పలాము: పరీక్షల్లో పాస్ కావడానికి కొందరు విద్యార్థులు రకరకాల అడ్డదారులు తొక్కుతుంటారు. కొందరు కాపీ కొడితే, మరికొందరు ఇన్విజిలేటర్లను బతిమాలుకుంటారు. అయితే జార్ఖండ్‌లో ఒక విద్యార్థి ఏకంగా తన ఆన్సర్ షీట్‌లో నగదు పెట్టి టీచర్‌కు ‘ఆఫర్’ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
జార్ఖండ్ బోర్డు పరీక్షలు ముగియడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. పలాము జిల్లాలోని ఒక సెంటర్‌లో ఉపాధ్యాయులు సంస్కృతం పేపర్లను దిద్దుతుండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. ఒక విద్యార్థి పేపర్ లోపల రెండు 500 రూపాయల నోట్లను (మొత్తం రూ. 1000) ఉంచాడు. తనను ఎలాగైనా పాస్ చేయాలని ఆ విద్యార్థి అందులో కోరినట్లు సమాచారం.
టీచర్ రియాక్షన్ అదిరిపోయింది
డబ్బులు చూసి ఆ ఉపాధ్యాయుడు ఏమాత్రం ప్రలోభానికి లోనుకాకుండా, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించారు. ఆన్సర్ షీట్‌లో సమాధానాలు లేకపోవడంతో ఆ ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. కేవలం రాసిన సమాధానాలకు మాత్రమే మార్కులు వేస్తామని, ఇలాంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ నగదుతో కూడిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
విద్యానిపుణుల హెచ్చరిక
ఇలాంటి అడ్డదారులు తొక్కడం వల్ల విద్యార్థుల విద్యా రికార్డులు పాడవడమే కాకుండా, వారి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పరీక్షల కోసం కష్టపడి చదవాలే తప్ప, ఇలాంటి పనుల వల్ల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని వారు అభిప్రాయపడుతున్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షార్ట్‌కట్ పద్ధతులు కాకుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే విద్యార్థులకు మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్


