అకాల వర్షంతో పంటనష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో పంటనష్టం

Mar 21 2026 5:02 AM | Updated on Mar 21 2026 5:02 AM

వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలంలో బుధ, గురువారాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా భారీగా పంట నష్టపోయారు. మండల పరిధిలోని పాదిరేడు, టి.సి.అగ్రహా రం, లక్ష్మమ్మ కండ్రిగ పరిసర ప్రాంతాల్లో సు మారు 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకు వచ్చిన సమయంలో ఇలా అకాల వర్షం కారణంగా పంట మొత్తం పడిపోయి నీట ము నగడంతో తాము పూర్తిగా మునిగిపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

విద్యార్థినులకు గాయాలు

బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని కమ్మనపల్లె ఆదర్శ పాఠశాల వద్ద శుక్రవారం ఇద్దరు విద్యార్థినులు రహదారి దాటుతున్న సమయంలో బొలెరో వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 9వ తర గతి చదువుతున్న వనజశ్రీ, ఆశారెడ్డి పాఠశాల ముగియగానే స్వగ్రామానికి వెళ్లేందుకు రహదారిపైకి వచ్చారు. ఆ సమయంలో బొలెరో వాహనం ఢీకొంది. ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

లారీ ఢీ.. యువకుడి దుర్మరణం

శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై గుండిశెట్టిపల్లి సమీపంలో లారీ బైకును ఢీకొనడంతో యువకుడు మృత్యువాత పడ్డాడు. శుక్రవారం రాత్రి బైకుపై వెళ్తున్న గుండిశెట్టిపల్లికి చెందిన రవికుమార్‌(30)ను శాంతిపురం వైపు నుంచి వి.కోట వైపునకు వెళ్తున్న బోరు సపోర్టింగ్‌ లారీ ఢీకొంది. దీంతో వెంకట్రామప్ప కుమారుడు రవికుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహమైంది. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించాయి. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌ అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement