రెండు ఇసుక లారీలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక లారీలు సీజ్‌

Mar 27 2026 8:52 AM | Updated on Mar 27 2026 8:52 AM

– నలుగురి అరెస్టు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు మీదుగా తమిళనాడుకు ఇసుక తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మెట్టి కంటయ్య కథనం మేరకు... గురువారం బెంగళూరు–చైన్నె జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి తమిళనాడుకు రెండు లారీల్లో ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించి అడ్డుకున్నారు. తమిళనాడుకు చెందిన పళణి (35), బాబు (45), నటరాజన్‌ (30), సుకుమార్‌ (29) అనే నలుగురిని అరెస్టు చేశారు. వారి యజమానులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంపై

రైతులతో చర్చాగోష్టి

చంద్రగిరి: ఎస్వీ అగ్రికల్చర్‌ కళాశాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రకృతి వ్యవసాయంపై గురువారం రైతులతో చర్చాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సుమతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 160 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ రెడ్డిశేఖర్‌, ప్రసాద రావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు కేవీ నాగమాధురి, ఎస్‌ మురళీకృష్ణ, ఎస్‌. కలీముల్లా, కె. విశ్వనాథ్‌, పి.మహేశ్వరరెడ్డి, టీఎం హేమలత, బి. సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

దొంగ ప్రేమజంట

తొట్టంబేడు: ఆ ప్రేమజంట రూటే వేరు. దర్జాగా దొంగలించడం ఆ మొత్తంతో జల్సాలు చేయడం వారి నైజం. తొట్టంబేడు పోలీసు కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన కిరణ్‌ ఐటీఐ వరకు చదివాడు. జియో టవర్‌ వద్ద టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అయితే అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. కసి పెంచుకున్న అతను తన ప్రియురాలితో కలసి స్కెచ్‌వేశాడు. అదే కంపెనీకి చెందిన టవర్ల వద్ద పరికరాలను చోరీ చేసేందుకు ప్లాన్‌ వేశాడు. సెల్‌ఫోన్‌ వాడితే పోలీసులకు పట్టుపడతామని, వాకీటాకీలతో చోరీలకు పాల్పడ్డారు. పోలీసు రెక్కీతో బుధవారం పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 40 రోటర్లు, డమ్మీగన్‌, రెండు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అవగాహన కల్పించండి

చిత్తూరు కలెక్టరేట్‌: జనగణన ప్రక్రియపై ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. గురువారం జనగణనపై మాస్టర్‌ ట్రైనర్లకు కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా చేప ట్టే గృహ గణనలో గృహ నిర్మాణం, సామాజిక–ఆర్థిక వివరాలు ఇతర అంశాలపై సమగ్ర డేటాను అందించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనలో

అప్రమత్తంగా ఉండాలి

తిరుపతి తుడా: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 30న తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన నున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో ఏర్పాట్ల ను అధికారులతో కలసి కమిషనర్‌ తనిఖీ చేశారు. అన్ని మార్గాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ వెంట ట్రైనీ కలెక్టర్‌ రఘువంశీ, అదనపు కమిషనర్‌ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement