హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..! | 72 Year Old Scottish Woman Sets Record In Grueling Hyrox Fitness Race Despite Triple Hip Replacements | Sakshi
Sakshi News home page

హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!

Mar 26 2026 12:14 PM | Updated on Mar 26 2026 1:17 PM

 72 Year Old Scottish Woman Smashes HYROX Records

సాధారణంగా మారథాన్‌, ఫుల్‌ మారథాన్‌.. వంటి పలు రకాల ఫిట్‌నెస్‌ ఫార్మాట్‌లో వృద్ధులు సైతం పాల్గొని రికార్డులు తిరగరాశారు. వాటన్నింటకంటే ఇటీవల సరికొత్తగా హైరాక్స్ అనే ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు ఈ ట్రెండ్‌ని ఆదరిస్తున్నారు కూడా. అయితే ఇది సాధారణ మారథాన్‌ వలే జస్ట్‌ పరుగు కాదు..మల్టీటాస్కింగ్‌ వర్కౌట్‌లుగా చెప్పొచ్చు. కాస్త క్లిష్టతరమైనది కూడా. అలాంటి కఠినమైన హైరాక్స్‌ ఫంక్షనల్‌ రేసింగ్‌ పోటీలో ఓ 72 ఏళ్ల మహిళ అవలీలగా రికార్డు నెలకొల్పింది. పైగా ఆమె తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఈ ఘనత సృష్టించడం విశేషం. ఎవరామె..? అంత ఏజ్‌లో ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..

స్కాట్లాండ్‌కి చెందిన 72 ఏళ్ల కరోల్‌ మున్నో అనే మహిళ ఈ ఘనతను సృష్టించింది. ఏకంగా మూడుసార్లు తుండి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ హైరాక్స్‌ ఫిట్‌నెస్‌ రేసులో రికార్డు నెలకొల్పిందామె. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఫిట్‌నెస్‌ రేసులలో ఒకటైన హైరాక్స్‌లో రికార్డులు బద్దలు కొట్టి అంచనాలకు మించి సత్తా చాటిందామె. ఈ హైరాక్స్‌ రేసులో పాల్గొన్న అత్యంత పైబడిన వారిలో ఒకరిగా..తన సహచర క్రీడాకారిణిలో పోటీపడి ఈ రికార్డుని సృష్టించింది. 

ఈ రేసు వ్యాయామం, ఓర్పుతో కూడిన పరుగు. చాలా ఓర్పుతో చేయాల్సి పోటీ ఇది. ఆమెకు మూడు హిప్‌ రీప్లేస్‌మెంట్లు జరిగాయి. అంటే అధిక శారీరక ప్రభావం చూపే కార్యకలాపాలను పరిమితం చేసే పరిస్థితి ఆమెది..అయినప్పటికీ డోంట్‌ కేర్‌ అంటూ అవలీలగా ఈ క్లిష్టమైన రేసులో సత్తా చాటి స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ. 

హైరాక్స్‌ అంటే..
ఇదొక గ్లోబల్‌ ఇండోర్‌ ఫిట్‌నెస్‌ రేస్‌. ఇందులో ఎనిమిది.. ఒక కిలోమీటరు పరుగు తోపాటు స్లైడ్‌పుష్‌లు, రోయింగ్‌, బర్పీలు, వెయిటెడ్‌ లంజెస్‌ వంటి ఎనిమిది ఫంక్షనల్‌ వర్కౌట్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంలే ఒకేసారి బలం, ఓర్పు, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి రూపొందించిన రేసింగ్‌ ఫార్మాట్‌ ఇది. సాంప్రదాయ మారథాన్‌లు లేదా జిమ్ పోటీల వలె కాకుండా, అత్యంత కఠినంగా, విభిన్నంగా ఉంటుంది. 

అలాంటి కఠినతరమైన ఈ రేసును వయసు పైబడి, అందులోనూ శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న వారికి పూర్తి చేయడం అత్యంత కష్టం. కానీ ఈ స్కాటిష్  బామ్మ అచంచలమైన పట్టుదల ఉంటే ఈ శారీరక ఇబ్బందులు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్‌ చేసింది. 

తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి..
సాధారణంగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి ఆపరేషన్‌లు చేయించుకుంటే..వారిని అధిక ప్రభావం చూపే వ్యాయమాల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఈ 72 ఏళ్ల బామ్మ ఆ అభిప్రాయాన్నే అందరూ ఆశ్చర్యపోయేలా తిరగరాసింది. 

అయితే ఈ బామ్మ క్రమం తప్పకుండా వర్కౌట్ల శిక్షణ తీసుకోవడం తోపాలు పలు రకాల వ్యాయామాలు మార్చుతుండటం వల్ల హైరాక్స్‌లో సులభంగా రాణించగలిగేలా ఓర్పుతో కూడిన బలం సంపాదించుకుంది. అలాగే వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించింది కూడా. కాగా ఈ సరికొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ హైరాక్స్‌ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో ఎక్కువగా జరుగుతాయి.

(చదవండి: పర్యాటక అద్భుతం..'రివర్‌కేఫ్‌'గా వంతెన!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement