చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన ఏసీబీ తనిఖీలు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం సాయంత్రం 4.55 గంటలకు తనిఖీలు ప్రారంభించి 24 గంటలు పూర్తిగా తనిఖీలు చేశారు. సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన సమయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక అటెండర్ అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఆ సిబ్బంది మంగళవారం సైతం విధులకు హాజరు కాలేదు. సబ్‌రిజిస్ట్రార్, ఇతర విభాగాల సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు, వారి అసిస్టెంట్లను విచారించారు. పలు ఫైల్స్‌ను పరిశీలించారు. నిషేధిత భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని ఏసీబీ గుర్తించి, వివరాలు సేకరించింది. ఏసీబీ తనిఖీల సమయంలో కార్యాలయంలోని వివిధ ప్రదేశాల్లో రూ.30,200, ఉద్యోగుల వద్ద రూ.4,440, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.79,090 లభించాయి. అనధికార నగదు రూ.1,12,730ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 15 మంది దస్తావేజు లేఖరుల్ని విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
కార్యాలయ ఆవరణలో డాక్యుమెంట్ రైటర్లు
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు


