శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సతమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చందన, పంచామృతం, క్షీర, నారికేళ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


