జగనన్నతోనే మైనారిటీల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే మైనారిటీల అభివృద్ధి

Mar 23 2026 8:30 AM | Updated on Mar 23 2026 8:30 AM

● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. పెనుమూరు మండలానికి చెందిన జిల్లా కోఆప్షన్‌ మెంబర్‌ అమీన్‌తో పాటు మైనారిటీ నేతలు ఆదివారం పుత్తూరులోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలసి ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాను న్న 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. జగనన్న పాలనలోనే ముస్లిం, మైనారిటీలకు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించమే కాకుండా మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని అందించిన ఘనత కూడా జగనన్నదేనని, అదే విధంగా మైనారిటీలకు అన్ని రంగాల్లోను అగ్ర పీఠం వేసి అన్ని విధాలుగా ఆదుకోవడంలో జగన్‌మోహన్‌రెడ్డిది కీలక పాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని మైనారిటీ సంఘాల నేతలు ఏకతాటిపై నిలిచి 2029 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి మళ్లీ సంక్షేమాలను అందుకోవాలని సూచించారు . ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రిని గజమాలతో ముస్లిం నాయకులు ఘనంగా సన్మానించారు. సీనియర్‌ నాయకులు అమీన్‌, ఉమర్‌అలీ, షబ్బీర్‌, అమృత్‌, ఇమ్రాన్‌, ముహాక్తీయర్‌,షయూబ్‌,జునైద్‌, నవాబ్‌, జాఫర్‌, కౌసర్‌ పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement