పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్రీ పాయింట్లు, హోటళ్లలో ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ధరలు పెంచినట్లు బోర్డులు పెట్టారు. గుడిపాలలో చాలా వరకు హోటళ్లు వారు గ్యాస్ పొయ్యికి బదులు కట్టెల పొయ్యికి మారిపోయారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, పానీపూరి సెంటర్లు, చిన్న హోటళ్లను మూసివేశారు. కొన్ని ఇళ్లలో గ్యాస్ స్టవ్‌లకు బదులు ఆరుబయట కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నారు. గుడిపాల మండలంలో పాటు చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. – గుడిపాల
గ్యాస్ పెరగడంతో హోటల్‌లోని మెనూలో 10 రూపాయలు పెంచుతూ బోర్డు , గుడిపాలలో కట్టెల పొయ్యిపై వంటలు


