వ్యాపారంగా ప్రణయ బంధం! నేటి తరం యువతీ యువకులు పెళ్లిని వ్యాపారంగా మార్చేశారు. పెళ్లితో ఆర్థికంగా పైకి ఎదగాలని భావిస్తున్నారు. | - | Sakshi
Sakshi News home page

వ్యాపారంగా ప్రణయ బంధం! నేటి తరం యువతీ యువకులు పెళ్లిని వ్యాపారంగా మార్చేశారు. పెళ్లితో ఆర్థికంగా పైకి ఎదగాలని భావిస్తున్నారు.

Mar 29 2026 7:03 AM | Updated on Mar 29 2026 7:03 AM

● బెట్టింగులను అలవాటుగా మార్చుకున్న కొందరు ● సెల్‌ఫోన్లతోనే సాగుతున్న తతంగం ● ఫోన్‌పే, జీపేలతోనే లావాదేవీలు ● ప్రాణాలు పోగొట్టుకుంటున్న బాధితులు

– IIలో

– IIలో

– IIలో

న్యూస్‌రీల్‌

పలమనేరు పట్టణానికి చెందిన ఓ యువకుడు బెట్టింగులతో తన వ్యాపారాన్ని వదులుకుని బెంగళూరు వెళ్లాడు.

పెద్దపంజాణి మండలానికి చెందిన ఒక యువకుడు బెట్టింగ్‌ల కారణంగా సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మదనపల్లికి చెందిన ఓ బీటెక్‌ విద్యార్థి పలమనేరులోని పాతపేటలో రూమ్‌లో ఉంటూ ఆన్‌లైన్‌ బెట్టింగుల్లో పాల్గొన్నాడు. తీవ్రంగా నష్టం రావడం.. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

చిత్తూరు జిల్లాలో గత మూడేళ్లల్లో పెద్ద సంఖ్యలోనే ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. చాలా వరకు అవి వెలుగుచూడలేదు.

ఈవీఎంల భద్రతపై రాజీపడొద్దు
ఈవీఎంల భద్రతపై రాజీ పడొద్దని కలెక్టర్‌ తెలిపారు. ఆయన ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేశారు.
ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు

మే 31 వరకు

ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

పలమనేరు: దేశంలో ఐపీఎల్‌ సీజన్‌ మొదలైంది. ఈ క్రమంలో క్రికెట్‌ బెట్టింగులు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెట్టింగు ముఠాలు రంగంలోకి దిగాయి. కొంచెం పెట్టుబడి పెడితే ఐపీఎల్‌ సీజన్‌ ముగిసేలోపు లక్షాధికారులవుతారని ఆశలు పెంచాయి. దీనికితోడు సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో కొంతమంది అప్పులు చేసి మరీ బెట్టింగుల రొచ్చులోకి దిగుతున్నారు. ప్రస్తు తం బెట్టింగులు మూడు రకాలుగా జరుగుతున్నా యి. కొంతమంది కలిసి ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా బెట్టింగులు చేస్తున్నారు. ఇంకొందరు రహస్య ప్రదేశాల్లో ఉంటూ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి గ్రూపుల్లోని వ్యక్తులతో చాటింగ్‌ చేస్తూ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు డార్క్‌నెట్‌ సాయంతో పనిచేసే ఆఫ్‌లైన్‌ యాప్‌లను వాడుతున్నారు. ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసిన రాయలపేటకు చెందిన చంద్రబాబు @radha.exchenge@ ఆఫ్‌లైన్‌ ద్వారా రూ.కోట్లు మోసాలకు పాల్పడిన విషయం సంచలనం కలిగించింది.

క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తే చర్యలు

బెట్టింగుల జోరు!

దేశంలో ఐపీఎల్‌–2026 సీజన్‌ ప్రారంభమైంది. అప్పుడే యువకులు.. క్రికెట్‌ అభిమానులు తమ అభిమాన జట్టు గెలుస్తుందంటే.. తమదే గెలుస్తుందని పేర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన బెట్టింగులు నేడు స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా అని మారుమూల గ్రామాలకు సైతం చేరాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఉద్యోగులు, యువకులు, కొంతమంది విద్యార్థులు సైతం ఈ రొంపిలోకి దిగుతున్నారు. సర్వస్వం కోల్పోయి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగుల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.

చిత్తూరు అర్బన్‌: ఐపీఎల్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడి హెచ్చరించారు. క్రికెట్‌ను ఒక ఆటగానే పరిగణించాలని, అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని బెట్టింగులకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నా రని తెలిపారు. ఎక్కడైనా బెట్టింగులు నిర్వహిస్తే ఫోన్‌–112, వాట్సాప్‌ 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు క్రికెట్‌ బెట్టింగుల కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏది ఏమైనా బెట్టింగుల కారణంగా యువకులు జీవితాలను నాశనం చేసుకుని తల్లిదండ్రులకు కడుపు కోతతోపాటు మనోవ్యథను కలిగిస్తున్నారు. చాలామంది యువకులు బైక్‌లను, ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలను అమ్ముకుంటున్నారు. అదీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలామంది బెట్టింగులను ఓ వ్యసనంలా మార్చుకున్నారు.

బెట్టింగులపై ప్రత్యేక నిఘా ఉంచాం

క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. పలమనేరు సబ్‌ డివిజన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగులపై ఇప్పటికే నిఘా ఉంచాం. బెట్టింగుల్లో బాధితులుగా మారిన వారి ద్వారా కీలక సమాచారాన్ని తెలుసుకుని బెట్టింగు ముఠాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎవరైనా బెట్టింగులకు పాల్పడుతుంటే 100 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.

– డేగల ప్రభాకర్‌, డీఎస్పీ, పలమనేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement