కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకూ న్యా యం చేస్తామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ కుప్పం సమన్వయకర్త భరత్ తెలిపా రు. ఆయన శుక్రవారం కుప్పంలోని పార్టీ కార్యాలయంలో గుడుపల్లె నాయకులతో సమావేశమయ్యారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ న మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సారి నాయకులు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు తెలిపారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలేసి వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేయడంపైనే దృష్టి పెట్టిందని దుయ్య బట్టారు. కూటమి నేతలు అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామని, కక్ష సాధింపులకు పాల్పడితే రిటర్న్ గిప్టులు తప్ప వని హెచ్చరించారు. అనంతరం గుడు పల్లె మండల మహిళా అధ్యక్షురాలిగా మణిమేఘలకు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణ, జెడ్పీటీసీ కృష్ణమూర్తి, చెండ్రాయన్, సంపంగి, అన్ని పంచాయతీల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.


