చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ టీయూసీ 15వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాన్‌బాషా, నగర అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఘగర్ ఫ్యాక్టరీ బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. జగనన్న పాలనలో రూ.108 కోట్లు చెల్లించినట్టు గుర్తు చేశారు. అప్పట్లో పలు పథకాల ద్వారా కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూరినట్టు వివరించారు. ప్రస్తుతం సంక్షేమం అనే మాట వినిపించడం లేదన్నారు. శ్రామికుల కష్టాలను పట్టించుకునే వారు లేరని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు మధురెడ్డి, అంజలిరెడ్డి, నౌషద్, సీతాపతి, వెంకటేష్, శివ, సురేష్, నవాజ్, వెంకటరమణ పాల్గొన్నారు.


