పర్యాటక అద్భుతం..'రివర్‌కేఫ్‌'గా వంతెన! | Indian Army Builds Stunning River Cafe In Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

పర్యాటక అద్భుతం..'రివర్‌కేఫ్‌'గా వంతెన!

Mar 25 2026 5:21 PM | Updated on Mar 25 2026 5:48 PM

Indian Army Builds Stunning River Cafe In Arunachal Pradesh

మనసు పెట్టాలే గానీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అందుకు నిదర్శనం చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఆ వంతెన. మన సాయుధ బలగాలు ఆ వంతెనకు ప్రాణంపోసి కొత్తరూపం ఇచ్చారు. చెప్పాలంటే..అద్భుతమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చేశారు. అదంతా ఎక్కడ అంటే..

సాధారణంగా మంచి కేఫ్‌కి వెళ్లి ఓ కప్పు కాఫీ లేదా టీ సిప్‌ చేసి ఎంజాయ్‌ చేస్తాం. అలా కాకుండా ప్రకృతి మధ్య కొలువుదీరి..కింద జలజల పారే నది నడుమ కాఫీ/టీ తాగుతుంటే ఆ ఫీల్‌ వేరేలెవెల్‌. అలాంటి అనుభూతి కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రివర్‌ కేఫ్‌కి రావాల్సిందే. న్గ్యామ్‌జాంగ్ చూ నదిపై కొలువుదీరిన కేఫ్ ఇది. ఎన్నాళ్లుగానో వాడుకలో లేని వంతెనని భారత సైన్యం కేవలం 31 రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. 

ఆ వంతెనను కేఫ్‌గా మార్చి అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. వచ్చే పర్యాటకులు గల గల పారే నదిని తమ పాదాల కింద నుంచి చూస్తూ..చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ..భోజనం చెయ్యొచ్చు. ఆ కేఫ్‌ని గాజు భవంతిలా తీర్చిదిద్దడం విశేషం. సందర్శకులు వంతెనపైనే లేదా నదీ తీరంలోని కేఫ్ విభాగంలో కూర్చోవడానికి ఎంచుకోవచ్చు. 

ప్రతి ఒక్కటి విభిన్నమైన అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఆపరేషన్ సద్భావనలో భాగంగా, భారత సైన్యం కేవలం 31 రోజుల్లో ఈ కేఫ్‌ను నిర్మించింది. ఉపయోగంలో లేని సైనిక నిర్మాణాన్ని ప్రయాణికులు, బాటసారులు స్వాగతించే ప్రదేశంగా మార్చారు. ఈ కేఫ్‌ స్థానిక మోన్పా మహిళలచే నిర్వహించబడుతోంది. పర్యాటక ప్రదేశంగా మారుతున్న ఈ మారుమూల ప్రాంతానికి కొత్త జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది ఈ రివర్‌కేఫ్‌. సందర్శకులకు ఈ కేఫ్‌ పర్వతాలు, నదులు, మేఘావృత లోయల మధ్య మరుపురాని అనుభూతుల్ని అందిస్తుంది. 

 

(చదవండి:  రెంట్‌ ఏ ట్రీ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement