పొగాకు ఉత్పత్తుల రవాణా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

పొగాకు ఉత్పత్తుల రవాణా గుట్టురట్టు

Mar 24 2026 7:04 AM | Updated on Mar 24 2026 7:04 AM

యాదమరి: అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను యాదమరి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్‌ తెలిపిన వివరాలు మేరకు.. సోమవారం ఉదయం యాదమరి పోలీసు బృందం బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టాటా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎటువంటి బిల్లులు లేకుండా పొగాకు ఉత్పత్తుల ప్యాకె ట్లు బయటపడ్డాయి. బెంగళూరుకు చెందిన వాహన డ్రైవర్‌ నదీమ్‌ పాషా, తబ్రీజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అదే ప్రాంతానికి చెందిన తమ యజమాని ఆదేశాల మేరకు సరుకుని తిరుపతికి తరలిస్తున్నామని వెల్లడించారు. వాహనంలో సుమారు రూ.8,99,496 విలువ చేసే 93 సంచుల పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

వరల్డ్‌ టీబీడే వేడుకలు రేపు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరులో మంగళవారం వరల్డ్‌ టీబీ డే–2026 వేడుకలు నిర్వహించనున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్‌ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి గాంధీ విగ్ర హం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నా రు. సమావేశంలో టీబీ నిర్మూలనపై అవగాహన కల్పించ డంతో పాటు టీబీ ముక్త పంచాయతీ కార్యక్రమంలో భాగంగా 27 టీబీ రహిత పంచాయతీలకు గాంధీ విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఉత్తమంగా పనిచేసిన వారికి సత్కారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్‌

పాలసముద్రం : మండలంలోని బలిజకండ్రిగ సమీపంలో టీటీడీ దేవస్థానానికి ఎదురూగా ధర్మరాజుల గుడికి తూర్పు భాగమైన అడవిలో పేకాట ఆడుతున్న వారిపై సోమవారం నగరి ఇచార్జ్‌ డీఎస్సీ సాయినాథ్‌, కార్వేటినగరం సీఎం హనుమంతప్ప, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌బీ కానిస్టేబుల్‌ శివకుమార్‌, ఐడీ సిబ్బంది దాడి చేశారు. బలిజకండ్రిగ సమీపంలో రాత్రి పూట పేకాట ఆడుతున్నట్టు అందిన రహస్య సమాచారం మేరకు ఎస్పీ తుషార్‌డూడీ ఆదేశాలతో దాడి చేసినట్టు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లు పట్టుబడగా.. మరో ఎనిమిది మంది పరారైనట్టు పేర్కొన్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.55,680 నగదు, ఐదు మోటారు సైకళ్లు, తొమ్మిది మొబైల్‌ ఫోన్లు, మూడు పేకాట కట్టులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టయిన వారిలో జీ.గోవింద (50), ఎన్‌.నరసింహన్‌(38), ఎమ్‌.రామన్‌(28), సీ.అరుల్‌దాస్‌(49), ఈ.శివరాజ్‌ (35), ఎమ్‌.కృష్ణన్‌ (56) ఉన్నట్టు తెలిపారు. వీరందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసి చిత్తూరు కోర్టులో హాజరు పరిచినట్టు వెల్లడించారు.

ఇళ్ల పట్టాలపై విచారణకు ఆదేశం

రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీ, లక్ష్మీనారాయణ కాలనీలో ఇళ్ల పట్టాలపై విచారణకు జిల్లా కలెక్టర్‌ సుమితకుమార్‌ సోమవారం అదేశాలు జారీ చేశారు. సర్వే నం.1605–1, 1606–2లో 172 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి, సొమ్ము చేసుకున్నారని రొంపిచెర్లకు చెందిన దొరబాబునాయుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాని కలెక్టర్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement