తిరుపతి సిటీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ టెక్నాలజీకి దోహదపడేలా ఎస్వీయూ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీయూ వీసీ చాంబర్‌లో ఆయన క్వాంటమ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యవస్థకు దోహదపడేలా విద్యార్థులను, పరిశోధకులను, అధ్యాపకులను సిద్ధం చేయడంలో ఎస్వీయూ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు పాల్గొన్నారు.


