కోడెగిత్తల జోరు | - | Sakshi
Sakshi News home page

కోడెగిత్తల జోరు

Mar 23 2026 8:30 AM | Updated on Mar 23 2026 8:30 AM

● దుమ్మురేపిన ఎద్దుల పందేలు ● జగన్‌ నినాదంతో హోరెత్తిన పాతగుంట

వెదురుకుప్పం: పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని పాతగుంటలో జరిగిన జల్లికట్టు(ఎద్దుల పందేలు) దుమ్మరేపాయి. అట్టహాసంగా సాగిన జల్లికట్టు యువకుల్లో జోష్‌ తెచ్చింది. రామచంద్రాపురం, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఎద్దులను పందేనికి తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎద్దులకు పలకలు, వస్త్రాలు కట్టి పందేలకు వదిలారు. కోడెగిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోగా ఎద్దులను నిలువరించి పలకలు పట్టేందుకు యువత పోటీపడ్డారు. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి యువకులు ఆనందం పంచుకున్నారు. ఈ పోటీల్లో ఎద్దుల కింద పడి పలువురు గాయపడ్డారు. చెరువులో పడి రెండు కోడె గిత్తలు మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు.

సందడే..సందడి

పాతగుంటలో ఆదివారం జరిగిన జల్లికట్టులో జగన్‌ నినాదంతో మారుమోగింది. యువత పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటంతో కూడిన పలకలు, వైఎస్సార్‌సీపీ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ జెండాలు, పలకలతో కూడిన కోడె గిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోతున్న క్రమంలో యువత జై జగన్‌ జైజై జగన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు స్థానిక సర్పంచ్‌ భువనేశ్వరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ గోవిందన్‌, వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి బొజ్జారెడ్డి అల్లె వద్ద పూజలు చేసి పోటీలు ప్రారంభించారు.

ఎద్దుల పందేలను ప్రారంభిస్తున్న సర్పంచ్‌ భువనేశ్వరి

జనసందోహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement