శ్రీ రంగరాజపురం: తమ గ్రామంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న పట్టించుకోని ప్రభుత్వాధికారుల తీరుపై కొత్తపల్లి మెట్ట గ్రామస్తుల నిరసన రోడ్డుపైకి చేరింది. శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమెట్ట గ్రామంలో పాత బోరు పనిచేయకపోవడంతో గ్రామంలో నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త బోరు వేయించినప్పటికీ ఇంకా కనెక్షన్ ఇవ్వకపోవడంతో తమ గ్రామంలో నీటి ఇబ్బందులు తీవ్రతరంగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని గ్రామస్తులు రోడ్లపైకి ఎక్కారు. వేసవి ఇంకా మొదలు కాకుండానే నీటి ఎద్దడి ఉంటే మరి మండు వేసవిలో గ్రామస్తుల పరిస్థితి ఏమిటో అధికారులు ప్రభుత్వమే కాపాడాలి డి మాండ్ చేశారు. సత్వరమే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.


