జిల్లా మానిటరింగ్‌ కోఆర్డినేటర్స్‌ నియామకం | - | Sakshi
Sakshi News home page

జిల్లా మానిటరింగ్‌ కోఆర్డినేటర్స్‌ నియామకం

Mar 18 2026 11:08 AM | Updated on Mar 18 2026 11:08 AM

● రూ, 15,350 నగదు, 7 పందెం కోళ్లు స్వాధీనం

చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల పర్యవేక్షణకు జిల్లా మానిటరింగ్‌ కోఆర్డినేటర్స్‌ నియమించారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మురళికృష్ణ (సూపరింటెండెంట్‌) ను నియమించారు. ఆయన రెండు జిల్లాల పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తారు. అలా గే ఏప్రిల్‌ 4,5 తేదీల్లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ట్యాబ్‌ ఆధారిత మార్కుల ఎంట్రీ సిస్టమ్‌ను, మూల్యాంకనం పనితీరును పరిశీలన చేస్తా రు. పదో తరగతి మూల్యాంకన కేంద్రాల్లో 300 ఎంబీపీఎస్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీకి అనుమతులిచ్చారు. ట్యాబ్‌ పరికరాల నిరంతర చార్జింగ్‌, పవర్‌ సాకెట్‌లతో కూడిన పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇందుకు గాను ప్రత్యేక నిధులను కేటాయించారు.

నేడు దివ్యాంగ శక్తి ప్రారంభం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బుధవారం చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రారంభించనున్నట్లు డీపీటీఓ రాము ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పథకం ద్వారా 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారికి సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని పేర్కొన్నారు. నాన్‌–స్టాప్‌, ఇంటర్‌స్టేట్‌ సర్వీసులకు ఈ సౌకర్యం వర్తించదని స్పష్టం చేశారు.100 శాతం దృష్టి లోపం లేదా మేధోపరమైన వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. డిజిటల్‌ బస్‌ పాస్‌ కలిగిన వారు తప్పనిసరిగా సదరన్‌ సర్టిఫికెట్‌ వెంట తీసుకెళ్లాలని, కండక్టర్లు అర్హతను పరిశీలించి జీరో ఫేర్‌ లేదా రాయితీ టికెట్లు జారీ చేస్తారని వివరించారు.

కాణిపాకంలో కియోస్క్‌లు

కాణిపాకం: భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కీలక కాణిపాకం దేవస్థానంలో ముందడుగు పడింది. ఆలయంలో టికెట్లు, ఆర్జిత సేవ లు, విరాళాలు సులభంగా పొందేందుకు ఆలయ అధికారులు 8 కియోస్క్‌ మిషన్లను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్‌లను ఎమ్మెల్యే మురళీమోహన్‌ మంగళవారం ప్రారంభించారు. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మిషన్లు భక్తులకు వేగవంతమైన సేవలు అందించనున్నాయి. ప్రారంభానికి ముందు ఆర్జిత సేవా కౌంటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్‌ మణి నాయుడు, ఈవో పెంచ లకిషోర్‌, బోర్డుసభ్యులు పాల్గొన్నారు.

14 మంది పందెం రాయుళ్లపై కేసు

పెనుమూరు (కార్వేటినగరం): కోడి పందేలు ఆడుతున్న 14 మందిపై దాడులు చేసి కేసు నమోదు చేసిన సంఘటన పెనమూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా... మండల పరిధిలోని శాతంభాకం పంచాయతీ బలిజపల్లి చెరువుకు తూర్పుభాగాన ఖాళీ స్థలంలో మామిడి చెట్టు కింద కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన రహస్య సమాచార మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో రూ.15,350 నగదు, ఏడు కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కోడి పందేలు ఆడుతున్న 14 మంది అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మనేక్‌షా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో ఎంఓయూ

ఏర్పేడు: దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో నూతన ఆవిష్కరణల కోసం తిరుపతి ఐఐటీ, ద మనేక్‌షా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీలో మంగళవారం ఐఐటీ డైరెక్టర్‌ కేఎన్‌ సత్యనారాయణ, మానేక్‌షా సెంటర్‌ ముఖ్య పోషకుడు, గౌహటి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దేవేంద్ర జలిహాల్‌ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా భద్రతా సంస్థలు, ప్రముఖ భాగస్వాముల సహకారంతో రక్షణ, ఏరోస్పేస్‌, అంతరిక్ష రంగంపై అధునాతన పరిశోధనలు చేయనున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మనేక్‌షా సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డా. సుబ్రతా సాహా, మానేక్‌షా సెంటర్‌ సీవోవో శంఖ సువ్ర భౌమిక్‌, తిరుపతి ఐఐటీ రీసెర్చ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement