– నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో విద్యార్థినుల భద్రతను మరింత మెరుగు రిచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడంతో పాటు, క్రమశిక్షణను పర్యవేక్షించడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టారు. 8 కేజీబీవీల పనితీరును జిల్లా కేంద్రంలోని సమగ్రశిక్ష శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఏర్పా టు చేసిన మానిటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. సిబ్బంది పనితీరు, విద్యార్థుల ఆహార నాణ్యతను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించవచ్చని తెలిపారు. కేజీబీవీ జీసీడీఓ ఇంద్రాణి పాల్గొన్నారు.
నిఘా నీడలో విద్యాలయాలు


