బంగారు ఆభరణాలు చోరీ | - | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాలు చోరీ

Mar 23 2026 8:30 AM | Updated on Mar 23 2026 8:30 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లిలో చోరీ జరిగిన ఘటనను ఆదివారం గుర్తించారు. ఇక్కడ నివాసం ఉంటున్న ఒక కుటుంబం గత 40 రోజులుగా బెంగళూరులో ఉంటోంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగుల గొట్టి 25 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు విచారణ చేపట్టారు.

నిత్యావసర సరుకులు,

ల్యాప్‌టాప్‌లు వితరణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సామాజిక సేవలను మరింత విస్తృతం చేయాలని ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లయన్‌న్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ అశ్వత్థ నారాయణస్వామి అన్నారు. ఆదివారం చిత్తూరులోని ఓ హోటల్‌లో నిర్వహించిన లయన్స్‌క్లబ్‌ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యాన్నదానం చేస్తున్న పలు సంస్థలకు బియ్యం, విద్యార్థులకు రెండు ల్యాప్‌ టాప్‌లు అందజేశారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురిని సత్కరించారు. లయన్స్‌ క్లబ్‌ చిత్తూరు గోల్డ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరులో ఎలక్ట్రిక్‌ శ్మశాన వాటిక నిర్మాణం, కలెక్టరేట్‌లో వాటర్‌ ప్లాంట్‌ నిర్మించడం సంతృప్తి కలిగించిందని పేర్కొనారు. లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ మాజీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, సభ్యులు విజయ్‌ భాస్కర్‌రెడ్డి, భానుమూర్తిరెడ్డి, ప్రతాప్‌ యాదవ్‌ , రంగారెడ్డి, భక్తవత్సల రెడ్డి, శ్రీనివాసమూర్తి, మల్లిఆచారి, భాస్కర్‌, రాజారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement