టమాట గుజ్జుతో సాస్ చేసే పనుల్లో పరిశ్రమలు బిజీగా ఉంటున్నాయి. ధరలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు.
24న అథ్లెటిక్స్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్: శాప్ లీగ్‌లో భాగంగా ఈనెల 24న చిత్తూరులోని డీఎస్‌ఏ స్టేడియంలో మాస్టర్ వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ ఉదయభాస్కర్ తెలిపారు. 100, 400, 800, 1,500 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో, షాట్‌ఫుట్, హైజంప్, జావెలిన్‌త్రో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 35–45 సంవత్సరాలలోపు పురుషులు/మహిళలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల వారు https:// sports. ap.gov.in అనే వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలు ఈనెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
చిత్తూరులో
చేనేత–హస్తకళా మేళా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత–హస్తకళా మేళా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు వినియోగదారులను మెప్పిస్తున్నాయి. మేళాలో సిల్క్, కాటన్‌తో తయారైన పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఎంబ్రాయిడరీ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గద్వాల్, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ వంటి ప్రసిద్ధ చేనేత ప్రాంతాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. ఇక బెడ్‌షీట్లు, బెడ్‌కవర్లు, హ్యాండ్‌క్రాఫ్ట్ వస్తువులు, కాటన్ షర్టింగ్ వంటి అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఈ మేళా ద్వారా జిల్లా ప్రజలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తులు అందించడంతో పాటు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మేనేజర్ సంజెమ్ జెయిన్ తెలిపారు.


