'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే మూడు గంటల ఎపిసోడ్‌లో, జెరోధా సహ వ్యవస్థాపకుడు బిలియనీర్ నిఖిల్ కామత్ యూకే మాజీ ప్రధాని రిషి సునాక్, భార్య అక్షతా మూర్తితో సరదా సంభాషణ నిర్వహించారు. ఆ సంభాషణలో నాయకత్వ వైఫల్యం, గుర్తింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ఆర్థికవ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రముఖ పోడ్‌కాస్ట్‌కు అతిథులుగా వచ్చిన తొలి జంట రిషి సునాక్, అక్షతామూర్తిలే. ఆ పాడ్‌కాస్‌లో ఈ దంపతులు షేర్ చేసుకున్న అమూల్యమైన విషయాలేంటో చూద్దామా..!.
ఆ పాడ్‌కాస్ట్‌లో రిషి ప్రధాని అనతరం లైఫ్, నేర్చుకున్న పాఠాలు, రాజకీయాల్లో కొనసాగనున్నారా?, యువ భారతీయులకు మార్గనిర్దేశం వంటి పలు అంశాలపై మాట్లాడగా, మూర్తి వారసత్వ విజయంలో ఉండే సవాళ్లు, తన గుర్తింపు, కుటుంబ అంచనాలు, తమ అభిప్రేయ బేధాల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
ఇక్కడ రిషి పదవి నుంచి వైదొలగిన అనతరం దీన్ని రాజకీయ ఓటమిగా కాకుండా, అరుదైన మానసిక పునఃప్రారంభంగా అభివర్ణించారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం.. తర్వాత ఏం చేయాలో అస్సలు తనకు తెలియలేదన్నారు. అయితే ఈ విరామ సమయంలోనే తనకు ఏం చేయాలి, ఏం కావలనేది క్షణ్ణంగా తెలుసుకోగలిగాను అన్నారు. ఇక్కడ మనల్ని మనం బాధతుగా భావించుకోకూడదు, ఆ రాజకీయ ఓటమిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలన్నారు. అంతేగాదు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాను ప్రస్తావిస్తూ..ఈ టైంలో కర్తవ్యంపై దృష్టి పెట్టడం సరైనది అని చెప్పారు రిషి.
అలాగే భారతీయ వినియోగ విప్లవాన్ని తరాల మార్పుగా అభివర్ణించారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఎన్నడూ చేయనంత స్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కొన్న వస్తువులు పిల్లల్లు కొనడం లేదు. ఈతరానికి కొత్తబ్రాండ్లు, స్వదేశీ ఉత్పత్తులు, ప్రామాణికత కావాలని అన్నారు. అంతేగాదు భారతీయ తల్లిదండ్రులు విద్యను మెరుగైన జీవితానికి కీలకంగా చూస్తారన్నారు.
తాను కూడా తన తల్లిదండ్రలును ఆ విషయంలో బాగా నిరాశపరిచనట్లు తెలిపారు. తన పేరెంట్స్ డాక్టర్ కావాలనుకుంటే..బదులుగా తాను రాజకీయాలు ఎంచుకున్నానని అన్నారు. అలాగే విద్య భవిష్యత్తు గురించి మాట్లాడుతూ కామత్ కాలేజ్‌కి వెళ్లకపోవడంపై అభద్రతాభావం వ్యక్తం చేయగా..సునాక్ ఇక్కడ నేర్చుకునే సామర్థ్యం ముఖ్యం అని చెప్పారు.
ఇప్పడు చాలామటుకు పరిశోధన కోసం క్లాడ్, ఐఏ సాధనాలు వినియోగిస్తున్నా..తాను మాతరం స్వయంగా ఆలోచించడానికే ప్రాధాన్యత ఇస్తా, అలాగే తన ప్రసంగాలు, వాదనాలు తానే స్వయంగా రాసుకుంటానని చెప్పారు రిషి. అంతేగాదు యువత రాకీయాల్లోకి రావడంపై కూడా రిషి మాట్లాడారు. చాలా స్థైర్యం, సహనం, సేవా దృక్పథం ఉంటే తప్పక రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ఆ మూడు లక్షణాలు ఉంటేనే 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగల శక్తి వస్తుందన్నారు.
ఇక అక్షతామూర్తి ఈ సంభాషణలో తన ఐడెంటిటీ గురించి మాట్లాడారు..తాను బ్రిటిష్ యాసతో మాట్లాడే బెంగళూరు అమ్మాయినని చెప్పారు. తన భర్త ప్రధాని, తండ్రి వ్యవస్థాపకుడు..కానీ ఇవేమి తన గుర్తింపు కాదని, తన ప్రభావమే తన ఐడెంటీటిగా మార్చుకుంటానని అన్నారామె.
చివరగా ఆ పాడ్‌కాస్ట్‌లో ఇద్దరిలో తమకు నచ్చే అంశాల గురించి కూడా షేర్ చేసుకున్నారు. రిషి పనిచేసేముందే క్షణ్ణంగా ఆలోచిస్తే..తాను మొదలు పెట్టాక..ఏం చేస్తే బెటర్ అని ఆలోచించుకుంటానని అన్నారు అక్షతా. ఇక పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో రిషి విశ్లేషణను విశ్వసిస్తానని, ఆయన తన సూక్ష్మదృష్టిని నమ్ముతాడని అక్షతా చెప్పుకొచ్చారు. ఇక సునాక్ వైవాహిక బంధం వల్ల ఇదంతా చేయగలిగాను..ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తన భార్యకే క్రెడిట్ ఇస్తూ..ఆమె మద్దతు లేకుండా ఏమి చేయలేనని అన్నారు రిషి.
(చదవండి: హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!)


