అటు గంజాయి.. ఇటు టులిప్స్!
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ఇటీవల గంజాయి వాడకం విచ్చలవిడిగా తయారయ్యింది. పలు జూనియర్ కళాశాలల నుంచి డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల ఆవరణలో గంజాయి నింపిన సిగరెట్లను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ‘జాయింట్’గా పిలుచుకుంటున్న గంజాయి సిగరెట్ల పట్ల యువత సులువగా ఆకర్షితులైపోతున్నారు. ఒక్కో సిగరెట్ రూ.100 రూ.200 వరకు దొరుకుతోంది. జిల్లాలోకి వచ్చే ప్రధాన గంజాయి వనరు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని సరిహద్దు జిల్లాల నుంచే చిత్తూరులోకి ఎక్కువగా వస్తోంది. అయితే పూతలపట్టులోని బండపల్లె గంజాయి డంప్ కేంద్రంగా ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడి నుంచి పలమనేరు.. బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న పలువురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.
బాల్యానికి టులిప్ భయం
గంజాయి విషయం అటుంచితే.. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు పాఠశాల స్థాయి విద్యార్థుల్లోకి వెళుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు, నగరి, పలమనేరు ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని టులిప్స్‌గా పిలుచుకుంటున్నారు. చిత్తూరు నగరంలో ప్రతి ఒక్క దుకాణంలో పొగాకుతో తయారైన ఈ టులిప్ ప్యాకెట్లు లభిస్తున్నాయి. చిన్నచిన్న పొట్లాల్లో కనిపించే వీటిని తీసుకుని నాలుకపై పెట్టుకోవడం, నోట్లో పెట్టుకుంటే మత్తు ఎక్కుతుందని భావించి పిల్లలు వీటికి బానిసై పోతున్నారు. చిత్తూరులో టులిప్ నియంత్రణ చేయిదాటిపోతోంది. నిత్యం పోలీసులు పాఠశాలల ఆవరణల్లో తనిఖీలు చేస్తూ, వీటిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నా.. అంతే మొత్తంలో మళ్లీ మార్కెట్‌లోకి ప్రత్యక్షమవుతోంది. వీటిని దిగుమతి చేస్తున్న స్మగ్లర్లను పట్టుకుంటే తప్ప ఈ జాడ్యంకు కళ్లెం వేయడం సాధ్యం కాదు.
చిత్తూరులో పొగాకు ఉత్పత్తులపై దాడులు చేస్తున్న పోలీసులు, అధికారులు
గుడిపాల స్టేషన్ వద్ద రెండు రోజుల క్రితం సీజ్ చేసిన పొగాకు ఉత్పత్తులు
ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీడీ రవికుమార్
వెదురుకుప్పం: జాబ్ కార్డ్ అప్‌లోడ్ ఎందుకు చేయలేదంటూ టీకేఎం పురం క్షేత్ర సహాయకుడుపై డ్వామా పీడీ రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కింద గ్రామాల్లో వివిధ పనుల కోసం 10.79 కోట్లు నిధులు వెచ్చించారు. దీనికి సంబంధించి సామాజిక తనిఖీ జరగగా మంగళవారం వెదురుకుప్పంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ రవికుమార్ ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం బుక్‌లు కళ్లుమూసుకుని రాస్తావా అంటూ జేఈ మునిరత్నంను అడిగారు. మొక్కల పెంపకానికి సంబంధించి బిల్లులు ఎలా చెల్లించారని టెక్నికల్ అసిస్టెంట్ రూపేష్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఏపీడీ సునీల్ కుమార్, ఎంపీడీఓ పురుషోత్తం, ఏపీఓలు మీనాకుమారి, ఇందు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 22,267 రికవరీకి ఆదేశం
మండలంలోని 2024–2025 సంవత్సరంలో జరిగిన గ్రామీణ ఉపాధి పథకంలో వేజ్ పేమెంట్ కింద రూ.7.79 కోట్లు, మెటీరియల్ పనుల కింద రూ. 3 కోట్లు ఖర్చు పెట్టగా ఇందులో రూ.22,267 రికవరీకి పీడీ రవికుమార్ ఆదేశించారు. వీటిని తక్షణమే రికవరీ చేయాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అటు కర్ణాటక.. ఇటు తమిళనాడు.. మధ్యలో చిత్తూరు జిల్లా. 15 నిమిషాల్లో రాష్ట్రం దాటే అవకాశం. ఈ మాత్రం హింట్ ఇస్తే రెచ్చిపోతాం అన్నట్లు.. స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రధానంగా గంజాయితో పాటు ఇప్పుడు పొగాకు ఉత్పత్తులు జిల్లాలోకి భారీగా దిగుమతి అవుతున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారవుతోంది.
సీరియస్‌గా తీసుకుంటాం
టులిప్స్, గుట్కా లాంటివాటిపై కొన్ని చోట్ల నిషేధం ఉంటే.. మరికొన్ని చోట్ల విక్రయాలు చేసుకునే వెసులుబాటు ఉంది. మన జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు అంతర్రాష్ట్రాలకు చేరువలో ఉండడంతో పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతవుతున్నాయి. అయినాసరే మా వాళ్లు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నారు. ఇదే వృత్తిగా ఎంచుకున్న స్మగ్లర్లను ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదు. దీనిపై సీరియస్‌గా ముందుకు వెళుతున్నాం. చర్యలు కఠినంగా ఉంటాయి. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు.


