అపోలో స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అపోలో స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Mar 26 2026 7:46 AM | Updated on Mar 26 2026 7:46 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్‌ సిటీలో నిర్వహిస్తున్న ఇంటర్‌ స్కూల్‌ స్పోట్స్‌ టోర్నమెంట్‌ బుధవారం ప్రారంభమైంది. ఏకేసీ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ డే–2026లో భాగంగా చేపట్టిన ఈ క్రీడా పోటీలకు విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ఈ టోర్నమెంట్‌ను వీసీ వినోద్‌ భట్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్వహించిన టార్చ్‌ రన్‌ కార్యక్రమం క్రీడాస్ఫూర్తికి ప్రతీ కగా నిలిచింది. బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. తొలి బాస్కెట్‌ బాల్‌ పోటీని రిజిస్ట్రార్‌ ఎం.పోతరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు రిజిస్ట్రార్‌ ఎస్‌.అనీల్‌కుమార్‌, ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డాక్టర్‌ ఆల్ఫ్రెడ్‌ జె ఆగస్టీన్‌, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ జగదీశన్‌, ఏఐపీఎస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.భాస్కర్‌రెడ్డి, స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మురళీకష్ణ, ఫిజికల్‌ డైరెక్టర్లు దిలీప్‌, సుమలత, స్పోర్ట్స్‌ క్లబ్‌ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్‌ జి.స్వప్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement