ప్రీ పెయిడ్‌ విద్యుత్‌! | - | Sakshi
Sakshi News home page

ప్రీ పెయిడ్‌ విద్యుత్‌!

Mar 28 2026 7:41 AM | Updated on Mar 28 2026 7:41 AM

లేకుంటే అంధకారంలో ఉండాల్సిందే జిల్లాలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు షురూ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్లు

కరెంట్‌ కావాలంటే ఇక నుంచి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అలా చేసుకుంటేనే ఇంటిలో బల్బులు వెలుగుతాయి. లేదంటే అంధకారంలో ఉండాల్సిందే. ప్రస్తుతం కరెంటు బిల్లు కట్టేందుకు కొన్ని రోజులు గడువు ఉంది. అది దాటినా అపరాధ రుసుంతో కట్టేసుకోవచ్చు. స్మార్ట్‌ మీటర్‌ మన గోడకు వేలాడిందంటే ఆ సదుపాయాలన్నీ ఆగిపోతాయి. సెల్‌ఫోన్‌, డీటీహెచ్‌ మాదిరిగా రీచార్జ్‌ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్లను బిగిస్తున్నారు. ఇది పూర్తయి ఇళ్లకు కూడా బిగిస్తే ముందుగా రీచార్జ్‌ చేసుకోలేని పేదలు, మధ్య తరగతి ప్రజలు మళ్లీ చిన్న దీపాల వెలుగులో బతకాల్సి వస్తుంది.

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు జిల్లాలో అన్నిరకాల విద్యుత్‌ కనెక్షన్లు 7.60 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ వృథా ఎక్కువగా అవుతోందని, దీన్ని అరికట్టేందుకు స్మార్ట్‌ మీటర్లను అమర్చుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందించే వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చుతామంటే కూటమి నేతలు వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పెద్దలు గృహ వినియోగదారులకు సైతం స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుచేస్తున్నారు. దీనిపై ప్రజలతో పాటు ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. గృహ వినియోగానికి సంబంధించి స్మార్ట్‌ మీటర్లు బిగించుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. ఈ క్రమంలో ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని నిర్ణయించింది. జిల్లాలో 18 వేల సర్వీసులకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ప్రతినెలా రీచార్జ్‌ చేసుకోవాల్సిందే

స్మార్ట్‌ మీటర్లుగా పిలిచే ప్రీ పెయిడ్‌ మీటర్లకు ప్రతినెలా రీచార్జ్‌ చేస్తేనే విద్యుత్‌ సరఫరా అవుతుంది. వినియోగదారులు 12 నెలల విద్యుత్‌ బిల్లులను పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ వినియోగంపై ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రీచార్జ్‌ చేసుకోవాలి. మూడు రోజులు ముందుగానే రీచార్జ్‌ చేసుకోవాలని వినియోగదారుడికి అలెర్ట్‌ మేసేజ్‌ వస్తుంది. అందులో అంతకు ముందు రీచార్జ్‌ చేసుకున్న మొత్తం.. విద్యుత్‌ వినియోగం.. ఇంకా ఎంత రీచార్జ్‌ చేసుకోవాలి.. అన్న విషయాలు ఉంటాయి. దాన్ని బట్టి తదుపరి నెలలో విద్యుత్‌ వినియోగంపై ఒక అవగాహన వస్తుంది. ఒక వేళ రీచార్జ్‌ చేయడం ఆలస్యమైతే ఆటోమేటిక్‌గా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. రీచార్జ్‌ చేసుకున్న తర్వాతే సరఫరాను పునరుద్ధరిస్తారు. ఇందుకోసం స్మార్ట్‌ మీటర్ల కంపెనీ ఒక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి తమ సిబ్బందితో మానిటరింగ్‌ చేస్తూ ఉంటుంది.

ప్రజల్లో భయాందోళనలు

స్మార్ట్‌ మీటర్లపై ప్రజల్లో భయాందోళనలు నెల కొన్నాయి. గతంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌ సహా కూటమి నేతలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సభల్లో మాట్లాడిన సందర్భంగా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయానికి గురిచేశారు. ఇప్పుడు వారే స్మార్ట్‌ మీట ర్లు బిగించాలని చెబుతుండడంతో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా ప్రజ లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విద్యుత్‌ వృథాను అరికట్టేందుకేనని చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు సంబంధించి స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అన్నిరకాల ప్రభుత్వ కార్యాలయాలు సుమారు 18 వేలు ఉన్నాయి. ఇప్పటికే 98 శాతం వరకు కార్యాలయాలకు మీటర్లు అమర్చారు.

రీచార్జ్‌ చేసుకుంటేనే విద్యుత్‌ సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement