తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉగాది విశిష్టత ప్రతిబింబించేలా శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో హైగ్రీవుడిని సంహరించి, నాలుగు వేదాలను రక్షించి, బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న దృశ్యాన్ని టీటీడీ శిలారూపంలో ఆవిష్కరించింది. అలాగూ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద చేసిన పుష్పాలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి ఆలయం ముందు శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాన్ని ఉద్యానవన విభాగం కార్మికులు కళాత్మకంగా రూపొందించారు. మరోవైపు, శ్రీరాముడు, చిన్నికృష్ణుడు, వేణుగాన కృష్ణుడి నమూనాలు ఉగాది ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మికతను జోడించాయి. – తిరుమల
ఆలయం వెలుపల పుష్పాలతో రూపొందించిన ఏనుగులు
వేదాలను బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న శ్రీమహావిష్ణువు
ఆవు, దూడలతో ఆడుకుంటున్న రాధాకృష్ణులు
మామిడికాయలను చోరీ చేస్తున్న చిన్నికృష్ణుడు


