– ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం
కార్వేటినగరం: పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు చిత్తూరు జిల్లాలోని వంటిళ్లలో మంట పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నూనె ధరలు ఒక్క సారిగా పెరిగి జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో లీటరు నూనె ధర రూ.5 నుంచి 10 రూపాయల మేర పెరిగింది. జిల్లాలో రోజుకు సుమారు 120 టన్నులకు పైగా ఆయిల్ విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. 10 రోజుల క్రితం ఒక కంపెనీ ఆయిల్ ధర రూ, 162 ఉండగా ప్రస్తుతం రూ, 170కి పెరిగింది. మరోక రకం ఆయిల్ ధర రూ.115 నుంచి 125కి చేరింది.ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నూనె ధరలు దిగి రాకుంటే ఆహారం పదార్థాల ధరలు పెంచక తప్పదని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.


