– నిరాహార దీక్షకు మద్దతు పలికిన సీపీఐ జాతీయ కార్యదర్శి
నగరి: ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమ లు, పెండింగ్ డీఏల విడుదల, ఆర్థిక బకాయిల సాధ న కోసం రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాలలో ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మంగళవారం చిత్తూరు జిల్లా, నగ రి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఈ నిరాహార దీక్షా శిబిరంలో యూటీఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మణిగండన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. 12వ పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లవుతున్నా అమలుకు ప్రయత్నించకపోవడం ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలను అమలు చేయడంతో పాటు, ఆర్థిక బకాయిలన్నిటినీ ఆరు మాసాలలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూట మి ప్రభుత్వం ఆ వైపుగా కనీసం ఆలోచించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. తిరుపతి జిల్లా సహాధ్యక్షురాలు గీతమ్మ మా ట్లాడుతూ తక్షణం నూతన పీఆర్సీని ఏర్పాటు చేసి అది అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11500 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ మెమో నెంబరు 57 మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతర్ చేసిందని జిల్లా కార్యదర్శి కె.వంశీకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహరదీక్షలు చేపడతామన్నారు. అప్పటికీ చలించకుంటే ఏప్రిల్ 22వ తేదీ చలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శేఖర్, పూర్వ రాష్ట్ర కౌన్సిల ర్లు పీఆర్ మునిరత్నం, కుప్పరాజు, జిల్లా నాయకులు జయరాజ్, నరేష్, రవీంద్రబాబు, కొలత్తూరు భాస్క ర్, జాన్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులతో పాటు నిరాహార దీక్షా శిబిరంలో బైఠాయించారు. కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓ అనుపమకు వినతిపత్రాన్ని అందజేశారు.


