పెండింగ్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనుల పరిశీలన

Mar 18 2026 11:08 AM | Updated on Mar 18 2026 11:08 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశా లల్లో పెండింగ్‌లో ఉన్న నాడు– నేడు (మనబడి మన భవిష్యత్‌) పనులను సమగ్రశిక్ష జేడీ మువ్వా రామలింగం మంగళవారం పరిశీలించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో నాడు–నేడు కింద పనులు చేపట్టారు. రెండో విడత పనుల్లో జిల్లావ్యాప్తంగా 830 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనులను చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. దీంతో రూ.30 కోట్లు నిధులు ఆయా పాఠశాలల ఖాతాల్లో అలాగే ఉన్నా యి. త్వరలో పెండింగ్‌లో ఉన్న పనుల పూర్తికి ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల పర్యవేక్షణకు విచ్చేసిన జేడీ మువ్వారామలింగం పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో పెండింగ్‌ పనులను తనిఖీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఏపీసీ వెంకటరమణ, ఎంఈఓలు మోహన్‌, గణపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement