ఈద్ ముబారక్ !
నెల‘రోజా’లు భక్తిశ్రద్ధలతో సాగిన దీక్షలు శుక్రవారం నెలవంక తొంగి చూడడంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఈద్గాలకు ర్యాలీగా వెళ్లి సామూహికంగా నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పండుగపూట బంధుమిత్రులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు తోచిన ధాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. – పలమనేరు


