పర్యవేక్షణకు అధికారులను నియమించారు. జనగణన ప్రక్రియపై ఇటీవలే శిక్షణ పూర్తి చేశాం. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నాం. – సుమిత్ కుమార్ గాంధీ, కలెక్టర్


