ఉమ్మడి జిలాలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మందికి పైగా జెడ్పీ ఉద్యోగులున్నారు. విభజన సమయంలో ఉద్యోగులు ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటున్నారు? ఆ తర్వాత సీనియార్టీ కేడర్ ప్రతిపాదికన జాబితాను అధికారులు సిద్దం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుత జిల్లా పరిషత్ పునర్‌వ్యవస్థికరించడం, కొత్త జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన, తాతాక్కలిక భవనాల గుర్తింపు, కేటాయింపు , జడ్పీ భవనాల నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జెడ్పీ ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాల వారీగా పూర్తి స్థాయి ఆదేశాలు రావాల్సి ఉంది. ఉద్యోగుల జాబితా తయారీ, ఇతర వాటిపై సృష్టత రావాలి అని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలియజేశారు.
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కేంద్రంగా జెడ్పీ పరిపాలన సాగుతోంది. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఉండటంతో వాటి విభజన చేయలేదు. ప్రస్తుతం వారి పాలన గడువు సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో జెడ్పీల విభజన చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎం సూచనప్రాయంగా ప్రకటించారు. దీంతో కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి వేరుపడి కొత్తగా మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిషత్ ఏర్పా టు కానున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటూ పాలకుల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. దీంతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇది వరకే కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ ఏర్పాటవుతాయని, తద్వారా ఎన్నికలు జరుగుతాయంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలియజేశారు. ఇప్పటి వరకు కడప ఉమ్మడి జిల్లా కింద రాయచోటి నియోజకవర్గంలోని మండలాలుండగా ఇవన్నీ మదనపల్లె కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా పరిషత్ కిందకు చేరనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కింద ఉన్న పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలోని మండలాలు అన్నమయ్య జిల్లా పరిషత్‌లో చేరనున్నాయి. ఐదు నియోజవర్గాల పరిధిలోని 25 మండలాల పరిధి కింద జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ ఉద్యోగోన్నతులు జరగ్గా.. కొత్త జిల్లాలకు కేటాయింపునకు వీలుగా సీఈవోల నియామకానికి కసరత్తు దాదాపు పూర్తి చేశారు. ఆర్థికశాఖ అనుమతులు రాగానే కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు, వాటికి సీఈవోలు,ఉద్యోగుల సర్దుబాటు వ్యవహారం పూర్తి కానుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త జడ్పీ అధికార యంత్రాంగం చేపట్టనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు 2021లో జరగ్గా ఆ తర్వాతనే 2022 ఏప్రిల్ జిల్లాల పునఃవ్యవస్థీకరణ జరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్ పాలన సాగింది. ఇక జిల్లాల వారీగా జిల్లా పరిషత్ అందుబాటులోకి వస్తాయి. వ్యవస్థ ఏర్పాటుతో పాటు రాజకీయంగానూ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది.
17సీటీఆర్55: జెడ్పీ కార్యాలయం
సీనియార్టీ ప్రాతిపాదికన


