బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజు లపెళ్లూరు సమీపంలోని రసా జ్యూస్ ఫ్యాక్టరీ లో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు షెడ్‌లు దగ్ధమయ్యాయి. దీంతో భారీ నష్టం వట్టిల్లిందని యాజమాన్యం తెలిపింది. ఉగాది పండుగ కావడంతో ఫ్యాక్టరీలోని షెడ్ల లో కార్మికులు లేరని, దీంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదని పేర్కొంంది. శ్రీకాళహస్తి నుంచి ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి, పక్కనే ఉన్న మరో షెడ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలానికి రెవెన్యూ, పోలీ సు సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు.
కేజీ సత్రం వద్ద
ఘోర రోడ్డు ప్రమాదం
– యువకుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నలగాంపల్లె పంచాయతీ, పాపానివారిపల్లెలో ప్రభు అనే వ్యక్తి కోళ్లఫారంలో బీహార్‌కు చెందిన లితేష్‌కుమార్ పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై కేజీ సత్రం గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభు ఎడమవైపు మట్టి రోడ్డుపై పడిపోయాడు. లితేష్‌కుమార్(19) జాతీయ రహదారిపై పడ్డాడు. అదే సమయంలో అటువైపు వస్తున్న ట్యాంకర్ లారీ లితేష్‌కుమార్ తలపై తొక్కించుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.


