చిత్తూరు అర్బన్: సరస్వతి పుత్రులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పుట్టపర్తి నారాయణాచార్యులుకు చిత్తూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నారాయాణాచార్యుల జయంతి నేపథ్యంలో శనివారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటం ఏర్పాటుచేసి ఎస్పీ తుషార్‌డూడీ పూలమాల లు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహితీ కారుల్లో అగ్రగణ్యుడైన నారాయాణాచార్యులు 15 భాషల్లో పాండిత్యాన్ని పొందడం అద్బుతమని కొనియాడారు. తెలుగు సాహితీ రంగ అభివృద్ధికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐలు మనోహర్, ఉమామహేశ్వరన్, కృష్ణమోహన్ తదితరులు నారాయాణాచార్యులుకు నివాళులర్పించారు.


