ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు | - | Sakshi
Sakshi News home page

ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు

Mar 19 2026 7:52 AM | Updated on Mar 19 2026 7:52 AM

తిరుపతి లీగల్‌: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరికిన కేసులో ఇద్దరికీ ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్‌ బీట్‌, చామల రేంజ్‌, ఎరగ్రుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లా ఇస్లాంనగర్‌కు చెందిన సాదిక్‌ బాషా, గణేషన్‌ మురుగన్‌ ఎరచ్రందనం చెట్లను నరికి తొమ్మిది దుంగలుగా మార్చి తరలిస్తుండగా ఫారెస్ట్‌ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 326 కిలోల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement