పోలీసు గ్రీవెన్స్‌కు 35 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీసు గ్రీవెన్స్‌కు 35 ఫిర్యాదులు

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 35 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదుపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్‌ హౌస్‌ అధికారులతో మాట్లాడారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement