● ఊపిరి తిత్తుల వ్యాధితో అస్వస్థతకు గురైన బాలుడు ● మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక సాయం ● రెండు శస్త్ర చికిత్సల అనంతరం కోలుకున్న బాలుడు ● చమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఙతలు తెలిపిన తల్లిదండ్రులు | - | Sakshi
Sakshi News home page

● ఊపిరి తిత్తుల వ్యాధితో అస్వస్థతకు గురైన బాలుడు ● మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక సాయం ● రెండు శస్త్ర చికిత్సల అనంతరం కోలుకున్న బాలుడు ● చమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఙతలు తెలిపిన తల్లిదండ్రులు

Mar 21 2026 5:01 AM | Updated on Mar 21 2026 5:01 AM

● ఊపిరి తిత్తుల వ్యాధితో అస్వస్థతకు గురైన బాలుడు ● మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక సాయం ● రెండు శస్త్ర చికిత్సల అనంతరం కోలుకున్న బాలుడు ● చమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఙతలు తెలిపిన తల్లిదండ్రులు

పుత్తూరు: మండల పరిధిలోని మజ్జిగ గుంట కాలనీకి చెందిన శివ కుమారుడు గౌతమ్‌(8) కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంలో తల్లిదండ్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు ఊపిరితిత్తులు 90 శాతం పాడయ్యాయని, ఖర్చుతో కూడుకొన్న ఆపరేషన్‌ అవసరమవుతుందని తేల్చి చెప్పారు. దీంతో దిక్కుతోచని ఆ తల్లిదండ్రులు సాయం చేసే వారి కోసం అన్వేషించారు. ఆశాదీపంగా మాజీ మంత్రి ఆర్కే రోజా వారి మదిలో మెదిలారు. ఆలస్యం చేయకుండా ఆమె వద్దకు వెళ్లి కుమారుడి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆర్కే రోజా రుయా ఆసుపత్రికి వెళ్లి బాలుడ్ని మెరుగైన వైద్య శస్త్ర చికిత్సల కోసం నారాణాద్రి ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. దీంతో వైద్యులు గౌతమ్‌కు రెండు పర్యాయాల పాటు శస్త్ర చికిత్సలు చేసి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. ప్రసుత్తం గౌతమ్‌ వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నాడు. శుక్రవారం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన రోజా గౌతమ్‌ను, తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్లు త్వరలో గౌతమ్‌ను డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చెమ్మగిల్లిన కళ్లతో మాజీ మంత్రి ఆర్కే రోజాకు కృతజ్ఙతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement