breaking news
KTR
-
సిరిసిల్ల లెక్కలు తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం కాకుండా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు దుర్వినియోగమయ్యాయని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ మండలం, ఏ గ్రామంలో, ఎవరి పేర్లపై ఉన్నాయి? ఎంత భూమిని స్వా«దీనం చేసుకున్నారు? అనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,272 ఎకరాలు మాత్రమే పంపిణీ జరిగాయని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని, నిరూపించలేకపోతే సిరిసిల్ల ప్రజలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయడంతో నేతన్నలకు ఉపాధి తగ్గిందని ఆరోపించారు. రైతుబంధు బకాయిలు, ఎకరాకు రూ.15 వేల సాయం, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబీమా పునరుద్ధరణపై తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు.. అభివృద్ధిపై లెక్కలివ్వాలి..: సిరిసిల్లను విద్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కేటీఆర్ కోరారు. ఆసరా పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు, మహిళలకు నెలకు రూ.2,500 సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, ముదిరాజ్‌లకు ఇచి్చన హామీ, చేపపిల్లలు–గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల సాయం వంటి హామీల అమలుకు స్పష్టమైన తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో గత ప్రభుత్వ హయాంలో రూ.1,564 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: కేటీఆర్ కందనూలు: రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లాలోని దేశిటిక్యాల గ్రామం వద్ద పత్తి, మొక్కజొన్న, మినుముల పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నందున ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరులో పంటలు ఎండబెట్టి.. ఆంధ్రకు నీటిని తరలిస్తున్నారని, చంద్రబాబు దగ్గర పిల్లిలా ఉంటూ.. నల్లమలలో పులిలా ఉన్నానని ప్రగల్బాలు పలుకుతున్నాడని విమర్శించారు. కేటీఆర్ వెంట మాజీమంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులున్నారు. -
కేసీఆర్‌ది 4 నిమిషాలే.. థియేటర్లో దద్దరిల్లింది.. చూసుకోండి మరి..: కేటీఆర్
నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్.’ ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటకీ ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా 135 కోట్లు వసూళ్లు రాబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కేటీఆర్ శైతం సినిమాను థియేటర్‌కి వెళ్లి చూశారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చిత్రం బృందాన్ని అభినందించారు. కాగా మరోసారి ది ప్యారడైజ్‌పై స్పందించిన ఆయన.. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యంలు వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: సాయి పల్లవి స్పీచ్‌కి ఫ్యాన్స్ ఫిదాసినిమాలో 4 నిమిషాలు..ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో పార్టీ నేతలతో కలిసి తాను ‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఆ సినిమాలో కేసీఆర్‌ను ప్రతిబింబించే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర కనిపించేది కేవలం నాలుగు నిమిషాలే. కానీ ఆ మూడు గంటలు ఒక ఎత్తు అయితే.. ఆ నాలుగు నిమిషాలు మరో ఎత్తు. ఆ పాత్ర తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వేరే లెవల్లో ఉంది’ అని తెలిపారు. సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు తమ ఉనికి, అస్తిత్వం కోసం చేసే తిరుగుబాటును డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. ఇదీ చదవండి: ది ప్యారడైజ్ పై కేటీఆర్ రివ్యూ "మూడు గంటల #TheParadise సినిమా ఒక ఎత్తు...అందులో ఉన్న నాలుగు నిమిషాల #KCR సీన్ ఒక ఎత్తు."– #KTR pic.twitter.com/2B286TMt81— Gulte (@GulteOfficial) September 27, 2026 -
రాహుల్.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కాంగ్రెస్–బీజేపీ అపవిత్ర బంధానికి రెండేళ్లు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై ఈడీ దాడులకు రెండేళ్లు’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘2024 సెప్టెంబర్ 27న 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు. దాడుల సమయంలో నగదు లెక్కించే యంత్రాల తరలింపుపై వార్తలు. ఈడీ దాడుల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో ఇప్పటికీ వెల్లడించలేదు. దాడుల ఫలితాలపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నాయి?’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.Exactly two years since the Congress-BJP unholy nexus became official in TelanganaThe Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024Reports of several… pic.twitter.com/Ss2eIguoP6— KTR (@KTRBRS) September 27, 2026‘‘ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ.. కాంగ్రెస్ మంత్రిపై దాడుల విషయంలో మాత్రం ఎందుకీ మౌనం?. కాంగ్రెస్ మంత్రి పొంగులేటికి బీజేపీ ఎందుకు రక్షణ కల్పిస్తోంది?. రాహుల్ గాంధీ.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే? -
ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్
-
తమ్ముడు శ్రీకాంత్.. మంచి సందేశమిచ్చావ్: కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. దసరా కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్లుపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.ఈ మూవీలోని కేసీఆర్ రోల్ చూసేందుకు ఆయన అభిమానులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా థియేటర్‌కు వెళ్లి వీక్షించారు. సినిమా చూశాకా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సినిమా అస్తిత్వం కోసం ఆరాటం.. అణిచివేతపై పోరాటమని కొనియాడారు. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు అంటూ ప్రశంసించారు. చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా అంటూ సినిమాలోని కేసీఆర్ డైలాగ్‌ను రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కేటీఆర్‌తో పాటు మాజీమంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వీక్షించారు. View this post on Instagram A post shared by KTR (@ktrtrs) అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…— KTR (@KTRBRS) September 26, 2026 -
‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ మూవీకి సంబంధించిన చర్చ కొనసాగుతోంది. సినిమా చూడబోతున్నా..తాజాగా ‘ది ప్యారడైజ్’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేశారు. శనివారం రాత్రి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడనున్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్లో సినిమా చూడబోతున్నా. నా అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి రూపొందించిన ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నా’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఇక ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకర్ పాత్రలో ఆయన నటించారు. సవారీ తెగకు, శంకర్ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్ బీస్ట్..! ఇదేం ట్విస్ట్ బాస్.. After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”— KTR (@KTRBRS) September 26, 2026 -
గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతలు మొదలయ్యాయని.. యూరియా దొరకని రోజులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారు. గణేష్ మండపాల దగ్గర కేసీఆర్ పాటలు మోత మోగాయి. కేసీఆర్‌ను మేనమామ తీరుగా ఆడపిల్లల తల్లులు యాది చేసుకుంటున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘రేవంత్‌రెడ్డి రైతు బంధు ఎగ్గొడుతున్నారు. పొలాల్లో మోటార్లు కాలిపోతున్నాయి. రైతు బంధు ఎగ్గొట్టిన ప్రతిసారి కేసీఆర్‌ను అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు దుష్పరిపాలన ఫలితాలు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ అక్కర్లేదు కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: పట్టు బిగిస్తున్న సీతక్క! -
త్వరలో మరిన్ని వికెట్లు
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఒక వికెట్ పడిందని, ఇక ముందు మరిన్ని వికెట్లు పడనున్నాయని గురువారం నాడిక్కడ అన్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును మార్చేయవచ్చని భావించిన వారికి సుప్రీంకోర్టు తీర్పు గట్టి సమాధానమని పేర్కొన్నారు. దానం అనర్హత నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థిస్తూ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఫిరాయింపుదారులను స్పీకర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కాపాడుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావించిందని విమర్శించారు. ఖైరతాబాద్ ప్రజలు త్వరలో తమ తీర్పును ఇవ్వబోతున్నారని, మూడు సంవత్సరాల మోసం, విఫలమైన హామీలు, మాట తప్పిన తీరుపై ప్రజలు తీర్పు చెప్పనున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆఆర్ వర్సెస్ అందరూ.. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నది ‘కేసీఆర్ వర్సెస్ అందరూ’పోరాటమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మక్కుకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మక్కులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే అంశాల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. దీనిపై బీఆర్ఎస్ న్యాయస్థానాల్లోనూ, ప్రజల మధ్యా పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ఒకే ఒక్క ‘సార్’ఉన్నారు.. అది కేసీఆర్ సార్. ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమను ఏ ‘ఎస్ఐఆర్’కూడా ఓడించలేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
వెంటిలేటర్‌పై విద్యుత్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉందని ధ్వజమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో రోజుకు ఆరు గంటలకు మించి సరఫరా లేని పరిస్థితి ఉందన్నారు. ‘కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ రంగంపై తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు. 1980ల నాటి చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటే.. తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ కోతల విషయంలో నాటి పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్లే విద్యుత్ సమస్య వచి్చందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఇది ఎల్‌నినో వల్ల కాదు.. ఎల్ కాంగోతోనే’అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి రైతులే విద్యుత్ సమస్యపై రోడ్డెక్కి ధర్నా చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. బొగ్గు కొరత.. కేంద్రాల్లో ఉత్పత్తికి బ్రేక్ జెన్కోకు నాణ్యత లేని బొగ్గు సరఫరా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఐదు విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులుగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కొరత ఉందని చెప్పారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతోందని, 270 మెగావాట్ల భద్రాద్రి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. నాణ్యత లేని బొగ్గు కారణంగా రూ.2,900 కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ జెన్కో సింగరేణికి రూ.52 వేల కోట్లు బకాయి పడిందన్నారు. బొగ్గు లేక వైటీపీఎస్‌లో డీజిల్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, ఆ కేంద్రాన్ని ప్రైవేటీకరించాలనుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఆరు బృందాలతో బీఆర్ఎస్ పరిశీలన రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పరిస్థితులపై వాస్తవాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆరు బృందాలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. యాదాద్రి, కేటీపీఎస్, భద్రాద్రి, భూపాలపల్లి కేటీపీపీ, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి ప్రధాన కార్యాలయాలను ఈ బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం, మరో 23 మంది గాయపడటంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూరాల ఆయకట్టు రైతుల పంటలు ఎండుతున్నా నీటిని విడుదల చేయకుండా రైతులు, బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. మండలి ఎన్నికలపై దృష్టి రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని, యువత, ఉద్యోగులు, పట్టభద్రుల్లో ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు జోక్యం ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐఆర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న కేటీఆర్ ఖైరతాబాద్ (హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అంతటా, దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని తద్వారా రైతులు బాగుండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కులమతాలకు అతీతంగా అందరూ పండుగల వేళ కలిసి మెలిసి ఉండాలని, శాంతిభద్రతలు బాగుండాలని పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గజ్జల నాగేశ్ తదితరులు ఉన్నారు. -
ఈసీపై దుమారం : కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియలోని లోపాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ECs) అభ్యంతరం వ్యక్తం చేశారంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని సుమోటా తీసుకొని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపే విశ్వసనీయత సుప్రీంకోర్టుకు తప్ప మరే ఇతర సంస్థకూ లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం పనితీరు, విశ్వసనీయతపై తీవ్రమైన సంక్షోభం నెలకొందని కేటీఆర్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయనా, తాజా వార్తలతో మరింత అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థపై వచ్చిన ఆరోపణలపై దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తప్ప మరే ఇతర సంస్థపైనా నమ్మకం ఉంచలేమన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్లు చెబుతున్న అంశాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై స్యూమోటో కింద విచారణ జరపాలన్నారు దీనివల్ల కొన్ని సమాధానాలు లభిస్తాయని, నిజం బయటపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహంకాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూవచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.BRS Working President @KTRBRS key remarks on objections raised by two Election Commissioners over the SIR process.There is now a serious crisis of confidence in the functioning of the Election Commission.The objections reportedly raised by two Election Commissioners over the… pic.twitter.com/kj9YsDsam1— KTR Updates (@KTRMediaUpdates) September 23, 2026 -
దేశంలో 1980 ఫోటో ట్రెండ్.. రాష్టంలో 1980ల నాటి పరిస్థితులు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980 నాటి ట్రెండ్ నడుస్తుంటే రాష్ట్రంలో 1980 నాటి పరిస్థితులు నడుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ రోజు (బుధవారం) తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు ఎల్‌నినో ప్రభావంతో కాదని ఎల్ కాంగో ప్రభావంతోనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు.తెలంగాణలో కరెంట్ సంక్షోభం తలెత్తిందని బీఆర్ఎస్ గతంలోనే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పిందని ప్రస్తుతం రాష్టంలో అవే పరిస్థితులు నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే చీకటిరాజ్యమేనని గతంలోనే చెప్పామని ఇప్పుడు అదే నిజమైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ 6 గంటలకు మించి కరెంటు లేదని వారం రోజులుగా పవర్ లెస్‌గా ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల బొగ్గు నిల్వలు ఉంటే ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. 4 వేల మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చెయ్యాల్సిన రాష్ట్రంలో 400 మెగా వాట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. నాణ్యత లేని బొగ్గుతో రాష్ట్రానికి 2,900 కోట్ల నష్టం సీఎం బావమరిది సృజనాత్మక లీలలతో సింగరేణికి నష్టాలు సీఎం రేవంత్ మెస్సి తో ఫుట్ బాల్ ఆడలేదు.... సింగరేణి సంస్థతో ఫుట్ బాల్ ఆడారు. అని కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని నీళ్లు లేక హైడల్ పవర్ ఉత్పత్తి ఆగిపోయిందని తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని పవర్ ప్లాంట్లు సందర్శిస్తామని ఆరు బృందాలుగా వెళ్లి నిజానిజాలు తెలుసుకుంటామన్నారు. కరెంటు ఉత్పత్తి కేంద్రాల్లో నిజాలు నిగ్గుదేల్చడానికే ఆరు బృందాలుగా వెళ్లి అన్ని పవర్ప్లాంట్లను సందర్శిస్తామని కేటీఆర్ అన్నారు. -
జూరాల నీటి విడుదల.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చింది. ఎట్టకేలకు జూరాల ప్రాజెక్ట్ నుంచి అధికారులు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీటిని వదిలారు. ఈ నేపథ్యంలో నీటి విడుదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించి.. రైతులు వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు.మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా!!. జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో రైతులు వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం!. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని, తెలంగాణా ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం!. ప్రశ్నించడం, పోరాడటం, మన తెలంగాణా హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడటం.. ఇదే మన ముందున్న లక్ష్యం’ అని పోస్టు చేశారు. పోరాడితే పోయేదేమీలేదు…బానిస సంకెళ్లు తప్పా!!!జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో…రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం! ఈ కుంభకర్ణ ప్రభుత్వన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు! ఈ… pic.twitter.com/SsMPwmZ4ZZ— KTR (@KTRBRS) September 23, 2026 ఇదీ చదవండి: తెలంగాణకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు.. -
సీఎం రేవంత్ ఎందుకు స్పందించలేదు.. కేటీఆర్
తమ ఆస్తులపై చేస్తున్న ఆరోపణలకు సిట్టింగ్ విచారణకు సవాల్ విసిరామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ సీఎం రేవంత్ ఇప్పటి వరకూ స్పందించలేదని తెలిపారు. సిరిసిల్ల ప్రజలకు రేవంత్ ముఖం ఏలా చూపిస్తారని తమపై చేసిన ఆరోపణలకు సీఎం క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని దీనికై రాజన్నను దర్శించుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న డ్రామాలు ఆపాలని వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. -
కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. సిరిసిల్ల, సిద్దిపేటలో భారీ సభలు
సాక్షి, హైదరాబాద్: గులాబీ నేతల కంచుకోటల్లో కాంగ్రెస్ రాజకీయ సమరానికి సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిద్దిపేట, సిరిసిల్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ నెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుండగా.. అక్టోబర్ మొదటి వారంలో సిద్దిపేటలో సభకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేరకు సభల ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత డీసీసీ అధ్యక్షులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించినట్లు సమాచారం. రెండు నియోజకవర్గాల్లో సభల ద్వారా పార్టీ శ్రేణులను సమీకరించడంతో పాటు, బీఆర్ఎస్ నేతలపై రాజకీయంగా ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సిరిసిల్ల, సిద్దిపేటలో జరగనున్న సభలపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సభల్లో ఎవరెవరు పాల్గొంటారు? హరీశ్‌రావు, కేటీఆర్‌లపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే, సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే సంకేతాలిచ్చారు. సెప్టెంబర్ 5న నకిరేకల్ సభలో మాట్లాడుతూ.. ఈ నెలాఖరులో సిరిసిల్లకు, అక్టోబర్‌లో సిద్దిపేటకు వస్తానని ప్రకటించారు. కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సవాల్ చేశారు. ఇటీవల సిద్దిపేటలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు భూముల వ్యవహారాలపై పర్యటించగా.. హరీశ్‌రావు తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేట సభలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.తెలంగాణభవన్‌లో కీలక సమావేశం.. మరోవైపు.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో వారు భేటీ అయ్యారు. 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన అనంతరం బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్ పర్యటనలు, 22ఏ భూముల వివాదం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతలపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలు, వాటికి ఎలా స్పందించాలనే అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.దానం నాగేందర్ అంశంపైనా చర్చ?ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ నేతలు తదుపరి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు -
రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, వనపర్తి జిల్లా: కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. శనివారం ఆయన వనపర్తి నియోజకవర్గం పెబ్బేరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారని.. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ తేల్చి చెప్పారు.‘‘ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. నీళ్లు ఇవ్వకపోతే గల్లా పట్టుకుని అడుగుతామన్నారు. తాము తప్పు చేశామని తేలితే చర్యలు తీసుకోండి.. అక్రమాలు జరిగితే ప్రజలకు చూపించి యాక్షన్ తీసుకోవాలన్నారు. రైతులు విద్యుత్, సాగునీటి కష్టాలు చెప్పుకున్నారు.. ప్రకృతి కావాల్సినన్ని నీళ్ళు ఇచ్చినా రైతులకు సాగునీరు లేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏడు మెగా వాట్ల సామర్థ్యం ఉండేది. 24 వేల మెగా వాట్లకు విద్యుత్ సామర్థ్యం పెంచినం. అత్యల్పంగా కృష్ణా నీళ్లను తెలంగాణ వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముప్పై శాతం కంటే ఎక్కువ నీళ్లు వాడుకున్నాం. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చినం. ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. వరద వస్తుందంటే వెంటనే నీళ్లు మళ్లించే వాళ్లం...చెక్ డ్యామ్‌లు, చెరువులు నింపి పాలమూరులో నీళ్లు ఇచ్చాం. రెండు సబ్ స్టేషన్లకు రైతులతో కలిసి వెళ్ళాం. అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆరు గంటలకు మించి విద్యుత్ సరఫరా కావట్లేదని రైతులు చెప్తున్నారు. లో వోల్టేజ్, తరచూ కట్ చేయడంతో మోటార్లు కాలిపోతున్నాయని అంటున్నారు. నీళ్లు, కరెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విద్యుత్ కష్టాలు, తాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని ఉన్నప్పటికీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం -
జన్వాడలో హైటెన్షన్.. కేటీఆర్ ఫామ్‌హౌస్ పరిశీలనకు కాంగ్రెస్ బృందం!
జన్వాడ ఫామ్ హౌస్‌కు కాంగ్రెస్ నేతలు అప్డేట్స్..జన్వాడ ఫామ్‌హౌస్ దగ్గర పోలీసుల మోహరింపు..ఫామ్‌హౌస్ వద్దకు చేరుకున్న చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్👉తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య భూ వివాదం మరింత ముదురుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం వరుసగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడుతోంది. శుక్రవారం సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. శనివారం జన్వాడలో కేటీఆర్, ఆయన కుటుంబానికి సంబంధించిన భూముల అంశాన్ని పరిశీలించనున్నారు.👉కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉదయం 10.30 గంటలకు ప్రజాభవన్ నుంచి బయలుదేరి జన్వాడకు వెళ్లనున్నారు. అక్కడ భూములకు సంబంధించిన రికార్డులు, యాజమాన్య వివరాలు, ప్రభుత్వ భూములతో సంబంధం ఉన్న అంశాలను పరిశీలించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా వెలికట్టలో హరీశ్‌రావు బంధువు హనుమంతరావుకు సంబంధించిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను కాంగ్రెస్ బృందం పరిశీలించింది. భూముల రికార్డులు, పహాణీలు, పట్టాదారు వివరాలతో పాటు బదలాయింపు, రిజిస్ట్రేషన్ నిబంధనలపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించింది.👉జన్వాడ అంశంలో మాత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. జన్వాడ ఫార్మ్‌హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ.. ఆస్తి తనదేనని, కేటీఆర్‌కు ఎలాంటి యాజమాన్య హక్కు లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడని, ఫార్మ్‌హౌస్‌ను ఆయనకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయని, అధికారికంగా అడిగితే అందజేస్తానని చెప్పారు. జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే..!కేటీఆర్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు.- ప్రదీప్ రెడ్డి pic.twitter.com/BOKLm1kNh9— Rebel Freak (@rebelfreak0298) September 18, 2026👉మరోవైపు కేటీఆర్ ఈ ఆరోపణలపై న్యాయ విచారణకు సవాల్ విసిరారు. తన కుటుంబంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల సవాళ్లు, ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో భూముల అంశం ఇప్పుడు ప్రధాన రాజకీయ వివాదంగా మారింది. ఇదే క్రమంలో శంషాబాద్‌లో జగదీశ్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములనూ కాంగ్రెస్ ప్రతినిధులు పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నేతల భూములపై కాంగ్రెస్ చేపడుతున్న వరుస పర్యటనలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: దానం నాగేందర్ దారెటు? -
సత్యమేవ జయతే.. దానం అనర్హత వేటుపై KTR సంచలన ట్వీట్
-
దానం నాగేందర్ తీర్పుపై కేటీఆర్ సంచలన ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హత వేటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. మిగతా ఫిరాయింపుదారులకు ఇదే గతి పడుతుందన్నారు. కాగా కొద్దిసేపటి క్రితం దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశంలో శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టిపడేసింది.అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సమయం ఇవ్వాలని దానం నాగేందర్ హైకోర్టును అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది. వెంటనే తీర్పు కాపీని స్పీకర్, ఈసీకి పంపాలని ఆదేశించింది. స్పీకర్ క్లీన్చిట్.. హైకోర్టులో సవాల్ ప్రతిపక్ష నేతల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ ఏడాది మార్చి 11న సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్చిట్ ఇస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పిన న్యాయస్థానం.. దానం నాగేందర్ ఎంపీగా పోటీచేసిన తేదీ నుంచే ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోనా టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: దానం నాగేందర్‌కు ఎదురు దెబ్బ -
రేవంత్ కు ఆఫర్ ఇచ్చిన కేటీఆర్
-
సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణకు ఇవాళ ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్ష కోట్లు కొల్లగట్టామని రేవంత్‌రెడ్డి అంటున్నారు. రేవంత్‌కు మంచి ఆఫర్ ఇస్తున్నా. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాం. మిగతా రూ. 99 వేల కోట్లు మీరే తీసుకోండి.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఖర్చు చేయండి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.‘‘ఆ డబ్బులతో విద్యార్థుల బకాయిలు చెల్లించండి. ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాళేశ్వరంలో లక్షకోట్లని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు విషప్రచారంచేస్తున్నారు. హామీలను రేవంత్ గాలికొదిలేశారు. గత మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరకు వాళ్ల టార్గెట్ అంతా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడమే.. కేసీఆర్‌ను బీఆర్ఎస్ పార్టీలోని నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ హరాస్ చేస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారం రేవంత్ సర్కార్ టార్గెట్ కావాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.రైతులకు ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీ, 15వేల రైతు భరోసా, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కరెంటు కావాలని రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. లక్ష కోట్లని కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారు. కేసీఆర్‌పైన ఆయన కుటుంబంపైన రేవంత్ విషం చిమ్ముతున్నారు.ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌కు మంచి పేరు తెచ్చే విషయం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే ఫార్ములా ఈ-రేస్. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ ఏర్పాటు చేస్తే దానిపై విషం చిమ్ముతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రెండుసార్లు కోర్టుకు నేను హాజరయ్యాను. కోర్టుకు నేను సహకరిస్తాను. ఎన్నిసార్లు పిలిచినా వచ్చి విచారణకు హాజరవుతాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ -
నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ కోర్టు విచారణ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసర ప్రాంతాలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణకు వచ్చారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ.54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హెచ్ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలన, పట్టణాభివృద్ధి ప్రత్యేక సీఎస్‌గా ఉన్న అర్వీద్ కుమార్‌ను రెండో నిందితుడిగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది.ఇదీ చదవండి: కూల్.. కూల్ అనే ఇంతవరకు వచ్చింది: దానం -
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అఫిడవిట్లలో భూముల వివరాలపై కేటీఆర్‌ను నిలదీసిన పొంగులేటి.. కేసీఆర్ ఆస్తులపై ప్రశ్నిస్తే.. కేటీఆర్‌కు ఎందుకంత ఉలికిపాటు?. 2004 అఫిడవిట్లో భూములు లేవు.. ఇప్పుడు వందల ఎకరాలు ఎలా?. అఫిడవిట్లలో నిజాలు రాశారా? ప్రజలను మోసం చేశారా?. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించిన పొంగులేటి.. అఫిడవిట్లలో ఒకటి.. మాటల్లో మరొకటా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కుటుంబానిదే. భూముల పెరుగుదలపై లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు? కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని పొంగులేటి డిమాండ్ చేశారు.‘‘అఫిడవిట్లలో పేర్కొన్న భూముల వివరాలను ప్రజల ముందు పెట్టాలి. కేటీఆర్ మాటలకు.. ఎన్నికల అఫిడవిట్లకు పొంతన ఉందా?. భూ ఆరోపణలపై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలా?’’ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ...ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు… pic.twitter.com/E9oOjS8UBW— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 17, 2026ఇదీ చదవండి: పొరపాట్లు జరిగాయి.. పరిష్కరిస్తాం -
మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అన్నిరంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆస్తుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన నేపధ్యంలో కేటీఆర్ ఆయనకు సవాల్ విసిరారు. 1954 నుంచి 2026 వరకు మా ఆస్తుల లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం తన సొంత సోదరునికి అక్రమంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి కళంకం తెస్తున్నారు. కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. రేవంత్ రెడ్డి సంస్కారం లేని వ్యక్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి బంగ్లాలు ఎలా కట్టారో చెప్పాలి. నవీన్ రావు, సంతోష్ రావులతో మాకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేవరకు తాము పోరాటం చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి కళంకం తెస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి తమను వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ''ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలి. మా ఆస్తుల విషయంలో సీఎంకు దమ్ముంటే న్యాయ విచారణ చేయాలి. ఎవరికెన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కతీద్దామా'' అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడారు. కమీషన్లు దండుకునేందుకే 22ఏను తీసుకొచ్చారు. కేసీఆర్‌కు రేవంత్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆన్నారు. రేవంత్ రెడ్డి ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉందని విమర్శించారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ పవిత్రతను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని రేవంత్ తప్పడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇదీ చదవండి: గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే.. కవిత -
‘స్టార్టప్ స్టేట్’గా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోగలదా? అవసరమైన వనరులు, సంస్థలు, పరిపాలనా సామర్థ్యం తెలంగాణకు ఉన్నాయా? రాష్ట్ర ఏర్పాటు సమయంలో వ్యక్తమైన అనేక సందేహాలకు అభివృద్ధి, పరిపాలనా విధానాల ద్వారా సమాధానం ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేది దేశ అభివృద్ధికి సమాధానంగా ఉండటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణను కేవలం కొత్త రాష్ట్రంగా కాకుండా ప్రజల కోసం విలువను సృష్టించే ‘స్టార్టప్ స్టేట్’గా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు సాగి విజయం సాధించామన్నారు. బుధవారం హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘పాలనలో నవకల్పన–ఒక స్టార్టప్ రాష్ట్రం కథ’అనే అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త రాష్ట్రం నిలబెట్టుకోగలదా? అన్నారు ‘తెలంగాణ ఏర్పడిన సమయంలో కొందరు ఈ రాష్ట్రం తనను తాను నిలబెట్టుకోగలదా? అని ప్రశ్నించారు. కొత్త పరిపాలనా వ్యవస్థను నిర్మించడం పెద్ద భారమని చెప్పారు. మేము మాత్రం అదే పరిస్థితిని కొత్త తరహా పాలనా సంస్కృతిని నిర్మించుకునే అవకాశంగా చూశాం. సందేహాలతో వాదించకుండా పనితీరుతో సమాధానం చెప్పడమే తెలంగాణ విధానంగా సాగింది’అంటూ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కథకు రెండు ప్రధాన కోణాలు ఉన్నాయని వివరించారు. ఒకటి నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రాథమిక అవసరాల ద్వారా ప్రజలకు భరోసా కల్పించడం కాగా.. రెండోది స్టార్టప్‌లు, నైపుణ్యాలు, ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడం. వ్యవసాయ రంగంపై... వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పును కూడా ఈ అభివృద్ధి నమూనాకు ఉదాహరణగా కేటీఆర్ ప్రస్తావించారు. 2014–15లో తెలంగాణలో సుమారు 44.4 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. ఆ ఏడాది దేశంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అదే విధంగా ఇళ్లకు 24 గంటల తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించామన్నారు. ఇప్పుడు తెలంగాణ దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలిచిందని, దశాబ్ద కాలంలో తలసరి ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందని, జాతీయ సగటు కంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఎకోసిస్టమ్‌ను నిర్మించాం ప్రాథమిక సదుపాయాలపై భరోసా ఏర్పడిన తర్వాత అవకాశాల ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. టీ–హబ్, డబ్ల్యూఈ–హబ్, టీ–వర్క్స్, టాస్క్ వంటి సంస్థలను ఒకదానికొకటి అనుసంధానమయ్యే విధంగా రూపొందించామని తెలిపారు. ఈ–ఎకోసిస్టమ్ ఫలితాలను వివరించేందుకు స్కైరూట్‌ను ఉదాహరణగా ప్రస్తావించారు. విక్రమ్–1 అంతరిక్షంలోకి చేరడం హైదరాబాద్ ఆవిష్కరణ నమూనాను ప్రపంచానికి పరిచయం చేసిందని, స్కైరూట్ ప్రస్తుతం భారత తొలి స్పేస్‌టెక్ యూనికార్న్‌గా హైదరాబాద్ నుంచి ప్రపంచ మార్కెట్ కోసం రాకెట్లు నిర్మిస్తోందని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు ప్రసంగం తర్వాత విద్యార్థులతో కేటీఆర్ ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘2028 ఎన్నికల్లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా’? అంటూ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. ‘మేం వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుకోం. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము ఏ పారీ్టతోనూ పొత్తు పెట్టుకోలేదు’అంటూ సమాధానమిచ్చారు. ‘డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటి’అని మరో విద్యార్థి ప్రశ్నించగా.. ‘దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మాకు సమస్య లేదు’అన్నారు. ఏఐ, సాంకేతిక పరివర్తనలపై ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రతి పెద్ద సాంకేతిక మార్పు సమయంలోనూ ఆందోళనలు, సందేహాలు వ్యక్తమయ్యాయన్నారు. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని, సాంకేతిక మార్పును స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశం తర్వాత సెల్ఫీ అంటూ విద్యార్థులు పోటీపడటంతో ఆయన అందరికీ ఓపిగ్గా సెలీ్ఫలు ఇచ్చారు. -
‘22A అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరగాలి’
సాక్షి, ఢిల్లీ: 22A అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైయిరీ జరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లపాటు సెటిల్మెంట్లు చేసుకొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారన్న ఆయన రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనక ఒక పెద్ద స్కాం ఉంటుందని ఆరోపించారు.ఆయన మాట్లాడుతూ.."భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారు. 30% కమిషన్లు తీసుకున్న తర్వాత నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఉమ్మడి పౌరస్మృతిపై మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. యూనిఫామ్ అని చెప్పి కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలోనే చట్టం తీసుకు వస్తామనడంలో సహితుకత లేదు" అని ప్రభుత్వాన్ని విమర్శించారు. -
కేటీఆర్ PA, PROపై దాడి.. CCTV లో ఏం కనిపించింది?
-
మౌనమే కేసీఆర్ అస్త్రం.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్‌కు గులాబీ బాస్ చెక్
తెలంగాణ అసెంబ్లీ బయట,లోపల జరిగిన కొన్ని పరిణామాలు ఏ మాత్రం ఆహ్వానించదగినవి కావు.ఈ సందర్భంగా కాంగ్రెస్,బిఆర్‌ఎస్‌లు పరస్పరం చేసుకున్న ఆరోపణలు కూడా వినడానికి బాలేదు.శాసనసభ వద్ద జరిగిన ఘటనల ఆధారంగా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఈ రెండు పార్టీలు యత్నించాయి. మరో రెండు ఏళ్లలో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుంచే ఈ పార్టీలు వ్యూహ రచనలో తీవ్రంగా పోటీ పడుతున్న సంగతి కనిపిస్తున్నదే.బీఆర్ఎస్ అసెంబ్లీలో అనుసరించబోయే వ్యూహాన్ని ముందుగానే రేవంత్ పసికట్టినట్లున్నారు. నల్ల షర్టులతో శాసనసభలోకి అడుగుపెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలుపుదామని భావించిన బీఆర్ఎస్కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. నల్ల షర్టులపై ఏవో నినాదాలు ఉన్నాయన్న సాకుతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను గేటు బయటే అడ్డుకున్నారు. బహుశా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ ఊహించి ఉండకపోవచ్చు.నిజానికి బీఆర్ఎస్ నేతలు నినాదాలతో ఉన్న షర్టులతో రావడం ;పెద్ద తప్పేమీ కాదు.అయినా రాజకీయంగా మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ ప్లాన్ వేశారని అనుకోవాలి. ఆ క్రమంలో పోలీసులతో బీఆర్ఎస్ నేతలకు జరిగిన గొడవలు,వారిపై ఎదురు కేసులు పెట్టే పరిస్థితి రావడం వంటివి జరిగాయి. అంతేకాక తాతా మధు అనే ఎమ్మెల్సీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య బీఆర్ఎస్ను డిఫెన్స్‌లో పడేసింది. దానికి ప్రతిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులపై పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం అంటూ పార్టీ నేతలు విమర్శలు చేసినా,ఆశించిన రీతిలో ఆ ఇష్యూ పెరగలేదు.అదే టైమ్‌లో అసెంబ్లీలో స్పీకర్ కంటతడి పెట్టుకోవడంతో బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందిగా మారంది.దానిపై మాజీ మంత్రి హరీష్ రావు తమ వాదన వినిపించినప్పటికీ పెద్దగా ప్రయోజనం జరగలేదు.పైగా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సభ నుంచి సస్పెన్షన్‌కు గురి కావల్సి వచ్చింది.దాంతో బీఆర్ఎఎస్ లేవనెత్తాలని అనుకున్న ప్రజా సమస్యలు వెనక్కి పోయినట్లయింది. అందువల్లే 22ఎ నిషేధిత భూముల వివాదంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అనుకున్నా బీఆర్ఎస్కు అది కుదరలేదు.అలాగే మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా ఉదంతం గురించి ప్రస్తావించే అవకాశం వీరికి రాలేదు. ముఖ్యమంత్రి సోదరులపై కేటిఆర్ తదితరులు చేస్తున్న ఆరోపణలను శాసనసభలో ప్రస్తావించలేపోయారు.అందువల్లే కేటిఆర్,హరీష్ రావులు ప్రత్యేకించి ఫ్యూచర్ సిటీలో రేవంత్ సోదరుడు తక్కువ ధరకు భూమి పొందారంటూ అక్కడకు వెళ్లి నిరసన తెలిపారు.అయినా ఇలాంటి విషయాలు సభలో చర్చించితే వచ్చే ప్రాధాన్యత వేరే ఉంటుంది. అలాగే రికార్డులలో ఎప్పటికి ఉండిపోతుంది.22 ఎ భూముల అంశంపై కూడా పార్టీ ఆఫీస్‌లో బాదితులతో ఒక కార్యక్రమం పెట్టడం ద్వారా కొంత కవర్ చేసుకునే యత్నం చేశారు. ప్రతిపక్ష నేత కేసిఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సమావేశమై వ్యూహ రచన చేసుకున్నా పెద్దగా ఫలించినట్లు అనిపించదు. రేవంత్ ఇంతవరకు బీఆర్ఎస్ను అసెంబ్లీలో నిలువరించినప్పటికీ,కొన్ని చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదన్న విమర్శ జనంలోకి వెళ్లవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటువద్దే అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారన్న విమర్శకు గురి అయ్యారు.పార్లమెంటులో రాహుల్ గాంధీ నల్ల షర్టుతో వెళ్లినప్పుడు ,తాము వెళితే తప్పేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ తరహా నిరసనలు ఆయా రాష్ట్రాలలో జరుగుతూనే ఉంటాయి. ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి వేరు పడిన తర్వాత నల్ల షర్టు వేసుకుని అసెంబ్లీలో ప్రధాని మోడీపై తీవ్రమై విమర్శలు చేశారు.గతంలో ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి నిరసనలు జరిగేవి.సభ గేటు వద్ద జరిగిన ఘటనలను, స్పీకర్ పై ఓ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను కెసిఆర్ కు ముడిపెట్టి ఇదంతా ఫామ్ హౌస్ కుట్ర అని ప్రచారం చేయాలని రేవంత్ భావించారు.కాని అది కూడా అంతగా సఫలం అయినట్లు అనిపించదు.రేవంత్ ఎలాగొలా కేసీఆర్‌ను రెచ్చగొట్టి కేసీఆర్‌ను ముగ్గులోకి లాగాలనే తాపత్రయపడుతున్నారు. కేసీఆర్,తను ఒకటే స్థాయి అని,ఆ మాటకొస్తే కేసీఆర్ కన్నా తానే పవర్ ఫుల్ అని నిరూపించుకోవడానికి ఆయన యత్నిస్తుంటారు. కాని కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండడం ద్వారానే సమానం చెబుతున్నారు.స్పీకర్ దళిత వర్గానికి చెందినవారు కనుక ఆ కోణం తీసుకుని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద కొందరు నేతలను , దళిత సంఘాలను పంపి నిరసన చెప్పే ప్రయత్నం చేయడం అంత పద్దతిగా లేదు.దీనివల్ల కాంగ్రెస్ కు ఎంత లాభం వచ్చిందో చెప్పలేం.పైగా ప్రభుత్వంలో ఉండి ఘర్షణ వాతావరణం సృష్టించారన్న విమర్శ వచ్చింది.ఈ సందర్భంలో గతంలో బీఆర్ఎస్లో ఉన్న దళిత ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి ,కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఎంత తీవ్రమైన విమర్శలు చేశారో తెలిపే వీడియోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రవెల్లి వద్ద శుద్ది కార్యక్రమం నిర్వహించారు.అది కూడా సరైనదేనా అన్నది ఆలోచించుకోవాలి.కాకపోతే రేవంత్ ఈ క్షుద్రపూజలు,చేతబడులువంటివాటిని నమ్ముతారు కనుక ఆయనను భయపెట్టడానికి ఏమైనా చేశారేమో తెలియదు.పసుపు నీళ్లు చల్లినవారిని అరెస్టు చేసిన పోలీసులు ,ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కాంగ్రెస్ వారిపై కూడా చర్య తీసకోవాలి కదా!తెలంగాణ పోలీసులు ఎపిలో కన్నా బెటర్ అనుకుంటున్న తరుణంలో ఇలాంటివి జరగడం సరికాదు. డీజీపీ సీవీ ఆనంద్‌కు గతంలో మంచిపేరే ఉంది.కాని ఇప్పుడు ఆయన చేతిలో ఏమి లేదని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే కేటిఆర్,హరీష్ తదితరులపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం మరీ దారుణంగా ఉంది. ఒక లేడీ కానిస్టేబుల్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణతో ఈ కేసు పెట్టడం వల్ల ప్రభుత్వానికి,రేవంత్‌కు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. పైగా ఇలాంటివి బూమ్ రాంగ్ అవుతాయని కాంగ్రెస్ గమనించాలి.ఎపిలో కూడా ఇలాంటి దిక్కుమాలిన కేసులను రేవంత్ గురువైన చంద్రబాబు ప్రభుత్వం తీరు విమర్శలకు గురి అవుతోంది. మరో సంగతి ఏమిటంటే అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై రేవంత్ ఫ్లాష్ సర్వే చేసుకుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం వచ్చిందట. అలాగే బీఆర్ఎస్ కూడా ఒక సర్వేని ప్రచారంలోకి తెచ్చి తాము అదికారంలోకి రాబోతున్నామని దీమాను వ్యక్తం చేసింది.రెండేళ్ల తర్వాత ఈ సర్వేల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేం.కాకపోతే ఓవరాల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నెగిటివ్ వాతావరణాన్ని ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండవచ్చు.మరో వైపు బీజేపీ కూడా తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయత్నాలు చేస్తోంది. కాని పరిస్థితి లోక్ సభ ఎన్నికలలో మాదిరి అనుకూలంగా ఉంటుందా?అన్నది చర్చనీయాంశంగా ఉంది.అసెంబ్లీలో బిజెపి సభ్యులు 22 ఎ తదితర అంశాలపై మాట్లాడారు.వారు బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు రెండిటిని విమర్శించారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 ఎ పై జవాబు ఇచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినా ప్రజలలో మాత్రం దీని అలజడి తగ్గలేదు. అసెంబ్లీ వరకు రేవంత్ వ్యూహం కొంత ఫలించినా, అసెంబ్లీ వెలుపల కేటిఆర్,హరీష్ లు నిర్వహించిన కార్యక్రమాలతో ప్రజలను కొంతమేర ఆకర్షించగలిగారు. కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై మండిపడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కొన్నిసార్లు దాడులు, హత్యలు నేరుగా ప్రాణం తీయడంతో మొదలవవుని, పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్లోనే, యూనిఫామ్ ధరించిన అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయని, ఇదే తీరు కొనసాగితే త్వరలోనే రోడ్లపై దాడులు, మూకదాడులు, హింస మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్ మహేష్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేతకు తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు ఈ పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ పూర్తి అరాచకత్వం అంచున నిలిచిందని విమర్శిస్తూ..‘వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. Lynching doesn’t always start as an act of killingSometimes it starts as a carefully planned attack inside a fully functional police station, in front of uniformed officialsThe way goodaism is being sponsored and enabled by state machinery, I am worried that very soon we will…— KTR (@KTRBRS) September 14, 2026 -
పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా?
సాక్షి,హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లు విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఆందోళనల ఘటనకు సంబంధించి పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పోలీసులు వారికి 41ఏ సీఆర్పీసీ (35(3) BNS) కింద నోటీసులు అందించారు.విచారణ ముగిసే సమయానికి పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్ గేటు వద్ద నుంచి వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా, తాము బయటే ఉంటామని కార్యకర్తలు పట్టుబట్టడంతో అక్కడ తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్లో తన పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిన పరిణామాలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్లోకి ఏకంగా గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా ?? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని ఈ దాడి చేయించరా ?? వెంటనే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్‌కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉంది. ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలి. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలి. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు’అని పేర్కొన్నారు.మరోవైపు తమపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్ లోకి ఏకంగా 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా…— KTR (@KTRBRS) September 14, 2026 -
కేటీఆర్ పీఏ,పీఆర్వో విచారణలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును పరిశీలించేందుకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరినీ అసెంబ్లీ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సైఫాబాద్ పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి.అసెంబ్లీ ఎదుట ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూపీ లాగుతున్న పోలీసులు, సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం కేటీఆర్ పీఏ, పీఆర్వో అక్కడికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దీనిని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ విచారణ కొనసాగుతోందని న్యాయవాదులు ఆరోపించారు.మరోవైపు, ఈ వివాదం మధ్యలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్ఓ మహేష్ స్పందిస్తూ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తామే స్వయంగా అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వస్తామని చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి మహేందర్ రెడ్డి, మహేష్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి, మహేష్ రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఇదీ చదవండి : కొండా సురేఖ బర్తరఫ్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే -
సీఎంగా తలసాని.. ఉత్తమ్‌గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే ...
-
బీఆర్ఎస్ నేతలపై కేసులు.. వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులను సైతం చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా.. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరు చట్టబద్ధ పాలనకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడంలో పోలీసులు చూపుతున్న వేగం.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తూ.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించకూడదని సూచించారు.The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of lawWe of course will fight this rubbish cases in court of law But let me ask @TelanganaDGP Garu… pic.twitter.com/dGxvJrSibA— KTR (@KTRBRS) September 12, 2026ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీకి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మిస్ వరల్డ్ సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు కాపాడుతున్నారా? అని నిలదీశారు.ఇదీ చదవండి: తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ.. -
కేటీఆర్ కాల్ కట్ చేసిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే?
-
ప్రభాస్ కు KTR ప్రాంక్ కాల్
-
కొండా సురేఖ బర్తరఫ్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ కేబినెట్ బర్తరఫ్, రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22-ఏ (22-A) నిబంధన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఒక ఆంక్ష మాత్రమే కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే ఒక పెద్ద మహా కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు.22ఏ నిషేధిత భూముల స్కాం పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు సామాన్యుల ఆస్తులను టార్గెట్ చేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగించడానికి 22-ఏ భూముల వివాదమే. ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అని, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి కేవలం సారీ చెబితే సరిపోదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్రంలో సంక్షేమం పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని’ స్పష్టం చేశారు. 👉ఇదీ చదవండి : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్ -
హలో డార్లింగ్.. ప్రభాస్‌కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'
ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఊహించని ఫోన్ కాల్‌తో అవాక్కయ్యాడు. ఇది కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త తికమక పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి ప్రాంక్ కాల్ గోల?మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 'ది అండర్ 18 వరల్డ్' అనే యూత్ టాక్ షో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు.. కేటీఆర్‌కు ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. మీ వ్యక్తిగత మొబైల్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని అడగ్గా.. ప్రభాస్‌కు కాల్ చేశారు. ప్రభాస్ కూడా వెంటనే స్పందించి 'గుడ్ ఈవెనింగ్ సార్' అని పలకరించారు. కానీ కేటీఆర్ బదులుగా పక్కనే కూర్చున్న ఒక పాప ఫోన్ అందుకుంది. చాలా అమాయకంగా నటిస్తూ.. "సార్, నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొబైల్ దొరికింది. ఇందులో చూస్తే మీ నెంబర్ కనిపించింది.. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది.కేటీఆర్ నంబర్ నుంచి తనకు ఫోన్ రావడం, తీరా చూస్తే గుర్తుతెలియని చిన్నారి వాయిస్ వినిపించేసరికి ప్రభాస్‌కు ఏం అర్థం కాలేదు. దీంతో వెంటనే కాల్ కట్ చేసేశాడు. ప్రభాస్ రియాక్షన్ చూసి కేటీఆర్ సరదాగా నవ్వుతూ తలపట్టుకున్నారు. తర్వాత స్వయంగా కేటీఆర్ మళ్లీ ప్రభాస్‌కి కాల్ కలిపారు. ప్రభాస్ లైన్లోకి రాగానే అసలు విషయం చెప్పారు.తాను ‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్‌కాస్ట్ షోలో ఉన్నానని, అక్కడున్న పిల్లల కోరిక మేరకు సరదాగా ఈ ప్రాంక్ చేశామని వివరించారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ పగలబడి నవ్వుతూ వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.When kids pranked Prabhas from KTR’s phone, pretending they found it on the road! Too cute. 😀🥰#Prabhas #KTR #PrabhasFans pic.twitter.com/ib7FSWUmV9— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) September 11, 2026 -
రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తోంది.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి కలసి భూదోపిడికి తెగబడుతున్నారని రాష్ట్రంలో గిరిజనుల, అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భూముల వివాదంతోనే మంత్రిని బర్తరఫ్ చేశారన్నారు. రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తుందని. సీఎం సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులపై దాడి చేశారన్నారు. ఈ రోజు శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో 22ఏ బాధితులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో భూముల విలువ భారీగా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 22ఏ అంశంతో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూదోపిడి విచ్చలవిడిగా జరుగుతుందని మంత్రులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై సీఎం రేవంత్ కన్నేశారని మూసీ పేరుతో వేల ఎకరాలు దోచుకున్నారని ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ ఆయన సోదరుడికి ఐదు ఎకరాల భూమిని కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.22ఏ వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 22ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఓ బాధితుడు 22ఏతో మా స్థలాలకు లోన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నామని తమ ఆవేదనని వెల్లిబుచ్చుకున్నారు. -
ఫ్యూచర్ లేని సిటీ...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ ఓ మిథ్య అని, దానికి ఎలాంటి ఫ్యూచర్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూముల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చెల్లవని, ఫ్యూచర్ లేని సీఎం..తన సోదరులతో కలిసి ఆడుతున్న రియల్ ఎస్టేట్ నాటకంలో బలిపశువులు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులు పెట్టి మోసపోవొద్దు. ఏటా రూ.లక్ష కూడా టర్నోవర్ లేని సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి రూ.250 కోట్లు విలువ చేసే భూములను రూ.7 కోట్లకే కట్టబెట్టడంపై కోర్టులను ఆశ్రయిస్తాం. ఎనుముల అన్నదమ్ముల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోం..’అని అన్నారు. గురువారం మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో టెస్సెరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఆ కంపెనీకి భూ కేటాయింపులపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మాట్లాడారు. ఇందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి.. ‘ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం నడుపుతోంది. వాస్తవానికి ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగింది. ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకం. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రేపు కోర్టులో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పారిశ్రామికవేత్తలే. పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి ఈ భూ కేటాయింపుపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలి. సీఎం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం అధికార దుర్వినియోగం కాదా? ప్రయోజనాల సంఘర్షణ కాదా? కుటుంబ పాలన కాదా? ఒకవైపు సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి.. మరోవైపు పారిశ్రామికవేత్త ఎనుముల జగదీశ్వర్‌రెడ్డిల మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ భూములు, మినహాయింపులు ఇవ్వాలా? సీఎం సోదరుడి సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌తో చేసుకున్న ఒప్పందంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? అనామక కంపెనీకి విలువైన భూములు కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? ఈడీ, ఐటీ, సీబీఐలు మాపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు వారికి ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణ..కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారు. తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన హోం మంత్రి ఎక్కడున్నారు?ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయి. ఈ రంగంలోనూ అధికారానికి దగ్గర గా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు కూడా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలి.సామాన్యులకు కూడా ఇలాగే భూములు ఇస్తారా? భూ కేటాయింపుల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలి. మేము లక్ష రూపాయల మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే కోట్ల విలువైన స్థలం ఇస్తారా? మాకు కూడా ఇదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా? ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోం. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తాం, రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తాం..’అని కేటీఆర్ అన్నారు. -
ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కొండల్ రెడ్డి భూముల పరిశీలన
బీఆర్ఎస్ నేతల ఫ్యూచర్ సిటీ పరిశీలన అప్డేట్స్..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్..రూ.200 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించారు.టెస్సరాక్ట్ కంపెనీ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిది.ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేనేలేదు.ఫ్యూచర్ సిటీ భూములను రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొల్లగొడుతున్నారురేవంత్ భూ దోపిడిని ప్రజా కోర్టులో నిలదీస్తాం.టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూమిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాము.శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు హాజరు అవుతాము.22-A అంశం లేవనెత్తుతామనే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.సంధ్యా రావు అనే ఫేక్ అకౌంట్ సృష్టించిందే కాంగ్రెస్ సోషల్ మీడియా.విచారణ చెయ్యాల్సి వస్తే ఫేక్ అకౌంట్‌పై విచారణ చేయాలి. శాసనమండలిలో ఆందోళన.. మరోవైపు.. భూముల విషయంలో శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్బీఆర్ఎస్ సభ్యులు చేసే ప్రస్తావన సరైన మార్గంలో వస్తే అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.భూముల అంశం విషయంలో వారు పేర్కొంటున్న పేరు ఆ వివాదంలో లేదు.మీరు ప్రశ్న రూపంలో వస్తే దానిపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాంసభలో దేశపతి పాటలు పాడటం సరికాదు.ప్రభుత్వాన్ని అడగలేక పాటలు పడుతున్నారు.సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుంది. ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుటెస్సరాక్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల పరిశీలన.సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు ఫోర్త్ సిటీకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలుకొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టిన… https://t.co/XGhk5t8NpM pic.twitter.com/Wy5CY5uCwJ— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026 👉తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. అసెంబ్లీ పరిణామాలపై చర్చించేందుకు కేటీఆర్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు నేరుగా తుక్కుగూడకు బయలుదేరుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి సంబంధం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న టెస్సరాక్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు.👉తుక్కుగూడ–రవిర్యాల పరిధిలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే అప్పనంగా కట్టబెట్టారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం కూడా లేని కంపెనీకి ఇంత విలువైన భూములను ఎలా కేటాయిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కంపెనీ ఆర్థిక స్థితి, భూముల కేటాయింపు ప్రక్రియ, ప్రభుత్వ నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకే ఎమ్మెల్యేలు తుక్కుగూడకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, భూముల కేటాయింపులో జరిగిన అంశాలను ప్రజల ముందుంచాలని పార్టీ భావిస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలుకొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టిన… https://t.co/ECQFJc4FGo pic.twitter.com/jPGxvjZD4M— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026👉ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, మహిళా ఎమ్మెల్యేల వ్యవహారం, ఫేక్–ఏఐ కంటెంట్ తదితర అంశాలపై కూడా కేటీఆర్ నివాసంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అంశాలపైనా బీఆర్ఎస్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.👉మరోవైపు టెస్సరాక్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి డి.శ్రీధర్‌బాబు ఖండించారు. సంస్థకు సీఎం సోదరుడితో సంబంధం లేదని, భూముల కేటాయింపు నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నివాసంలో భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తుక్కుగూడ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ.200 కోట్ల భూమి రూ.7 కోట్లకే ఎలా?.. టెస్సరాక్ట్ భూములపై బీఆర్ఎస్ పోరాటం ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుఅసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తర్వాత తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చించనున్న కేటీఆర్, హరీష్ రావురేపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు https://t.co/YqHKoALy6n pic.twitter.com/BNUax7Cmal— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026 -
మా హక్కులు పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు, కేసులు, వారి అరెస్టులు సస్పెన్షన్లపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు జరిగాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై పోలీసులు, మార్షల్స్ దాడి చేశారు. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పోలీసులు వారికి ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు రోప్ పార్టీలు ఏర్పాటు చేసి వేలాది మందిని అక్కడికి అనుమతించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 167, 355 తదితర నిబంధనల మేరకు మా హక్కులు కాపాడండి. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి భద్రత కల్పించాలి..’అని ఆ వినతిపత్రంలో బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని వివరించాం.. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్‌ను కలిసినట్లు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇ చ్చిన హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను అందజేశామని చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనను కూడా వివరించామన్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై దాడి యత్నం, తమపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తీరును వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. అసెంబ్లీ, శాసనమండలిలోకి రానివ్వకుండా తమను ప్రభుత్వం అడ్డుకుందని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాసనమండలి సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని వివరించామని, ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపైనా ఫిర్యాదు చేశామని చెప్పారు. తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని, సీఎస్, డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇ చ్చినట్లు తెలిపారు. -
అసెంబ్లీ ముగిసేంత వరకు బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు అనుసరించాల్సిన రాజకీయ, పోరాట వ్యూహంపై శాసనసభా పక్షం సభ్యులతో వారు చర్చించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పేలా అసెంబ్లీ వేదికగా కొనసాగించిన పోరాటాన్ని ఇక సభ వెలుపల కూడా విస్తరించాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. గురువారం ఉదయం కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అల్పాహార భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రానున్న మూడు రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను చర్చించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అసెంబ్లీలో చర్చకు నోచుకోని 22ఏ అంశంతోపాటు పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను మాక్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని భావిస్తోంది. ఆయా అంశాలను కేవలం తెలంగాణ భవన్‌కే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలోనూ ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఇచి్చన హామీలు, వాటి అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీ వెళ్లనుంది.సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులతో కూడిన బృందం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌తోపాటు మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనుంది. అసెంబ్లీ పరిసరాల్లో తమకు జరిగిన అవమానం, పోలీసుల వ్యవహారశైలి, తమపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను ఆయా కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నారు. గవర్నర్‌ను కలిసిన సందర్భంగా కూడా ఈ అంశాలను ఆధారాలతో వివరించిన నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనలోనూ వాటిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్‌రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్‌పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్‌కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్‌ను అవమానిస్తున్నారు...శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్ -
ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్
-
‘ఫాంహౌస్‌లో కుట్ర చేసి సభను అడ్డుకున్నారు’.. అసెంబ్లీలో సీఎం రేవంత్
మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అణిచివేతకు,దోపిడీకి,పరాయిపాలను కాంగ్రెస్ పుట్టింది సీఎం రేవంత్ అణిచివేతకు,వివక్షతకు గురైన జాతులకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించిందిఅంబేద్కర్ రచిచించిన రాజ్యంగా మనదేశం బలంగా నిలబడగలిగేలా చేసిందిపాకిస్థాన్,బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఖర్గే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారుఖర్గే చిన్న తనంలో రజాకార్ల దాడిలో తల్లిని కోల్పోయారుఆర్ఎస్ఎస్ శుద్దీకరణ కార్యక్రమాన్ని సభ ఖండిస్తోందిశుద్ధీకరణ కార్యక్రమంలో పాల్గన్న వారిపై చర్యలు తీసుకోవాలిఫాంహౌస్లో కుట్ర చేసి సభను అడ్డుకున్నారుధరణలో లోపాలు,22ఏపై రాద్ధాంతాలు సభలో చర్చించాలని అనుకున్నాంఅప్పులు,తప్పులు మీద చర్చ జరిగితే సమాధి అవుతారని కేసీఆర్ భయపడ్డారు భావోద్వేగానికి ఉసిగొల్పి దాడులు చేయించారుమీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారికి ఉగ్రవాదులకు పెద్దతేడా ఏంలేదుస్పీకర్ కుర్చీని అవమానించేలా మాట్లాడారుఅనాదిగా ఈ సమాజం మహిళలను పూజిస్తోంది. అలాంటి తెలంగాణ నేల మీద తల్లిని అవమానించేలా మాట్లాడారుమా సభ్యులు,నేతలు ఉన్మాదంగా ఫాంహౌస్ దగ్గరకు వెళ్లలేదుమాదిగ బిడ్డలకు డప్పు జీవితంలో భాగంకేసీఆర్ ఫాంహౌస్ దగ్గర డప్పు కొట్టడం నిరసనలో ఓ భాగంకేసీఆర్ను అసభ్య పద జాలంతో దూషించాలనే ఆలోచన మాకు లేదుమనసులోని భావనను డప్పుతో చెప్పాలని అనుకున్నాందొరా.. నీ దొర అహంకారంతో మమ్మల్ని అవమానించకుచెప్పులు కుట్టిన చేతులు డప్పు కొట్టడమే కాదు రాష్ట్రాన్ని పాలిస్తాయిడప్పు కొట్టి నిరసన చేపట్టడం నేరమా?కేసీఆర్‌కు బాధ్యత ఉందని ప్రజలను అర్ధం చేసుకోవాలిమధ్యయుగాల్లో చక్రవర్తులు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదుప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ ఇది: హరీష్మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్..ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే..రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ని బయటకు పంపండి అంటున్నాడు.నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీలో భట్టి ముఖ్యమంత్రి అయితే మొదట సంతోష పడేది బీఆర్ఎస్.చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీకి లేదుమల్లారెడ్డి తిరుమలలో ఉంటే ఎలా సస్పెండ్ చేస్తారు?.స్పీకర్ ఒక పేరు.. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక పేరు చదివారు.చావు డప్పు కొట్టడానికి దళితులు వెళ్తే నర్సారెడ్డి ఎవరు?యాదాద్రిలో అందరి ముందే భట్టి విక్రమార్కను కింద కుర్చోబెట్టారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుల అహంకారం ఉంది..తెలంగాణలో శాంతిభద్రతలు సీఎం పరిధిలోకి రావా?లా అండ్ ఆర్డర్ సరిచేయాల్సిన బాధ్యత సీఎంపై లేదా?సభలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.సభ బయట కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదా?స్పీకర్‌ను కలుస్తాం.. అంటే టైం ఇవ్వడం లేదు.బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు తెస్తే ఎందుకు ఆపడం లేదు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం కనీసం అసెంబ్లీలో నిలుచోనివ్వడం లేదు.అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కోవా లక్ష్మీ చిట్ చాట్మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేదుస్పీకర్ బాధపడ్డారు అని తెలుసుకొని కేసీఆర్ విచారం వ్యక్తం చేయాలని మాకు చెప్పారు.మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి మేము కూడా మహిళలమే కదా!మాపై దాడి జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సానుభూతి వస్తుంది.. ఫోన్ చేసి చెప్తున్నారు.సభ జరిగినప్పుడు బయట ఏదైనా ఘటన జరిగితే అసెంబ్లీలో ప్రకటన చేస్తారు.కానీ ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగితే కనీసం ప్రకటన లేదు.దెబ్బ తగిలింది మాకు.. మా గురించి మాట్లాడడం లేదు.వాళ్ళు ఏమో అమ్మ గురించి.. వాళ్ళ అక్కల గురించి ఆలోచించారుసభలో మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వకుండా నాటకాలు అంటున్నారు.మాకు జరిగిన అవమానంపై అధికార మహిళా సభ్యులు మా వైపు చూడలేదు.మాపై ఇష్టం వచ్చినట్లు మగ పోలీసులు ప్రవర్తించారుసుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకుంటే మేము కింద పడిపోయే వాళ్ళంహరీష్ రావు, కేటీఆర్ చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు.మహిళ శాసన సభ్యుల చుట్టూ మగ పోలీసులను పెట్టి రాజకీయం చేశారు.మేము మహిళలమే కదా.. మాకు జరిగిన అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టరు?దళితుల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని భట్టి విక్రమార్క అంటున్నారుమహిళల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం కాదా!మాకు జరిగిన అవమానంపై సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి.ఎక్కడ ఏం జరిగిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం వస్తుంది.మాపై జరిగిన దాడి గురించి ప్రభుత్వానికి ఎందుకు సమాచారం రాలేదు.సీఎంకు మహిళల గురించి పట్టింపు లేదు .శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం మా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తున్నారు కాసేపట్లో లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ నేతలు..ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీభవిష్యత్తు కార్యాచరణపై చర్చకాసేపట్లో లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఅసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.బీఆర్ఎస్ల్వీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నం.కేటీఆర్, హరీష్‌రావును అడ్డుకున్న మార్షల్స్.స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయత్నం.అడ్డుకున్న మార్షల్స్‌పై ఎమ్మెల్యేల ఆగ్రహం. స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.స్పీకర్ చాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆపేసిన మార్షల్స్సస్పెండ్ అయ్యారు కాబట్టి ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లొద్దన్న చీఫ్ మార్షల్ కరుణాకర్.స్పీకర్‌ను కలవనీయకపోవడంతో మరికాసేపట్లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ చిట్ చాట్.బీఆర్ఎస్ రెండు అంశాలపై సభలో ఆందోళన చేసింది.మహిళలపై దాడి చేస్తే నిరసన చేయవద్దా?మాజీ సీఎం, తెలంగాణ సాధించిన నేత చావు కోరుకుంటే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా?సెషన్ మొత్తం ఎలా సస్పెండ్ చేస్తారు?దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది.దళితుల పట్ల ప్రేమ ఉంటే భట్టి విక్రమార్కను సీఎం చేయాలి. తెలంగాణ అసెంబ్లీ కాసేపు వాయిదా.. మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుసభలో మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు..అందుకే మేము వాకౌట్ చేస్తున్నాం: మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి.ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి..సభ ఉన్నత విలువలు పాటించాలి..మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొడతారట.ఎక్కడైనా ఇలా ఉంటుందా?.దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారునిన్న సభలోకి వస్తే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదుసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలిమా సభ్యులు సభలోకి వచ్చేవరకూ మా నిరసన కొనసాగుతుంది..మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలినిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి.. వీరిపై సస్పెన్షన్..కేటీఆర్, హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డిఅనీల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్‌రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డిమల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సస్పెండ్..శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలి: శ్రీధర్బాబుఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన స్పీకర్కేటీఆర్, హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు సస్పెండ్మొత్తం 22 మంది సభ్యులపై సస్పెన్షన్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనకేసీఆర్ నివాసంపై దాడికి యత్నించారని ఆందోళన జస్టిస్ కావాలంటూ డిమాండ్. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..రాహుల్ గాంధీపైన విమర్శలు చేస్తే నేను ఒప్పుకోము.ఎవరి చావును కాంగ్రెస్ పార్టీ కోరుకోదు.కేసీఆర్ ఆరోగ్యంగా వందేళ్ళు బతకాలని కోరుకుంటాం.ప్రజలకు కేసీఆర్ సేవ చేయాలని కోరుకుంటాం.కరీంనగర్లో కేటీఆర్.. రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావు అని అన్నారుదళితులు నడిచిన చోట శుద్ధి చేశారు.. ఏ కాలంలో ఉన్నామో తెలియడం లేదు.సభ సజావుగా నడిచేలా ప్రతిపక్షం సహకరించాలిబీఆర్ఎస్ ఆందోళన విరమించాలి.లేదంటే సభ నడపడానికి మేము కార్యాచరణ తీసుకుంటాంశాసనసభలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళనపోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలుడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..అసెంబ్లీలో సభాపతితో వాగ్వాదం చేయడం కరెక్ట్ కాదు.సభ్యసమాజం ఆశ్చర్యపోయే విధంగా బీఆర్ఎస్ నాయకుల తీరు ఉంది.బీఆర్ఎస్ చేసిన అవమానాలను భరించడానికి ఇక ఓపిక లేదు.ఇంకా ఎంతకాలం దళితులను అవమానిస్తారు?బీఆర్ఎస్ సవాల్‌కు భయపడే వాళ్ళు ఎవరూ లేరు.మీ బెదిరింపులకు ఉడత ఊపులకు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు!ఇలా దాడులు చేసి బతుకుదాం అనుకుంటున్నారు కేటీఆర్ కామెంట్స్..మాపై కేసులు పెట్టడం సహజమేమా ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి వాడుతున్నారుసైబర్ క్రైమ్‌లో మేము కూడా ఫిర్యాదు చేస్తాం.శాసన మండలి..మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కామెంట్స్..మా సభ్యులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలిసభ్యుల వాదనలను వినిపించేలా అవకాశం ఇవ్వాలికుట్రలో భాగంగానే పోలీసులతో ఆ విధంగా వ్యవహరించేలా చేశారుభట్టి విక్రమార్క కామెంట్స్..బీఆర్ఎస్ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.బీఆర్ఎస్ నేతలు స్పీకర్ తల్లిని దూషించారు.ఎర్రవల్లిలో బీఆర్ఎస్ చేపట్టిన శుద్ధి ఘటనపై సభలో చర్చ జరగాలి.రోడ్డుపై దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్.బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన మంచిది కాదు.అంతా చేసి సభకు వచ్చి న్యాయం కావాలంటారా? ఆత్మ గౌరవంతో తెలంగాణ ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు?గత పదేళ్లలో ప్రతిపక్షాలు పొడియంలోకి వచ్చి ఆందోళన చేయలేదు.బీఆర్ఎస్ చేసిన శుద్ధి కార్యక్రమంపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతల ఆగ్రహంసభలో బీఆర్ఎస్ ఆందోళనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్శుద్ధి పేరిట బీఆర్ఎస్ చేసిన కార్యక్రమంపై చర్చ జరపాలని మంత్రి డిమాండ్దళితులు ఆందోళన చేస్తే శుద్ధి కార్యక్రమం చేస్తారా?దళితులను ప్రతిక్షణం అవమానిస్తున్నారుబీఆర్ఎస్ ఆందోళనపై స్పీకర్ అసంతృప్తిసీనియర్ ఎమ్మెల్యేగా ఉండి పొడియం ముందు ఆందోళన ఎలా చేస్తారు?ఏ అంశం అయినా రాత పూర్వకుండా ఇస్తే పరిశీలన చేస్తా: స్పీకర్. అసెంబ్లీలో గందరగోళం.. అసెంబ్లీ మీడియా పాయింట్..ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్.దళితులను అవమానించినందుకు ముందు శాసనసభలో క్షమాపణ చెప్పి సభలోకి అడుగు పెట్టాలిలేదంటే వాళ్ళను సభలోకి అడుగుపెట్టనీయంకేసీఆర్కు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని చెప్పాలిబీఆర్ఎస్ అనేది అంటరాని పార్టీబీఆర్ఎస్ను తరిమి కొట్టడమే మా లక్ష్యంబీఆర్ఎస్లో ముగ్గురో లేక కోటి మంది కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీనో తేల్చుకుందాంకొట్లాడాలి కానీ బట్టలు విప్పుకుని తిరగాలా?అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఉనికి కోసం అలజడులు సృష్టిస్తున్నారుదళితులతో పెట్టుకున్న ఏ పార్టీ కి మనుగడ లేదుప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కామెంట్స్దళితులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణంబీఆర్ఎస్ పార్టీ దళితులపై చిన్న చూపు చూస్తుందిదళిత స్పీకర్‌ను అవమానించారుఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలిలెందటే బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా చూడాల్సి వస్తుంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో రగడ..అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..దళితులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలికేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.కాసేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.ప్రశ్నోత్తరాలతో సభ మొదలుకానుంది.నేడు పంచాయతీరాజ్ సవరణ చట్టానికి సంబంధించిన కీలక బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు-2026పై సభలో చర్చ జరగనుంది.గ్రామీణపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య చర్చ కొనసాగనుంది. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం,కేసీఆర్ నివాసం వద్ద పోలీసుల సమక్షంలో ర్యాలీ,కేసీఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు,రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్బీజేపీ వాయిదా తీర్మానం..అసెంబ్లీలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్,ఉద్యోగుల పెండింగ్ డీఏల చెల్లింపులపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి -
కేటీఆర్ అరెస్టు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్‌కు తరలించడంతో బోయిన్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్‌ను బోయిన్‌పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్‌ను పోలీసు స్టేషన్‌లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్‌ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావుపై క్రిమినల్ కేసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్‌రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు డి.సు«దీర్‌రెడ్డి, గంగుల, పాడి కౌశిక్‌రెడ్డి, జి.జగదీశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్‌రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -
కేటీఆర్,హరీష్ రావు విడుదల.. సీఎం రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ గుండాలను కేసీఆర్ ఇంటి మీదకు పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోయిన్పల్లి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేల మీద హేయంగా దాడి చేశారని అందరి కంటే ముందు చావు వచ్చేది కాంగ్రెస్ పార్టీకేనని 600కు పైగా హామీలిచ్చి వెయ్యిరోజులైనా ఇంకా వాటిని నేరవేర్చలేదని..స్కూటీలు ఇస్తానని లూటీలు చేశారని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. దశాబ్దాల తెలంగాణ కలను కేసీఆర్ నెరవేర్చారని ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టారని కొనియాడారు. అనంతరం జవహర్ నగర్ పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ చేసే దమనకాండను రాష్ట్ర ప్రజలంగా గమనిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో హెడ్ లైన్స్ మారుతాయి కానీ ప్రజల జీవితాలు మారవని చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతూ.."తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారు. యూరియా యాప్‌లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నయాపైసా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. సబితక్క గొంతు మీద మగ పోలీసు చేయి వేసి నొక్కారు అసెంబ్లీ గౌరవ సభను రేవంత్ కౌరవసభగా మార్చారు." అన్నారు. కాగా ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.ఏం జరిగింది?కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ని బోయన్ పల్లి, హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. కాసేపటి క్రితమే వారిద్దరిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు మీడియా ఎదుట మాట్లాడారు. ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్, హరీష్ -
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
-
కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే అగ్నిగుండమే : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఏం జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందన్న ఆయన.. పోలీసులే దగ్గరుండి కాంగ్రెస్ గుండాలని పంపుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇంటి ముట్టికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్‌రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
గొంతులు నొక్కారు.. చీరలు లాగారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటన అత్యంత హేయమని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని, చీరలు పట్టుకుని లాగారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఆరోపించారు. మహిళల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం లేదని విమర్శించారు.పోలీసుల ముసుగులో కొందరు గూండాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది అసెంబ్లీనా?.. రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన గొంతు, జుట్టు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అడ్డుకోకుంటే తమను కిందపడేసి పోలీసులు తొక్కేవారని అన్నారు.ప్రశ్నిస్తే గొంతు పిసికే పరిస్థితిప్రశ్నిస్తే గొంతు పట్టుకుని పిసికే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని సబిత విమర్శించారు. జరిగిన ఘటనను మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాగా పేర్కొనడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం పెరిగిపోయిందని, ఘటనపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవికి సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా పోలీసులు గొంతులు నొక్కారని కంట తడిపెట్టారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతోందన్నారు. తమ టీషర్టులపై ముఖ్యమంత్రి మాట్లాడే బూతు భాష లేదని, కేవలం హామీల అమలు కోరుతూ నినాదాలున్నాయని కోవా లక్ష్మి తెలిపారు. పోలీసులు కేటీఆర్ గొంతు పట్టుకుని లాగారని, హరీశ్‌రావు చొక్కా చించారని, జగదీశ్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు.ఇవి కూడా చదవండి: దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత -
దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ‘ఆడ బిడ్డల చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన?..’ అని నిలదీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ భయపడుతోంది..తప్పు చేయకుంటే ప్రజా సమస్యలను ఎజెండాలో పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో తమకూ ఉందని అన్నారు. ‘రాహుల్‌గాంధీ నల్ల టీ షర్టు వేసుకుని, నినాదాలు చేస్తూ పార్లమెంట్‌కు వెళ్తే అడ్డుకోరు.. మేం అదే చేస్తే పోలీసులు అడ్డుకుంటారా?..’ అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి గతంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారంటీ అని చెప్పారని, ఇప్పుడు తమ నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.గతంలో మేం క్షమాపణ చెప్పాం..సీఎం కూడా ఎమ్మెల్యేనే అని, స్పీకర్ పక్షపాత వైఖరి వీడి అందరికీ సమాన నిబంధనలు వర్తింపజేయాలని కేటీఆర్ కోరారు. తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదిస్తూ అసలు దాడి ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు కేసీఆర్ ఆదేశాలతో తాము క్షమాపణ చెప్పామని, అదే తమ సంస్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని, మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.దళితులపై రేవంత్ కపట ప్రేమదళితులపై రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దళిత బంధును ఎత్తివేసి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తమ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.జగదీశ్‌రెడ్డికి పరామర్శనిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని కేటీఆర్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన క్షేమ సమాచారాన్ని కేటీఆర్ వైద్యులనడిగి తెలుసుకున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. -
మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
-
‘ఇది తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం’
హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్‌సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్‌కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.ఇదీ చదవండి:నల్లదుస్తులతో వస్తే తప్పేంటి?: సబిత ఫైర్ -
తెలంగాణ అసెంబ్లీ : బీఆర్ఎస్ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)
-
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్‌గేట్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్‌రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్‌రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డినలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుకౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లిఅసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి -
మళ్లీ బీఆర్ఎస్ సునామీ!
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం. –కేసీఆర్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా మళ్లీ బీఆర్ఎస్ సునామీ రాబోతోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అయింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరికి బీఫాం ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది. అలా అని పార్టీ నేతలు, కార్యకర్తలు రిలాక్స్ కావొద్దు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పోరాడాలి..’ అని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో.. అసెంబ్లీ, మండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. థర్డ్‌క్లాస్ పాలన..రైజింగ్ కాదు డౌన్‌ఫాల్ ‘కాంగ్రెస్‌ది థర్డ్‌క్లాస్ పాలన. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్ వైపు వెళ్లింది. కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని అర్థమైంది. అందుకే ఆ పార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్ వైపు వెళ్లింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని అధికార పక్షం బూతు కూతలకు వేదికగా మార్చింది. పాలన చేతకాక చిల్లర మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ప్రజల గొంతును ఉభయ సభల్లో బలంగా వినిపించే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది. ప్రజల జెండానే బీఆర్ఎస్ ఎజెండాగా ఉండాలి., ప్రతి చర్చలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా పాల్గొనాలి. శాసనమండలి కూడా పాత భవనంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు సభల్లో పార్టీ సభ్యులు మరింత సమన్వయంతో వ్యవహరించాలి..’ అని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ చెప్పినా కాళేశ్వరంపై నిర్లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగించుకోవచ్చని కోవచ్చని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మేడిగడ్డ వద్ద అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుంది. అయినా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తెలంగాణ పంటలకు విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి అంశాలపై అవసరమైతే ఉభయ సభలను స్తంభింపజేయాలి. వీటి విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం..’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలపై సర్కారును నిలదీయాలి ‘పేద విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై విద్యార్థుల తరఫున అసెంబ్లీ వేదికగా గళం విప్పాలి. పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసేలా జీవో 97 తీసుకొచ్చిన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలి. ఎన్నికలకు ముందు లక్షలాది ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎందుకు విఫలమైందో నిలదీయాలి. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రయత్నాలు, గురుకులాల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులు, బాలికల మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయాలి. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి అత్యవసర పరిస్థితుల్లోనూ విక్రయించుకోలేని పరిస్థితి కల్పించడంపైనా పోరాడాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.. మిషన్ భగీరథ వ్యవస్థను నిర్వీర్యం చేసి తాగునీటి సమస్యను తీవ్రతరం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ఉచిత విద్యుత్‌కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ వంటి బకాయిలు చెల్లించకపోవడం, పీఆర్సీ పెండింగ్, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం, సింగరేణిలో అవినీతి, ప్రభుత్వ భూముల విక్రయాలు, మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం, గోదావరి–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ఉభయ సభల్లో ప్రశ్నించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మహిళలపై దాడులు పెరగడం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాలపైనా కాంగ్రెస్‌ను ఎండగట్టాలి..’ అని కేసీఅర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేకపోయిన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకత్వం, కార్యకర్తలను అభినందించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కేసీఆర్ కోరగా.. ప్రస్తుత సభ గౌరవ సభగా కాకుండా ‘కౌరవ సభ’గా మారిందని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
మోదీని వణికించిన యువతకు రేవంత్ ఓ లెక్కా?
కరీంనగర్/సిరిసిల్ల: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్నే వణికించిన యువతకు తెలంగాణ సీఎం ఓ లెక్క కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్లో శనివారం నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఉడుకు నెత్తు రు ఉరకలెత్తితే పోరాటం పోటెత్తుతుందని, యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారన్నారు. కష్టపడి సాధించుకు న్న తెలంగాణను పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించా మని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, యూత్ కమిషన్, ప్రైవేటు కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్, యువతకు రూ.10లక్షల రుణాలు, రూ.4వేల నిరు ద్యోగభృతి, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో జాబ్ కేలండర్ లేదని, స్కాం కేలండర్ నడుస్తోందని విమర్శించారు. నోటిఫికేషన్ లేకపోయినా లూటిఫికేషన్ కొనసాగుతోందన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజులైనా హామీలను అమలు చేయలేని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ.. ఓట్లు వేయించుకున్న తర్వాత తెలంగాణకు అడ్రస్ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దండం పెట్టి ఓట్లు వేసిన ఉద్యోగులే కాంగ్రెస్‌కు పిండం పెడతారన్నారు. జీవో 97 రద్దు చేసే వరకు పోరాడతాం రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన జీవో 97ను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ విద్యార్థుల వెంట ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కాలేజీలో 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలు తెలుసుకుని మాట్లాడారు. హైదరాబాద్‌లోని మాసబ్ట్యాంక్తోపాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలేమయ్యాయి? కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడంపైనే దృష్టి పెట్టిందని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్–ఐపాస్ తీసుకొచ్చామన్నారు. సుమారు 6.50 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు వివిధ దశల్లో ఆర్థిక సాయం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కేటీఆర్ కారుకు ప్రమాదం కరీంనగర్ జిల్లా పర్యటనలో కేటీఆర్ ప్రయాణిస్తున్న కారుకు అలుగునూర్ వద్ద లారీ తగిలింది. ప్రమాదం జరిగిన సమయంలో కేటీఆర్ కారులోనే ఉన్నారు. లారీ ఢీకొనడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం కేటీఆర్ తన పర్యటనను కొనసాగించారు. సమరభేరి సభలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
తమ్ముడూ.. మీ ఇంటికొస్తా!
పెనుబల్లి: ‘తమ్ముడూ భయపడకు.. నేనున్నా, మీ ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తా’అంటూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాలుడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు. కేటీఆర్‌ను చూడాలనేది తన కోరికగా వెల్లడించిన బాలుడిని వీడియోకాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడించగా ఆయన ధైర్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన బన్నే వెంకటేశ్వర్లు – దేవి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మణికంఠ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం మణికంఠ కింద పడగా కాలికి గాయమైంది. కొన్నాళ్లకు మానిపోయినా ఏడాది క్రితం అదే కాలికి వాపు రావడంతో హైదరాబాద్ తీసుకెళ్తే బోన్ కేన్సర్‌గా నిర్ధారించారు. రూ.లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా తగ్గకపోగా కేన్సర్ చివరి స్టేజీలో ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు మణికంఠను వెంటిలేటర్ మీదే ఇంటికి తీసుకొచ్చారు. చికిత్సకోసం రోజుకు రూ.10 వేలు వెచ్చిస్తున్నారు. మణికంఠ తన చివరి కోరికగా కేటీఆర్‌ను చూడాలని బంధువులతో చెప్పుకున్నాడు. ఈ విషయం తెలియడంతో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం బాలుడిని వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ‘నీకేం కాదు.. మీ కుటుంబానికి అండగా ఉంటాం. తప్పకుండా వచ్చి నిన్ను కలుస్తా’అని ధైర్యం చెబుతూ ఓదార్చారు. -
‘రాహుల్ ఎక్కడున్నావు.. హైదరాబాద్‌కు ఎందుకు రావు’
సాక్షి, కరీంనగర్: ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందంటూ రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ యువ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ, ఎక్కడున్నావు.. హైదరాబాద్‌కు ఎందుకు రావు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.రేవంత్‌రెడ్డి రెన్యూవల్ సీఎం.. జాబ్ క్యాలెండర్.. చిత్తు కాగితం కంటే హీనమని తేలిపోయింది. వెయ్యి రోజులయ్యాయి. యూత్ డిక్లరేషన్ గురించి అడిగితే బూతులు వినిపిస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం తన్నుకుంటున్నారు. వీళ్లకు తిక్క ఉంది.. కానీ లెక్కలేదు. నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లు మాత్రం జరుగుతున్నాయి. నిరుద్యోగులు నిప్పు కణికలే మండాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.కేసీఆర్ రాజీనామా చేయాలా?. ధోకేబాజ్ రేవంత్ చేయాలా?. కేసీఆర్‌తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోర్ ట్వంటీ హామీలిచ్చిన మీరే 420 సార్లు హామీలు చేయాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కొట్లాడుకుంటున్నారు. మీకు దండం పెట్టినోళ్లే.. రేపు పిండాలు పెడతారు. రాహుల్ గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. అవుతల పడ్డాడు. సీల్డ్ కవర్లో పంపిన మీ సీఎం ఏం చేస్తుండో నీకు సోయి ఉందా రాహూల్ ?. నెలకోసారి మూటలు తీసుకుని రాహూల్ గాంధీ నోరు మూసుకుని కూర్చుంటుండు’’ అంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. -
రైతుల కోసం పాదయాత్ర చేస్తా: కేటీఆర్
నల్లగొండ: గతంలో నీళ్ల కోసం కోదాడ నుంచి హాలియా వరకూ కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఇప్పుడు వినాయక చవిత లోపల నీటి షెడ్యూల్‌ను విడుదల చేయకపోతే అదే కోదాద నుంచి హాలియా వరకూ తాను పాద్రయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రైతులు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఇప్పటివరకూ వెయ్యి రోజుల పడకల పాము పాలన చూశామని విమర్శించారు కేటీఆర్ఈరోజు(గురువారం, సెప్టెంబర్3వ తేదీ) నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మేరకు కేటీఆర్ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో రైతు ధర్నాను అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ‘పచ్చని పొలాలతో ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలో రైతు మహా ధర్నా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలి. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ ఇచ్చిన హామీ ఏమైంది?, రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ. 15 వేలు ఏమైంది?, రైతు బంధు, రైతు బీమా ఎగ్గొట్టింది ఎవరు?, పంటలకు నీళ్లు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ల రక్తం చల్లుతానని రేవంత్ అంటున్నారు. సాగర్‌లో నీళ్లు ఉన్నా పంటలకు నీళ్లు ఇవ్వాలనే సోయి జిల్లాలో ఉన్న మంత్రులకు లేదు. ఉత్తమ్ నీళ్ల మంత్రి కాదు. రైతుల కళ్లలో నీళ్లు నింపుతున్న మంత్రి. ఎంతటి కరువు పరిస్థితి ఉన్నా గతంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం. నీకు ఓట్లేయడమే ఎడమ కాలువ రైతులు చేసిన తప్పా. ఓటేసిన పాపానికి రైతాంగానికి అన్యాయం చేస్తోంది. రైతులకు యూరియా కూడా దొరకడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి:రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం -
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకొనే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని.. ఆయన రాజీనామాతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు గుర్తుచేశారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవి ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ను రాజీనామా చేయాలనే నైతిక అర్హత రేవంత్‌కు లేదన్నారు. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి లాంటి అర్భకుడికి తట్టుకొనే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మురికి మాటలు వినేందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ కచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తారన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఇతర నేతలతో కలిసి తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ 23 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం.. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ప్రజలకు నరకం చూపించిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని.. వెయ్యి రోజుల శని పాలన, ప్రజాపీడన అని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ లేదా పచ్చ కాంగ్రెస్ పాలన కనిపించడం లేదని.. లుచ్చా కాంగ్రెస్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. సంపాదన కోసం సీఎం, మంత్రుల కొట్లాట ఎంగిలి విస్తరాకుల వద్ద కుక్కలు కొట్టుకున్నట్టుగా రాష్ట్ర సంపద కోసం సీఎం, మంత్రులు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ స్థాయిలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను గురుదక్షిణగా అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి నష్టం చేసేలా ఉంది. ఎస్ఎల్బీసీ కూలిపోయినా, చెక్ డ్యామ్‌లు దెబ్బతిన్నా కేంద్ర సంస్థలు, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. రూ. 50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. యూరియా అడిగిన రైతులపై లాఠీచార్జి చేయడం, నీళ్లు అడిగితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. రైతు సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఎంపీల కొడుకులపై యాక్సిడెంట్ల కేసుల నమోదులో వివక్ష ‘హైదరాబాద్‌లో పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, ఇతర పారీ్టల ఎంపీల కుమారులు ప్రమాదాలకు కారణమైనా కేసులు నమోదు చేయడంలో పోలీసులు వివక్ష చూపుతున్నారు. బొల్లారం మిలిటరీ స్థావరంపైనే దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ విద్యను అనుసంధానం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పగించిన రాష్ట్రాన్ని కుప్పకూల్చారు: హరీశ్‌రావు కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూల్చుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతిభద్రతల వంటి రంగాల్లో గతంలో తెలంగాణ దేశా>నికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితే ఇప్పుడు కరెంట్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందులు కూడా దొరకని స్థితికి చేరింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే చార్జిషీట్ విడుదల చేశాం. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ప్రకటించిన పోరాటాన్ని ప్రజల పోరాటాన్ని కొనసాగిస్తాం’అని హరీశ్‌రావు ప్రకటించారు. -
కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు.హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. -
సర్కార్ పై గులాబీ సమరం
-
ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచింది: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరు తెన్నులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ దళితులను దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణకు పీడ దినాలు పట్టి 1000 రోజులు అయ్యిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల చేసిన కేటీఆర్ మాట్లాడుతూ పలు సమస్యలతో రైతులు ధాన్యం కుప్పల మీద చనిపోతున్నారని, నీళ్లు అడిగితే తెలంగాణ సీంఎం రక్తం పారిస్తున్నారన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ఎంతో మంది రైతులు చనిపోయారు. రైతు బీమాను కూడా తెలంగాణ ప్రభత్వం రద్దు చేసింది. రేవంత్ అన్నదాతల జేబులు కొట్టి రాహుల్ జేబు నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంపై కక్ష రైతులకు శిక్షగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రశ్నించిన ఇంజినీర్లను బెల్టుతో కొడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.జాబులు అడిగితే లాఠీలతో కొడుతున్నారు. ఉద్యోగాలు అడిగితే బావిలో దూకమంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్.. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చదువురాని వ్యక్తి చేతుల్లో విద్యాశాఖ ఉందన్నారు. విద్యాసంస్థల భూములను కూడా గుంజుకున్నారు. విద్యావ్యవస్థను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారు. హెచ్‌సీయూ భూముల మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అడిగిన కాలేజీలను బెదిరిస్తున్నారు.ఇప్పుడున్నది లుచ్చా కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. వైఎస్ఆర్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌ను తాము కొనసాగించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ అంటున్నారు. పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎప్పుడు పెంచుతారని కేటీఆర్ ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లపై ప్రభుత్వం పిటిషన్లు వేయించిందని ఆరోపించారు. పథకాలు లేవు కానీ మూసీకి కోట్ల నిధులు ఖర్చు చేస్తామని చెబుతున్నారన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో దళిత, గిరిజనులకు అన్యాయం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన కాంగ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు. కమిషన్లు, పర్సంటీజీల పాలన కాంగ్రెస్ పాలన అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి. హామీలు అమలు కాక ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో పట్టపగలే దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. మెట్రో విస్తరణను గాలికొదిలేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. పాక్సో నిందితులను ప్రభుత్వం కాపాడుతోంది. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తనకు హిట్లర్ ఆదర్శం అని రేవంత్ అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో స్కామ్‌ల జాతర సాగుతోంది. వీళ్ల అవినీతి భరించలేక ఓ ఐఎఎస్ కూడా పాడిపోయారని కేటీఆర్ అన్నారు. ప్రతి పనిలోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారు. వాటాల కోసం మంత్రులు కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని రేవంత్ అంటున్నారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తకాదు. కేసీఆర్ రాజీనామా చేస్తేనే కదా రాష్ట్రం వచ్చింది అని కేటీఆర్ అన్నారు కేసీఆర్ అనే నాయకుడు లేకుంటే..రేవంత్‌కు సీఎం పదవి వచ్చేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార పార్టీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అసెంబ్లీ వేదికగా, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యాచరణను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు ఏడు రోజుల కార్యాచరణను రూపొందించింది. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ‘చార్జ్‌షీట్’ విడుదల చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు తీరును ఇందులో ప్రధానంగా ఎత్తిచూపనుంది. కేవలం చార్జ్‌షీట్ విడుదలతో సరిపెట్టకుండా.. ఏ హామీ ఎంత మేర అమలైంది, ఏది అమలు కాలేదు, ప్రజలకు ఎంత నష్టం జరిగిందన్న అంశాలను వివరిస్తూ ‘బాకీ కార్డులు’రూపొందించి ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలన వైఫల్యాలని ప్రతీ గడపకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం రచించింది. చార్జ్‌షీట్ నుంచి బహిరంగ సభ వరకు..! రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయి ఆందోళనల్లో ప్రధానంగా ప్రస్తావించనుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీరు, ఎరువుల సమస్యలతోపాటు ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నిరసనలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలను కూడా ఈ ఉద్యమంలో భాగం చేయాలని పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో ఏడు రోజుల ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో ఏదో ఒకచోట భారీ బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. వివిధ అంశాలపై వివిధ సందర్భాల్లో చేసిన పోరాటాలను ఒక సమగ్ర రాజకీయ ఉద్యమంగా మలచాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకోసం కేటీఆర్ పార్టీ నేతలతో పలుమార్లు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కార్యాచరణను వివరించారు. బాకీ కార్డుల ద్వారా ఇంటింటికీ, చార్జ్‌షీట్ ద్వారా ప్రజా చర్చలోకి, నిరసనల ద్వారా క్షేత్రస్థాయిలోకి, బహిరంగ సభ ద్వారా రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. -
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మంత్రుల సంతాపంసూర్యాపేట బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పోస్టుమార్టం కోసం రెండు బృందాల ఏర్పాటు చేయాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అప్పగించాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలిసూర్యాపేట రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.చదవండి: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదంఘటనా స్థలంలో కలెక్టర్కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పరామర్శించారు. డ్రైవర్ మారిన మరుక్షణమే.. తాను డ్యూటీ మారిన తర్వాతనే ప్రమాదం జరిగిందని రెండో డ్రైవర్ మీడియాతో చెప్పారు. సూర్యాపేటలో తాను డ్రైవింగ్‌ను మరో డ్రైవర్‌కు అప్పగించి, పడుకున్నానని వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం సంభవించిందని తెలిపారు. బస్సులో 42 మంది ఉన్నారని చెప్పారు.కొద్దిలో బతికిపోయావెనుక సీటులో కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డానని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాఖీ పండుగ కోసం చెల్లెలు దగ్గరికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. ఇనుప రాడ్ తన ముఖం వరకు వచ్చి ఆగడంతో బతికిపోయానని వెల్లడించారు. బస్సు సూర్యాపేటలో ఆగి.. మళ్లీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు. -
కాంగ్రెస్ దగాపై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వేయి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బాకీ కార్డులతో హామీల వైఫల్యం రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పేరుకుపోయిన బకాయిల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా, 1,000 రోజుల పాలనలో ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎదుర్కొన్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త తరానికి చేరువయ్యేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించి వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. -
రాహుల్‌గాంధీ ద్వంద్వ నీతిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్‌గాంధీ నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝళిపిస్తూ, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కేలా దాడులకు పాల్పడుతున్నా రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నా రాహుల్ స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన లాఠీచార్జ్‌ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేయాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకతీతంగా నిలబడతారా.. లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలని, లేకపోతే విద్యార్థుల పట్ల ఆయనది కపట ప్రేమగానే ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి అంశంపై హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి, మంత్రుల కేసుల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీగా చెల్లించే ప్రభుత్వం.. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఈ పథకాన్ని కాపాడేందుకు ఎందుకు కౌంటర్ వేయలేదని నిలదీశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడారు.తులం బంగారం హామీ ఏమైంది?కేసీఆర్ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని అమలు చేయాల్సి వస్తుందనే భయంతోనే పథకాన్ని రద్దు చేసేందుకు చూస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కుట్రను అడ్డుకునేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డులో ‘కల్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? తులం బంగారం ఎప్పుడు ఇస్తారు?’అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీసేలా ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. -
అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలు కొత్త పథకాల జాడే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ తీసుకవచ్చిన కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుభీమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన ఈ రోజు (శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. దేశానికే అన్నం పెట్టిన తెలంగాణను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎనుముల హబ్స్.. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ లాభాలు: కేటీఆర్ సెటైర్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూ కేటాయింపుల అంశం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ భూముల కేటాయింపులు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలకు దిగింది. అయితే ఈ ఆరోపణలతో కూడిన ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.టీ-హబ్‌ను నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి ‘ఎనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారు. కుటుంబ ఆధారిత, కుటుంబ ప్రయోజనాల కోసం నడిచే వ్యవస్థ అంటూ ఘాటు విమర్శలు చేశారు.“జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో.. వందల కోట్ల లాభాలు?”కేటీఆర్ తన వ్యాఖ్యల్లో ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి అత్యంత తక్కువ ధరకు విలువైన ప్రభుత్వ భూమి కేటాయించారంటూ ఆరోపణలు చేశారు. “జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో డిఫెన్స్ కంపెనీ నిర్మించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభాలు సాధించిన ఆవిష్కర్తగా అనుముల కొండల్ రెడ్డిని గుర్తించాలి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.అలాగే మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ యువతకు ప్రభుత్వ భూములు ఎలా పొందాలో ఈ “మ్యాజిక్ ట్రిక్” నేర్పించాలని ఎద్దేవా చేశారు.While we built T-Hub to ensure that real startups’ thrive, Revanth Reddy is busy devising “Anumula Hubs” - family-run, family-driven, zero-innovation, zero-employee scam…err scheme.!If you are one of the Anumula brothers, you get land allotted for dirt cheap. No questions… https://t.co/jZjt65VZvm— KTR (@KTRBRS) August 12, 2026బీఆర్ఎస్ తన ప్రచారంలో దీనిని “ఎనుముల బ్రదర్స్ రూ.200 కోట్ల భారీ భూ స్కాం”గా అభివర్ణించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కుటుంబానికి చెందిన వారికి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపుల అంశం మరోసారి రాజకీయ పోరుకు కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, కేవలం రూ.లక్ష పెయిడ్ అప్ మూలధనం ఉన్న కంపెనీకి ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని అతిపెద్ద భూకేటాయింపు అక్రమాల్లో ఒకటిగా అనుమానిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఉద్యోగి లేని సంస్థకు ఐదెకరాలా?‘టెస్సరాక్ట్ చైర్మన్ తానేనంటూ సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తమ సంస్థ పనిచేస్తున్నట్టు పేర్కొంటూ కొండల్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ కూడా పాల్గొన్నారు. టెస్సరాక్ట్ చైర్మన్ హోదాలోనే యూఎస్ భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్‌రెడ్డి చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెస్సరాక్ట్ కంపెనీ వెబ్సైట్లో ఫోన్ నంబర్ 123456789గా పేర్కొంటూ, 2025 మార్చి 31 నాటికి ఉద్యోగుల సంఖ్య సున్నాగా పేర్కొన్నారు. పటాన్‌చెరులోని ఓ చిన్న ఫ్లాట్‌ను టెస్సరాక్ట్ చిరునామాగా చూపుతున్నారు. గజానికి సుమారు రూ.3,700 చొప్పున ఐదు ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీలో రూ.7 కోట్లకు కేటాయించింది. రూ.200 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించడం కుంభకోణం కాదా. టెస్సరాక్ట్‌కు, కొండల్‌రెడ్డికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం విడ్డూరం. అమెరికాలో ఉన్న సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఎంఓయూను అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్ కుదుర్చుకున్నాడు. మంత్రి శ్రీధర్‌బాబు శాఖలోనే ఈ నిర్ణయాలు జరిగితే ఆయనకు సమాచారం లేదా. టెస్సరాక్ట్‌కు భూ కేటాయింపు వ్యవహారంపై చివరి వరకు పోరాడతాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే జల ఉద్యమం‘కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. ఇదే విషయాన్ని ఈ నెల 18న జరిగే గోదావరినది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఎజెండాలో చేర్చడం సరికాదు. ఎజెండాలో ఈ అంశాలను తొలగించకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించాలి. లేదంటే జల ఉద్యమం చేపట్టి, అవసరమైతే జీఆర్ఎంబీ సమావేశం జరిగే జలసౌధను ముట్టడిస్తాం. సీఎం యాగాలు చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నీటిని ఒడిసి పట్టే పనులు చేయకుండా యాగాలు చేయడాన్నే మేము ప్రశ్నిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే కేటీఆర్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ‘దోపిడీ చేసింది మీరా, మేమా? మీ పాలనలో లీజు భూములను క్రమబద్ధీకరించారు. అప్పుడు తప్పనిపించలేదా?’అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. సీఎం సోదరులకు భూకేటాయింపులు చేశారంటూ కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ‘ఎవరో చెబితే పనిచేసే రకం కాదు నేను. నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయమూ నాకు తెలుసు’అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 90 లక్షలకు ఎకరం ఇస్తే తాము రూ. కోటిన్నరకు ఇచ్చామని తెలిపారు. బోర్డు నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదన్నారు. 32 దరఖాస్తుల్లో టెస్సరాక్ట్ కంపెనీ ఒకటని వివరించారు. ఏ కంపెనీ ప్రారంభంలో అయినా పెట్టుబడి తక్కువ ఉంటుందని వెల్లడించారు. టెస్సరాక్ట్ కంపెనీకి, సీఎం సోదరులకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి.. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. 5 ఎకరాల్లో రూ. 34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల కంపెనీ అని కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముడుపులు తీసుకొనే కంపెనీలకు భూములిచ్చారా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వం తక్కువ ధరకు భూములు ఎందుకు ఇచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెస్సరాక్ట్‌కు నిబంధనల ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని.. దీనిపై ప్రతిపక్షాలు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పత్రికల్లో రాస్తారని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హిడెన్ ఎజెండాతోనే.. పీఎం ఏక్తా మాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని మంత్రి శ్రీధర్‌బాబు మరోసారి స్పష్టం చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం మాల్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రూ. 200 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపారు. ప్రీ బిడ్డింగ్‌లో ఏడుగురు బిల్డర్లు పాల్గొంటే ఇద్దరిని ఎంపిక చేశారని వివరించారు. పీఏం ఏక్తా మాల్ నిర్మాణంలో ప్రభుత్వంపై భారం లేకుండా లాభం జరుగుతుందని చెప్పారు. పరిశ్రమలు రావొ ద్దనే హిడెన్ ఎజెండాతో కేటీఆర్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్కు మళ్లీ అధికారం కల..నిరుపయోగంగా ఉన్న క్రమబద్దీకరించిన భూములను హిల్ట్–పీ ద్వారా బదలాయింపునకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కలేనన్నారు. ఆ పారీ్టపై కక్షతో ముందుకెళ్లే ఉద్దేశం ఉంటే కేటీఆర్ సహా ఇతరులంతా ఎక్కడో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రెండున్నరేళ్లుగా దుష్ప్రచారం చేస్తున్నా, భయపెట్టినా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. -
ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?
-
‘రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. సీఎం సోదరులు ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘సీఎం సోదరుల వ్యవహరశైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో సీఎం రేవంత్ సోదరులకు ప్రత్యేక రూల్స్ ఎందుకు?. సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీని ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. చదువు రాని రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లుతో కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ లేరు.. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు కేటాయింపు. 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని 7 వేల కోట్లకి కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీకి కొండల్ రెడ్డికి సంబంధం లేదని ఎలా చెబుతారు?..మీ శాఖలో ఏం జరుగుతుందో శ్రీధర్ బాబుకి తెలియదా? లేక సీఎం ఒత్తిడికి తలొగ్గరా? కొండల్ రెడ్డికి సంబంధం లేకుంటే యూఎస్ కౌన్సిల్ మీటింగ్‌కి ఎలా వెళ్ళారు. ఈ భూ కేటాయింపులను వదలం. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం. 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనేది ఆందోళనకరం. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాంఅర్హుల ఓట్లు కోల్పోకుండా చూస్తాం. తెలంగాణణకి అన్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా? లేదా స్పష్టం చేయాలి. జలసౌధాలో జరిగే జీఆర్ఎంబీ ఎజెండా మార్చుకుంటే జలసౌధను ముట్టడిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
కేసీఆర్ వస్తారు.. మెడికల్ కాలేజీకి ‘పెద్ది’ పేరు పెడతారు
సాక్షి, వరంగల్/నర్సంపేట: తెలంగాణ ఉద్యమ బిడ్డ పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉద్యమ గడ్డ ఘనమైన గౌరవం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పెద్ది ఆశయాల మేరకు నర్సంపేటను అభివృద్ధి చేస్తామన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది దశదిన కర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన నివాళులర్పించారు.పెద్ది అంతిమయాత్రకు కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓరుగల్లు మొత్తం కదిలివచ్చిందని, 12 గంటలపాటు లక్షలాది మంది తరలిరావడం ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టకపోయినా తెలంగాణ ఉద్యమంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడని కొనియాడారు.చివరి రోజుల్లోనూ దేవాదుల నీటి కోసం, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు పెద్ది తపించారని గుర్తుచేసుకున్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభ సమయంలోనూ నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్ గ్యాస్ అందించారని, రైతుల కోసం రూ.100 కోట్ల ప్రత్యేక ప్రాజెక్టును సాధించారని తెలిపారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకున్నా: హరీశ్పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకపోతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఉద్యమ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో డీసీఎం పైనుంచి కిందపడిపోయిన నన్ను.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. అదే ఆస్పత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ హరీశ్ కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు లెక్కచేయకుండా పెద్ది పోరాడారన్నారు. మానుకోట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నికల్లో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లు సాధించడంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ సభలో పార్టీ ముఖ్యనేతలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.ఉద్రిక్తత మధ్య విగ్రహావిష్కరణపెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ట తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. స్థానిక మెడికల్ కాలేజీ సమీపంలో విగ్రహం పెట్టాలని నిర్ణయించగా సంబంధిత నిర్మాణాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో సోమవారం ఉదయం పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. కూల్చిన ప్రదేశంలోనే మళ్లీ గద్దె నిర్మించగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
‘సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదు’
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ప్రభుత్వం బాద్యతలు నిర్వహించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదని విమర్శించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో మా హరీష్‌రావు జీఆర్ఎంబీ ఎజెండాపై ప్రశ్నించారు. కన్నేపల్లికి నేను వెళ్లి లక్ష క్యూసెక్కులు పోతున్నాయని చెప్పా. క్షద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షద్ర రాజకీయాలు చేస్తున్నారు. కరెంట్ ఉండి నేడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో కరెంట్ సరఫరా సరిగా ఉండటం లేదు. యాగాలు చేస్తే తప్పు లేదు... కేసీఆర్ యాగాలు చేశారు’ అని పేర్కొన్నారు. త్వరలో అన్ని ఆధారాలతో వివరాలు బయటపెడతారంగారెడ్డి జిల్లాలో భారీ భూకుంభకోణం జరుగుతోంది. త్వరలో ఆధారాలతో సహా వివరాలు బయటపెడతా. రైతులు, కంపెనీ మధ్య సీఎం, పొంగులేటి జోక్యం చేసుకున్నారు. ఎకరానికి రూ. 10 కోట్లు వరకూ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. కానీ ఎకరానికి రూ. 5 కోట్ల లోపే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. త్వరలో సర్వే నంబర్లతో సహా అన్ని బయటపెడతా’ అని హెచ్చరించారు. -
రేవంత్ మాటలే బీఆర్ఎస్కు ఆయుధాలు!
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్‌తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి. అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్‌రెడ్డే క్రిమినల్ వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులు ఎదుర్కొంటున్న రేవంత్‌రెడ్డేనని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి కలిసి ఇచ్చిన గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. కనీసం తన ఎన్నికల అఫిడవిట్‌ను అయినా స్వయంగా నింపే సామర్థ్యం రేవంత్‌కు ఉందా? అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలని, రాహుల్‌గాంధీతో కలిసి తెలంగాణ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవ¯న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేణు సూసైడ్ లేఖ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పట్టే చార్జిషీట్ లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాల హామీ అమలు కాకపోవడం వల్లే తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వేణు తన లేఖలో పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని అన్నారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించి యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే యువతకు జరిగిన ద్రోహంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. గాయత్రి, మేడారం పంపింగ్ వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటీవల దివంగతుడైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. పౌర సరఫరాలు, విద్యాశాఖ అవినీతి అంశాలను బయటపెట్టి ఈడీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
‘18 గంటల సీఎం’ ఏం సాధించారు?
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? కేవలం సర్వే నంబర్లు చూస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు’అని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి పాలనలో కేవలం మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప, మిగిలిన అన్ని రంగాలు వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి గురించి మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సైతం తన పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయిన శరత్ రెడ్డికి వాటాలు ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించారు’ అని ఆరోపించారు.‘మాక్స్ బీన్’ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి నిధులు మళ్లించారని, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా పోరాడటం వల్లే పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోతే అతనికి బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే దాచిపెట్టేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తాము గమనిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్కలు బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
రాహుల్ గాంధీ మాట తప్పారు జాబ్ రాక విద్యార్థి సూసైడ్ నోట్
-
వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్‌క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రాశాడు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్‌లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్‌కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్‌కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్‌కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. -
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అంటారా?.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయమై రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, ఇంజినీర్లను "క్రిమినల్ వేస్ట్" అనడం ఏంటని దేశ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న ఇంజినీర్లను అవమానించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీదేనని కేటీఆర్ స్పష్టం చేశారు.కేటీఆర్ మాట్లాడుతూ.. "ఒకవేళ రాహుల్ మౌనం వహించడం అంటే రేవంత్ వ్యాఖ్యలను సమర్థించినట్లే విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ విద్యార్థులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత కాంగ్రెస్ హామీల మోసాన్ని గుర్తుంచుకుంటుంది రేవంత్ వెంటనే విద్యార్థులు, గురువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
మీడియాపై కొన్ని పార్టీల కక్ష
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. పత్రికలు వాస్తవాలు రాస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు మీడియాపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఏ ప్రభుత్వానికీ ఇచ్చిన వరం కాదు. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రభుత్వాలు, అధికారాలు శాశ్వతం కాదు. రాజ్యాంగమే శాశ్వతం. మీడియా ప్రభుత్వాల మంచి పనులను ప్రజలకు తెలియజేయడంతోపాటు తప్పులను ఎత్తిచూపే బాధ్యత కూడా నిర్వర్తించాలి. ప్రస్తుతం దేశంలో మీడియా స్వేచ్ఛ హరించబడుతోంది. ప్రశి్నస్తే దేశద్రోహిగా ముద్ర వేయడం, మీడియాపై ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతున్నాయి.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, పత్రికా సంపాదకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ మీడియా సంస్థలు కార్పొరేట్ గుప్పిట్లోకి వెళితే నిజాలు మరుగునపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, దేశంలో విభిన్న అభిప్రాయాలను అణచివేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పిస్తూ అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలను మీడియా ఎత్తిచూపాలని, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయిందని, నిజాలను నిర్భయంగా చెప్పేవారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో యువత చేపట్టిన ఆందోళనలు కొత్త తరానికి సమాజంపై ఉన్న నిబద్ధతను చాటాయని, ఆ ఉద్యమాలు తమకు కొత్త దారిని చూపించాయని చెప్పారు.కేంద్రమంత్రి తనయుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హెచ్‌సీయూ భూముల వ్యవహారం వంటి అంశాలకు ప్రధాన మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవారు ముందుగా హేట్ స్పీచ్‌ను మానేయాలని, ఆ తర్వాతే హేట్ స్పీచ్‌పై చట్టాలు తీసుకురావాలని సూచించారు. జాన్‌వెస్లీ, కూనంనేని మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు అండగా నిలవాలని కోరారు. దోపిడీదారుల నుంచి పేదలకు మేలు జరిగేలా చూడాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం సరికాదని చెప్పారు. అధికారంలోకి వచి్చన తర్వాత రాజకీయ నేతల్లో మీడియాపై అసహసం పెరిగిపోతుందన్నారు. -
కేటీఆర్ విచారణలో కొత్త మలుపు.. ₹55 కోట్ల చెల్లింపులపై ఏసీబీ ప్రశ్నలు..!
-
ఏసీబీ కోర్టు: లక్ష పూచీకత్తు సమర్పించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఇవాళ్టి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు వచ్చే నెల(ఆగస్టు) 25కి వాయిదా వేసింది.ఐదుగురిపై అభియోగాలుఈ కేసులో కేటీఆర్ సహా ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు సైతం కోర్టు సమన్లు జారీ చేసింది. మే 14న ఏసీబీ కోర్టు ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించింది.అనుమతులు లేకుండానే.. ఏసీబీ ఛార్జ్‌షీట్ ప్రకారం.. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. కేబినెట్, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని పేర్కొంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై సంతకం జరిగేలా కేటీఆర్ వ్యవహరించారని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల భారం పడిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది.ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలుఫార్ములా ఈ రేసు కోసం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపించింది. క్విడ్‌ప్రోకో అంశంతో పాటు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని కూడా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. బీఆర్ఎస్కు వచ్చిన రూ.44 కోట్ల విరాళాల అంశాన్ని కూడా ఏసీబీ తన అభియోగాల్లో పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యంఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదొక లొట్ట పీసు కేసు అని అభివర్ణించారు. ఎలాంటి అవినీతి జరగలేదని.. ఎలాంటి రహస్య ఒప్పందాలు, లావాదేవీలు లేవని చెప్పారాయన. ఇప్పుడు.. నాంపల్లి కోర్టు విచారణ నేపథ్యంలో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. -
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
హైడరాబాద్: యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యువ ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. యువ ఇంజనీర్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం: హరీష్ఉద్యోగులకు సీఎం రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ, డీఏ హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు హరీష్‌రావు. -
హిమాన్షుకు సర్జరీ.. AIG ఆస్పత్రికి కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 6వ తేదీన జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కిందపడటంతో హిమాన్షు ముక్కుకు గాయమైంది. అప్పట్లో వైద్యులు వైద్య సేవలు అందించి పంపినప్పటికీ, భవిష్యత్తులో శ్వాసపరంగా లేదా ఇతరత్రా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సర్జరీ అవసరమని నిపుణులు సూచించారు.వైద్యుల సలహా మేరకు హిమాన్షు తాజాగా ఆసుపత్రిలో చేరగా, వైద్య బృందం నేడు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సర్జరీ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న తన మనవడు హిమాన్షును పరామర్శించారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, సర్జరీ తర్వాతి రికవరీని అక్కడి సీనియర్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడారు. వైద్యుల పర్యవేక్షణలో హిమాన్షు మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, తాను వేగంగా కోలుకుంటున్నానని సోషల్ మీడియాలో తెలిపారు. -
ఫార్ములా ఈ-రేస్ కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్ హాజరు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
ఆపదలో ఆదుకున్నది కేటీఆర్ అన్న మాత్రమే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్ ఉన్నారు. -
హైడ్రా ఒక వేట కుక్క
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. ‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సీఎంకు సిగ్గుండాలి..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనేది నువ్వు చెప్పినట్టు సంస్కరణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుల ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు?..’అని నిలదీశారు. కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ దామోదరరావులతో కలసి రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు ‘హైడ్రాపై 65 సార్లు హైకోర్టు చెప్పినా వినవా? ఇంకా ఎవరు చెప్తే వింటావ్? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్ అనుకొని, హిట్లర్‌కు ఇష్టమైన పదం ‘‘హైడ్రా’’ఐ డిమాలిíÙంగ్ ఎవ్రీథింగ్, ఇరాన్, ఇజ్రాయెల్ మాదిరిగానే ఉంటాను అంటావా? హైదరాబాద్‌ను శిథిలావస్థలోకి తీసుకునిపోతావా?ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? మమ్మల్ని కబ్జాకోరులు అని అంటున్నావ్. మేం కాదు ..నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు. అందరికంటే ఎక్కువ ఆస్తి దోచుకుంటున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులే.హైకోర్టు చెప్పి 24 గంటలైనా ఇంకా రంగనాథ్‌ను కొనసాగించొచ్చా? మా హయాంలో ఉన్న ‘ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్’(ఈవీడీఎం) పేరు మార్చి, అన్నిటికీ రంగులేసినట్టు, సున్నాలేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప పీకిందేమీ లేదు. కేవలం దాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డి అతిపెద్ద బ్లాక్ మెయిలర్‌గా మారారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్ మెయిలర్. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు. ఇప్పుడు హైడ్రాని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ రహస్య మిత్రులు బీజేపీ వాళ్లే.. రేవంత్ ఢిల్లీలో ఉన్నప్పుడే కేటీఆర్ కూడా ఉంటున్నారంటూ బీజేపీ ఎంపీ «ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డి కేసులు పెట్టేది మా మీద. తెల్లారి లేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్‌రెడ్డి రహస్య మిత్రులు బీజేపీ వాళ్లని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుని 9 రోజులు అరెస్టు చేయకుండా కాపాడింది రేవంత్‌రెడ్డే అనే విషయం అందరికీ తెలుసు. అమృత్ పథకంలో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే, అక్కడ సృజన్‌రెడ్డి నాయకత్వంలో, రేవంత్‌రెడ్డి బావమరిది నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే, మేము వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014లో కూడా బకాయిలున్నాయి.. ‘మేము అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లు ఉన్నాయి. వాటిని మేం చెల్లించలేదా? బకాయిలు అనేది నిరంతర ప్రక్రియ..’అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ‘చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ..’అంటూ ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునరి్వభజన చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావాలంటే లోక్‌సభ స్థానాల కంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే సంస్కరణలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, అయితే కొత్త బిల్లులు తెచ్చేముందు గతంలో నియమించిన కమిటీల సిఫార్సుల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే డివిజన్, వరంగల్‌లో ఏఐ సెంటర్ కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేర్చాలని కోరామన్నారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటుచేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్టీపీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. -
బీఆర్ఎస్ వచ్చాక.. హైడ్రా బంగాళాఖాతంలోకే.. కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా ను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ చేసి దోపిడి చేసే సంస్థని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా ను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్ కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు.హైడ్రా అనే సంస్థ తొమ్మిది తలల విషసర్పంలా మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని తెలిపారు.భూ వ్యవహారాల్లో అవినీతి, కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుచేశారు.హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డిసోదరుడు తిరుపతి రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పట్నం మహేంద్ర రెడ్డి,మంత్రి వివేక్ నివాసాలను ఎందుకు కూల్చడం లేదు.బిల్డర్స్ ను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్‌కు వేటకుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
జెన్‌జీ గురించి రేవంత్ మాట్లాడుతారా? అర్వింద్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకుండా జెన్‌జీ భవిష్యత్తును నాశనం చేస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ క్యాబినెట్ సగటు వయస్సు 62 సంవత్సరాలని ఆయన జెన్‌జీ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే కుటుంబ పాలన చేస్తున్నారని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి దర్యాప్తును కేంద్రానికి అప్పగించడం లేదని కేసులు ముందుకు కదలకుండా కేటీఆర్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు. దోచుకున్న వారిని కాపాడుతూ రేవంత్ మరింత దోపిడికి పాల్పడుతున్నారని, రేవంత్, కేటీఆర్ కేవలం మెుక్కుబడికోసమే ఢిల్లీకి వచ్చారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు.. -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.సోమవారం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదుం ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్ కుటుంబం.. స్పెషల్ బర్త్‌డే వేడుకలు చూశారా? (చిత్రాలు)
-
కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్.. బర్త్ డే రోజే సంచలన నిర్ణయం!
-
సర్కారు బడికి రోబోటిక్ టీచర్!
సిరిసిల్ల టౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ బడి విద్యార్థులకు తెలంగాణలోనే మొదటి హ్యూమనాయిడ్ రోబో టీచర్‌ను అందించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఈ పుట్టినరోజున అత్యాధునిక రోబోను పాఠశాలకు బహుమతిగా అందజేశారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడం కోసం ఈ రోబోను తెలంగాణలోనే తొలి ప్రయోగంగా ప్రవేశపెట్టామన్నారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ రోబో విద్యాబోధనలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో రోబోటిక్ టీచర్ నేరుగా మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సర్కారు బడి విద్యార్థులు చిన్న వయసు నుంచే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆసక్తి పెంచేందుకు దోహదం చేసింది. -
అణచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. యువతరం సీబీఐ, ఈడీ దాడులకు భయపడే రకం కాదు.. వారి స్వరం మారుతోంది. శ్రీలంకలో ఈ యువతరమే ప్రభుత్వాన్ని పాతరవేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్ర వాదులు, దేశద్రోహులు పాకిస్తానీలంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఉన్న యువత స్వరాన్ని అణచివేయాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని ఒక్కో మెట్టు ఎక్కి తొక్కుతారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అణిచివేతకు, దాష్టీకానికి పాల్పడుతోందని విమర్శిస్తూ భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చేశారు.. ‘ఏ రాజకీయ నాయకుడి అండ లేకున్నా దేశ నలుమూలల నుంచి వేలాది మంది ఢిల్లీ జంతర్ మంతర్‌కు తరలి వస్తున్నారు. యువత ఆగ్రహం కేవలం నీట్ పేపర్ లీక్‌కు సంబంధించినదే కాదు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న మోసాలు, ద్రోహాలపై వారు మండిపడుతున్నారు. పాలనను పక్కదోవ పట్టిస్తూ మతం పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న తీరును యువత అర్ధం చేసుకుంది. మేకిన్ ఇండియా అడిగితే ‘లీక్ ఇన్ ఇండియా’ను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నుంచి యువతరం జవాబుదారీతనాన్ని కోరుకుంటోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేక బీఆర్ఎస్ చేపట్టిన నిరసన వెనుక ఎలాంటి రాజకీయం లేదు.ఇద్దరు పిల్లలకు తండ్రిగా విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిరసనలో పాల్గొంటున్నా. యువతరం ప్రధాన మంత్రి కుర్చీనో, కేంద్ర మంత్రి పదవినో అడగడం లేదు. తమకు న్యాయం చేసి, భవిష్యత్తును కాపాడమని అడగడంలో అన్యాయం ఏముంది? మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియా అండతో జెన్ జీ యువత దేశాన్ని కదిలిస్తోంది. 50 ఏళ్ల క్రితం ‘జీనాహైతో మర్నా సీఖో.. కదం కదం పర్ లడ్నా సీఖో’అంటూ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక యువకుడు ఇచ్చిన నినాద బలంతో దేశ యువత ప్రస్తుతం పోరాడుతోంది..’అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు.. ‘రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపినట్లు చెప్పుకున్న ప్రధాని ఢిల్లీలో పిల్లల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఆపడం లేదు? మోదీకి వ్యతిరేకంగా గొంతు విప్పితే నొక్కేసే ప్రయత్నం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు. మీడియాతో ఎజెండాను సెట్ చేసే రాజకీయం ఇకపై నడవదు. కాక్రోచ్లు ఢిల్లీలో దండయాత్ర చేస్తున్నాయి. పిల్లలు గర్జిస్తుంటే విశ్వ గురువు నోరు విప్పడం లేదు. ‘పరీక్షా పే చర్చా’అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ప్రశ్నపత్రాల లీక్‌లకు సమాధానాలు చెప్పాలి. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడి అక్రమ కేసులు నమోదు చేయడంపై క్షమాపణ చెప్పడంతో పాటు పోలీసు కేసులను వెనక్కి తీసుకోవాలి. రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రులు కుమారులకు బెయిల్ సులభంగా వస్తోంది కానీ పేపర్ లీక్‌లపై ప్రభుత్వం నుంచి సమాధానం ఎందుకు రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలి. రాజకీయ ఎజెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఢిల్లీలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పా ర్టీల జెండాలు, ఎజెండాలతో కలుషితం చేయొద్దు. ఎజెండాను హైజాక్ చేసే ప్రయత్నాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. స్వతంత్రంగానే మీ ఎజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించండి. పా ర్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉంది. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విద్యార్థులు, యువతకు అవసరమైన సమయంలో కేసీఆర్ వెంట నిలుస్తారు. కేంద్రం దిగి వచ్చే దాకా విద్యార్థులకు అండగా ఉంటాం..’అని కేటీఆర్ చెప్పారు. నేను తప్పు చేస్తే నిరూపించి ఉరితీయించు ‘పేపర్ లీక్ అంశంపై రేవంత్‌రెడ్డి నాపై దు్రష్పచారం చేస్తున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించి నన్ను ఉరి తీయి. నేను మోదీని ప్రశి్నస్తే రేవంత్‌రెడ్డి అనే కేడీకి కోపం ఎందుకు వస్తోంది? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో కొట్లాడుతుంటే నల్లమల పులిని అని చెప్పుకునే రేవంత్ పిల్లిలా కొడంగల్‌లో దాక్కున్నాడు. రేవంత్ కూతురునో, మనవడినో ఢిల్లీలో పిల్లలను కొట్టినట్లు కొడితే ఆయన ఊరుకుంటాడా. దేశమంతా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశి్నస్తుంటే రేవంత్ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌ను విమర్శిస్తున్నాడు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
GEN Zతో పెట్టుకున్నావ్.. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది..
-
ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత అద్భుత పోరాటం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. యువత.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు. మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. యువతపై జరుగుతున్న దాడులు దారుణం. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషం.. పిల్లలపై పోలీసులు దాడులు చేశారు. విద్యార్థులు న్యాయం అడిగితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. యువకులను దారుణంగా కొట్టారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారు. ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది.ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నారు. విద్యార్థులు మంత్రి పదవి అడగలేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఘటనలు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదు. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా?. ఈ జనరేషన్ ఐటీ, ఈడీ సోదాలకు భయపడే వారు కాదు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు. నేను మోదీని ప్రశ్నిస్తే ఇక్కడున్న కేడీకి ఎందుకంత భయం?. పేపర్ లీక్‌కు, నాకు సంబంధం ఉందని రేవంత్ అంటున్నాడు. మోదీని ఎదిరించే దమ్ము రేవంత్‌కు లేదు. పాత కేసులు చూపించి జైల్లో పెడతారని రేవంత్‌కు భయం ఉంది. ఢిల్లీలో గల్లా పట్టి అడిగే దమ్ము మాకుంది ’ అని వ్యాఖ్యలు చేశారు. -
హైదరాబాద్‌లో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs యూత్ కాంగ్రెస్..
బీఆర్ఎస్ నిరసనలు అప్డేట్స్..ఇందిరా పార్క్ చేరుకున్న కేటీఆర్నల్ల చొక్కా ధరించి నిరసనలో పాల్గొన్న కేటీఆర్భారీగా చేరుకున్న విద్యార్థులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంనీట్ పేపర్ లీక్ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా మౌనం పాటించిన కేటీఆర్మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్..ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్స్బీజేపీ-బీఆర్ఎస్ రెండు ఒక్కటే..గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీక్స్ వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయారు.కేటీఆర్‌ని అడ్డుకొని తీరుతాము.అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చి అడ్డుకుంటాము.బీజేపీ హయంలోనూ పేపర్ లీకులే జరుగుతున్నాయి.సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నల్ల చొక్కాతో నిరసనల్లో కేటీఆర్..నల్లచొక్కా ధరించి నిరసనలో పాల్గొననున్న కేటీఆర్ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంపోలీసుల మోహరింపు..గాంధీ భవన్ బయట భారీగా మోహరించిన పోలీసులు...నిరుద్యోగ జేఏసీ గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు..అడ్డుకున్న పోలీసులు..ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరాపార్కు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలు..భారీగా మోహరించిన పోలీసులుఎమ్మెల్యే క్వార్టర్స్ గేటు దాటకుండా అడ్డగిస్తున్న పోలీసులుపలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులునగరంలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ చేపట్టనున్న నిరసన దీక్షను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పేపర్ లీక్‌లకు కారణం అయిన బీఆర్ఎస్ ఇప్పుడు నిరసన పేరుతో నాటకం ఆడుతుందని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ హెచ్చరించారు.ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంనిరసనలో పాల్గొననున్న విద్యార్థులు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలుకాసేపట్లో ఇందిరా పార్క్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్మరోవైపు ఇందిరాపార్క్ వద్ద పోలీసుల బందోబస్త్బీఆర్ఎస్ నిరసనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్దీంతో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం వద్ద పోలీస్ బందోబస్త్బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిపోలీసుల భారీ బందోబస్తు..ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు భారీ గా చేరుకుంటున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు..బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్‌లకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్..నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్..మరికాసేపట్లో ర్యాలీగా ఇందిరా పార్క్ వరకు వెళ్లనున్న యూత్ కాంగ్రెస్ నేతలు..కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ హెచ్చరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.నిరసనలకు కేటీఆర్..మరోవైపు.. ఉదయం పది గంటల నుంచి ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంనిరసనలో పాల్గొననున్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలుఆంక్షలు ఇలా..కేటీఆర్ ధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతి1000 మందికి మించి ధర్నా చేయరాదుమధ్యాహ్నం 2 గంటల లోపే ధర్నా ముగించాలిసచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్ళరాదుమైక్ సౌండ్లు కూడా పరిమితిలో వినియోగించాలి. -
కొడంగల్‌లో ధర్నా రాజకీయ నాటకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్‌కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘మోదీ అంటే రేవంత్‌కు భయం. ఆయన పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు ‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు. కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు. నాలుగు పార్టీలు మారి హరీశ్‌రావుపై ఆరోపణలా? ‘హరీశ్‌రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్‌రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరితోనూ పొత్తులుండవు.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం. విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి వారసత్వ హక్కు కాదు.. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు.‘‘గ్లోబేరినా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శలు గుప్పించారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
సీఎం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి తన ఏకపక్ష పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం ప్రారంభించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. ‘పేపర్ లీకుల వంటి అత్యంత దురదృష్టకరమైన సంఘటనపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం హేయమైనది..మీ పదవికి అపఖ్యాతిని తెచ్చిపెట్టేది. దానిని మీ చవకబారు అజెండాల కోసం ఉపయోగించవద్దు. మరోసారి చెబుతున్నాను బీఆర్ఎస్కు గానీ, నా కుటుంబానికి గానీ, నాకు గానీ గ్లోబరీనాతో ఎటువంటి సంబంధాలు లేవని’ కేటీఆర్ స్పష్టం చేశారు.‘మీరు క్షమాపణ చెప్పండి లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోండి అని చెబుతూ నా న్యాయ బృందం త్వరలో మీకు నోటీసు పంపుతోంది. చవకబారు మంత్రి గారూ, చాలాసార్లు, మీ అసభ్యకరమైన, అసంబద్ధమైన ఆరోపణలకు నేను స్పందించను, ఎందుకంటే అవి మొదటి నుంచే అసంబద్ధమైనవి. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన మీతో ఏకీభవిస్తున్నానని కాదు. కేవలం ఈ బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు’ అంటూ తనకు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. -
అర్హుల ఓట్లు తొలగిపోకూడదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం తన నివాసంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్.రమణ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వివరించింది. లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో చాలామందికి నోటీసులు జారీ చేయాల్సిన విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి వారికి వెంటనే మార్గనిర్దేశం చేసి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని చెప్పారు. రూ.250 కోట్ల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే జాప్యానికి కారణమని అన్నారు. పునరుద్ధరణపై రేవంత్ ఇచ్చిన హామీలను కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో చిత్తశుద్ధితో వ్యవహరింట్లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతిపాదనలను ఆయన ప్రస్తావించారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం వల్లే జాప్యం జరుగుతోందని తెలిపారు.పూర్తి లేఖ -
రేవంత్‌కు తెలిసింది ఒట్లు.. తిట్లే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఢిల్లీలో పార్లమెంట్ వద్ద వేలాది యువత నిరసనతో కేంద్రాన్ని ఎలా గడగడలాడించిన్రో చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. యువత, రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్ నాయకుడు బయట తిరగలేరు.’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు అధ్యక్షతన జరిగిజన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అన్ని గండాలను దాటిన రేవంత్‌రెడ్డి గండం రైతులు దాటలేకపోతున్నారు. రైతులకే కాక అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. 31నెలలు అయిపోయింది. ఇంకా 29నెలలే ఉంది. యువ సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని ఎండగట్టాం. యువత చేతికి రేవంత్‌రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారు. పాము సొంత పిల్లల్ని తిన్నట్లు రేవంత్‌రెడ్డి రైతులను చెప్పలేని కష్టాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. కన్నెపల్లి వద్ద 94మీ.ఎత్తులో నీరు పారుతున్నా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నడిపిస్తే, రోజుకు 3టీఎంసీల ఎత్తిపోయవచ్చు. ఎన్డీఎస్ఏ కన్నెపల్లి నీళ్లు ఎత్తిపోయొద్దని చెప్పిందా? అని ప్రశ్నించారు. గోదావరి, ప్రాణహిత నదులు పారుతున్నా పరిపాలించే వారికి సోయి లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రూ.400కోట్లతో ఎల్అండ్టీ సంస్థ రిపేరు చేస్తామని చెప్పినా ప్ర భుత్వం పట్టించుకోలేదు. ఆయన గురువు చంద్రబాబు పట్టిసీమ లిఫ్టు నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లది రక్తం చల్లండి అంటే ప్రశాంత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లాలో రైతులు రక్తం చల్లారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసింది ఒట్లు, తిట్లు మాత్రమే.’అని విమర్శించారు. ఈ సందర్భంగా వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీలపై వీడియోను ప్రదర్శించారు. ఏ జాతి నీది అంటున్నారని, తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.50లక్షలతో కొనుగో లు చేసేందుకు వెళ్లిన జాతి తమదికాదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రెండే జాతులున్నాయని, ఒకటి ప్రేమించేది, మరోటి రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి అన్నారు. కాగా, వరిధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి గాలివానకు గోడ కూలి చనిపోయిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్ కుటుంబాలకు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షలు అందజేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు లో ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, నారదా సు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్, నాయకులు రామ్మోహన్రావు, జాన్సన్‌నాయక్, విజిత్‌రావు పాల్గొన్నారు. -
‘కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం’
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.మాది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతి.. తెలంగాణ ఇచ్చిన జాతి అని స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చె తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడమేగాక, తెలంగాణ భవిష్యత్తు తరాలకు బాసటగా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ..ఎక్కుపెట్టిన తుఫాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీదని మంత్రి అన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది మీరని గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని వివరించారు.యువకుల బలిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తిన్నడమేకాకుండా..తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేశారని..అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని అహంకారం చూపించినందుకే..తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చెత్త కుప్పలో పడ్డ విషయాన్ని కేటీఆర్ మరిచిపోవొద్దని మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. -
10 నెలల కిందటే చెప్పా.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమీపంలో జరిగిన కాక్రోచ్ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8— KTR (@KTRBRS) July 21, 2026 -
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో మూలంగా కరువు పరిస్థితులు ఎదురవుతాయని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకుంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో పడుకుందని ఎద్దేవా చేశారు. వ్యవసాయంపై అవగాహన లేని ప్రభుత్వానికి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళిక, దిశ లేదని మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్లో సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక చిచోరా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నాడు. తెలంగాణలో దోచుకున్న డబ్బును మూటలు కట్టి నెలకోమారు రాహుల్ గాంధీకి అప్పగించి తన పదవిని రెన్యూవల్ చేసుకోవడమే రేవంత్‌కు తెలుసు. తెల్లారితే కేసీఆర్‌ను దూషించడం, దేవుళ్లపై ఒట్లు వేయడం మినహా రేవంత్ ప్రభుత్వానికి మరో పని లేదు. రెండున్నరేళ్లలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ‘కాళేశ్వరం’పై కాంగ్రెస్ రాజకీయాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది.మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయనే సాకుతో మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగునీరు విడుదల కోరితే రక్తం చల్లాలని సీఎం అంటున్నారు. తెలంగాణ కోసం రక్తంతో పాటు ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దం’అని కేటీఆర్ ప్రకటించారు. ‘ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
-
70 వేల ఉద్యోగాలు ఇచ్చుంటే.. రాజకీయ సన్యాసం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం చేసి, రాహుల్‌గాం«దీకి జై కొడతా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్‌నగర్ స్టేడి యం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరోలెక్క.. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. జంగ్ సైరన్ మోగించిన యంగ్ జనరేషన్ కాకతీయ, ఉస్మానియా, మహాత్మాగాం«దీ, శాతవాహన వర్సిటీలతోపాటు అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ నుంచి యువశక్తి శివమెత్తి పోటెత్తింది. పిడికిళ్లు బిగిస్తే.. పీఠాలే కదిలిపోతాయి. తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చింది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరే. దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారికి డెత్ డిక్లరేషన్ రాయాలి ‘సరిగ్గా 38 నెలల క్రితం ఇదే నేలపై తెలంగాణ యువతకు దారుణమైన దగా జరిగింది. ప్రియాంకగాం«దీతోపాటు ఢిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్, హై కమాండ్ నుంచి గాం«దీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు కలిసి వచ్చి.. మాయామశ్చింద్ర చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నయవంచనకు పాల్పడ్డారు. మన యువతకు 24 హామీలు ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి రాలేదు. డిగ్రీ పాసైతే రూ.లక్ష రాలేదు. పీహెచ్డీ చేస్తే రూ.ఐదు లక్షలు రాలేదు. అధిష్టాన పుత్రుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చిండు. చాయ్ తాగి, బిస్కెట్లు తిన్నడు. తెలంగాణ నిరుద్యోగులకు బిస్కెట్లు వేశాడు. రెండు (కేసీఆర్, కేటీఆర్) ఉద్యోగాలు తీసేస్తే.. ఒకేసారి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కొలువుల కుంభమేళా అన్నారు. కుంభకోణాల పర్వానికి తెరతీశారు. యూత్ డిక్లరేషన్ చేసిన రాహుల్‌గాం«దీకి, ప్రియాంకగాంధీకి, రేవంత్‌రెడ్డికి డెత్ డిక్లరేషన్ రాయాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్ చెప్పారు. నిన్ను సీఎంను చేసింది ఇందుకేనా..? ‘రాహుల్‌కు ప్రధాని జాబ్ వచ్చే వరకు విడిచి పెట్టబోననని సీఎం రేవంత్ చెబుతున్నాడు. తెలంగాణ యువత నిన్ను సీఎం చేసింది యువతకు జాబ్‌లు ఇవ్వాలని, లేక రాజకీయ నిరుద్యోగి రాహుల్‌కు ప్రధాని జాబ్ ఇవ్వమనా..? ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబులు నింపడం లేదు కానీ రాహుల్‌గాంధీ జేబులు, అన్నదమ్ముల అల్మారాలు బినామీల బీరువాలు నింపుతున్నాడు. ఉస్మానియా, కాకతీయ పీహెచ్డీ విద్యార్థులు.. ‘ఓటు కోసం కోటి మోసాలు.. కాంగ్రెస్ నాటకాలు’ అనే థీసిస్ చేయాలి. 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేస్తుంటే.. లాఠీలు ఝళిపిస్తున్నాడు. దమ్ముంటే సెక్యురిటీ లేకుండా వీఎం హోంకు రా? ఎవరు ఉంటారో? ఎవరు చస్తాడో ? తేలుతుంది. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది’ అని కేటీఆర్ చెప్పారు. వాళ్లది పోటీ పరీక్షలు రాసిన ముఖమా? ‘పట్టాలు చేతపట్టుకుని, కిరాయి కట్టలేక, ఖాళీ కడుపుతో నిద్రహారాలు మాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల పరిస్థితి మాకు తెలుసు. ఇలాంటి వారి జీవితాలతో కాంగ్రెస్, బీజేపీలు పరిహాసమాడుతున్నాయి. కేంద్రంలోని బడేభాయ్ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాÐనన్నాడు. ఇక్కడి చోటే భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. పకోడీలు, చెకోడీలు వేసుకొమ్మని మోదీ చెబుతుంటే.. ఎండ్రిన్ తాగి చావండని రేవంత్ చెబుతున్నాడు. పోటీ పరీక్షలకు హాజరు కావడం, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. కానీ బండి సంజయ్, రేవంత్ ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖం కాదు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నేపాల్ మాదిరి భూకంపం పుట్టించమనడం లేదు. శ్రీలంకలా శివతాండవం చేయమనడం లేదు. ప్రభుత్వాన్ని కూల్చమనడం లేదు. మాది అల్లర్లు సృష్టించి, కేసుల్లో ఇరికించి, నెత్తురు చిందించి తప్పించుకునే పార్టీ కాదు. విద్యార్థులకు అండగా ఉంటాం. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే. కేసీఆరే సీఎం. గతంలా కాకుండా ఈసారి మీ పూర్తి బా«ధ్యతను తీసుకుంటా. ఓ అన్నగా అండగా ఉంటా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. స్కైరూట్‌కు అభినందనలు.. ‘బీఆర్ఎస్ హయాంలో ప్రైవేటు రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించాం. ప్రతి మూడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలకు ఆవిష్కరణలుగా మార్చే ఒక టీహబ్‌ను సృష్టించాం. ఇక్కడ పురుడు పోసుకున్న స్కైరూట్.. 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ రాకెట్‌ను నింగిలోకి పంపింది.. స్కైరూట్‌ను అభినందిస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. -
కాంగ్రెస్‌కు 'డెత్ డిక్లరేషన్' రాయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలతో యువతను మోసం చేసిందని, ఆ మోసానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు.సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన 'యువ సంగ్రామ సభ'లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ మోసం చేసిన సరూర్నగర్లోనే 'యువ సంగ్రామ సభ' నిర్వహించాం. 38 నెలల క్రితం కాంగ్రెస్ మాటలు నమ్మి యువత దగా పడింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు. అది చిత్తు కాగితంగా మారింది. ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా. ఇదే నా సవాల్. వాస్తవానికి 10 వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు.నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైంది. రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలకూ తమదే ఘనతగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోగా, లూటిఫికేషన్ మాత్రమే జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు వచ్చారు. రాష్ట్రంలో ఉన్మాద పర్వం నడుస్తోంది. పాత కేటుగాళ్ళు, కొత్త డూప్లికేట్ గాళ్ళు యువతను మోసం చేశారు. మోసం చేసిన వాళ్లను ఏమని అందాం. 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ మాటలు నమ్మాం. అందరి కాళ్లు మొక్కి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. రేవంత్ రెడ్డి భాషలో బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగులో తొండలు విడుద్దామా?. యువతతో పెట్టుకుంటే పుట్ట గతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలి. రాహుల్ గాంధీ జేబులు రేవంత్ రెడ్డి నింపుతున్నారు. అన్నదమ్ముళ్ల అల్మారాలు నింపుతున్నారు.తెలంగాణ విద్యార్థుల గుండెల్లో బుల్లెట్లు దింపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రక్త పిశాచి. రక్తం పంట పొలాల్లో చల్లాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. 50 లక్షలతో అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికారు. క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?. అబద్దాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఓటుకు నోటు దొంగ కుర్చీలో కూర్చున్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి బిస్కెట్లు తిని మనకు బిస్కెట్లు వేసి పోయారు’ అంటూ సెటైర్లు వేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలిపితే బూతులు తిడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా?. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు.. మీ అయ్య జాగీరా?. ప్రజలు హామీలపై ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడుతున్నారు. నమ్మించి మోసం చేయడంలో రేవంత్ పీహెచ్డీ చేశారు. తెలంగాణలో భూములు, బూడిద, ఇసుక లూటిషికేషన్ జరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రపంచంలోనే అతి పెద్ద మోసం. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రేవంత్ సున్నాలు దిద్దుతున్నారు. మనం తెచ్చిన కంపెనీలకు రేవంత్ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. బడేభాయ్ రెండు కోట్లు, చోటా భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను రాజు నేను హిట్లర్ అంటూ బట్లర్ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికార పీఠం.. నిరుద్యోగులకు బలిపీఠం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ఎస్ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేళ్ల క్రితం సరూర్‌నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎండగట్టేందుకు సమాయత్తమైంది. నిరుద్యోగ యువతతో కలిసి ధర్నాలు, ఆందోళనలకు సిద్దమైంది.బీఆర్ఎస్ పార్టీ శనివారం ‘చలో సరూర్‌నగర్’ పేరిట యువ సంగ్రామ సభ నిర్వహించనున్నది. ఈ సదస్సుకు గులాబీ పార్టీ సర్వం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న ఈ సభను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. సుమారు 20వేల మంది తరలిరానున్న నేపథ్యంలో అనేక ఆటంకాలు, ఇబ్బందులను అధిగమించి చకచకా ఏర్పాట్లు చేసింది.బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ https://t.co/roxyHPPbHN pic.twitter.com/plf2dkrsgQ— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నట్టు గులాబీ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరింపుఅన్ని మెట్రో స్టేషన్లలో పోలీసుల తనిఖీలునిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం https://t.co/lNODxhBULE pic.twitter.com/V71mY5cx9F— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026 -
నేడు బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరించిన బీఆర్ఎస్ పార్టీ శనివారం సరూర్‌నగర్ స్టేడియం వేదికగా ‘యువ సంగ్రామ సదస్సు’ను నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు హాజరయ్యేలా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు సంబంధించి సుమారు పది రోజుల క్రితం నుంచే బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది.అయితే చివరి నిమిషం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో శుక్రవారం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, స్పోర్ట్స్ అథారిటీకి తాము దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం అనుమతులిచి్చంది. పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తదితరులు సరూర్ నగర్ స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆరు డిక్లరేషన్లపై సమరభేరి2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2022 మే మొదలుకుని 2023 నవంబరు వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది. వరంగల్‌లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్’ సభకు రాహుల్ గాం«దీ, హైదరాబాద్‌లో 2023 మే 9న జరిగిన ‘యూత్ డిక్లరేషన్’సభకు ప్రియాంక గాందీ, చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , 2023 నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్’ సభకు మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, నవంబర్ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్’ సభకు అప్పటి కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు హాజరయ్యారు. ఈ సభల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ల వారీగా సమరభేరీ మోగించాలని, ఆయా తేదీల్లో సభలు జరిగిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.హైకోర్టు గ్రీన్సిగ్నల్సరూర్నగర్ స్టేడియంలో నేడు బీఆర్ఎస్ నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. శనివారం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు సదస్సును నిర్వహించాలని షరతు విధించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల సమస్యలు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది. యువ సంగ్రామ సదస్సుకు అనుమతివ్వాలని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, ఎల్బీ నగర్ డీసీపీ, ఏసీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేరుస్తూ లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టీ.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.వాదనలు విన్న న్యాయమూర్తి సదస్సుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బీఆర్ఎస్ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రేపు (శనివారం, జూలై 18) నిర్వహించ తలపెట్టిన ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ సభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ నేతలు జూన్ 30నే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ నివేదికల నెపంతో పోలీసులు చివరి నిమిషంలో అనుమతిని నిరాకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సభను అడ్డుకుంటోందని మండిపడ్డ బీఆర్ఎస్ లీగల్ సెల్, దీనిపై అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న న్యాయస్థానం.. కొన్ని షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేస్తూ సభ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీలను (మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి) నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ముందు ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సమక్షంలో ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించగా, ఇప్పుడు అదే వేదిక నుండి కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. హైకోర్టు అనుమతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. -
కాళేశ్వరం రాజకీయ యుద్ధంగా మారిందా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.రేవంత్ వ్యాఖ్యను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదన్నారు కేటీఆర్. దీనిలో భాగంగా ఈనెల 18వ తేదీన సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలుఅప్రకటిత కరెంట్ కోతతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 11 జిల్లాల్లో రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారని, బొగ్గు కొరతతో విద్యుత్‌కి అంతరాయ ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని నిద్ర లేపినా.. ఉలుకు లేదు.. పలుకు లేదని మండిపడ్డారు. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు లేదని, విద్యుత్ ఉత్పత్తి లేక కోత విధిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందని, 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు హరీష్. ఇది చేతకాని ప్రభుత్వమని, ప్రభుత్వం 3190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్ కోతలని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కనీసం సోయి లేదన్నారు. ఎనిమిది గంటల విద్యుత్ అనేది రైతులకు అందించడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. -
76 సార్లు ఢిల్లీ వచ్చారు.. 76 పైసలైనా తెచ్చారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పంటలకు నీళ్లు అడిగితే రక్తం చల్లాలి’ అని సీఎం అంటారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ తన తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అసలు ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏమాత్రం నియంత్రణ ఉందో లేదో అర్థం కావడం లేదని విమర్శలు సంధించారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్‌చాట్’లో కేటీఆర్ మాట్లాడారు. ‘అధికారం చేపట్టిన 31 నెలల్లో దాదాపు 76 సార్లు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి కనీసం 76 పైసలు అయినా రాష్ట్రానికి తెచ్చారా, ఒక ప్రాజెక్టును తెచ్చారా, రైతులకు యూరియా తెచ్చారా?’ అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. 30 శాతం పర్సంటేజ్ మంత్రి పొంగులేటి ‘తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్‌లాక్ గేమ్ ఆడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 16లక్షల ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. భూముల వివాదాలను అన్‌లాక్ చేసేందుకు 30శాతం వసూలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30శాతం పర్సంటేజ్ మంత్రిగా మారారు. సర్వేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు చూస్తోంటే ఆయనలో... ‘రాము, రెమో’లు ఇద్దరు ఉన్నట్లు కనిపిస్తోంది’ కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది వాటా యథావిధిగా ఉంటేనే మద్దతు దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో 24శాతం ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని కొనసాగించాల్సిందేనని అని కేటీఆర్ అన్నారు. యధావిధిగా దక్షిణాది వాటా ఉంటేనే బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా సీట్లు పెరగాల్సిందేనన్నారు. ఏదైనా సరే బీజేపీ అనుకుంటే అవుతుందని, లేదంటే ఆలస్యం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం రేవంత్ నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ నాలుగు సర్వేలు రిపోర్టు ఇవ్వడాన్ని రేవంత్ జీరి్ణంచుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. మెట్రో భూములపై రేవంత్ కన్ను ‘మా ఓటమికి 100 శాతం కారణం మా పొరపాట్లే. అందుకే మేం ఓడిపోయాం. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటున్నాం. మమ్మల్ని ఓడించారని ప్రజలను మేం ఎప్పుడూ తప్పుబట్టలేదు. మాకు రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు, మూడోసారి మమ్మల్ని పక్కనపెట్టారు. ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోంది. 18 కోట్ల చదరపు అడుగుల్లో ‘మెట్రో’కు సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించేందుకు మెట్రోలో భాగస్వాములైన కంపెనీలకు 2008లో అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 280 ఎకరాల భూమిని కేటాయించారు. లీజు పీరియడ్ 30–40 ఏళ్లు ఉంది. అయితే ఇప్పటి వరకు 1.4 కోట్ల చదరపు అడుగుల్లో కూడా నిర్మాణం జరగలేదు. ఆ 280 ఎకరాలపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లతో వ్యక్తిగతంగా నాకు గట్టు పంచాయితీలు లేవు. కేవలం రాజకీయ విభేదాలే. 2027లో పాదయాత్ర చేస్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యా. సెలెట్రిటీల ఫోన్ ట్యాప్ కాలేదని పోలీసు అధికారులే చెబుతున్నారు. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో ఈ నెల 31న హాజరుకావాలని సమన్లు అందాయి. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతా’ అని కేటీఆర్ అన్నారు.బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయిన కేటీఆర్ ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించండి కేంద్రమంత్రి కుమారస్వామికి కేటీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తక్షణమే పునఃప్రారంభించి, భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన కమిటీతో కలసి బుధవారం ఢిల్లీలో ఆయన కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉండి, పునరుద్ధరణ జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీసీఐ పునరుద్ధరణకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్‌లోని రూ.50 కోట్ల విలువైన యంత్రాలను ఈ–వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగిస్తోందని, ఇది ఆందోళనకరమని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది పాదయాత్ర: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కుమారస్వామితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమావేశమైంది. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. ఈ-ఫార్ములా రేసు కేసులో జులై 31న కోర్టులో హాజరవుతానని.. న్యాయబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. కేసు నుంచి బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘‘న్యాయస్థానంపైన విశ్వసనీయత ఉంది. వచ్చే ఏడాది పాదయాత్ర మొదలు పెడతా. ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలో చెప్తాం. కేసీఆర్ నెక్స్ట్ సీఎం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరు తెలియదు. 8 మంది తామంటే తాము సీఎం అని అంటున్నారు’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘దక్షిణాది వాటా తగ్గకుంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది వాటా 24 శాతం కొనసాగాలి. యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు మద్దతిస్తాం. 73 సార్లు ఢిల్లీకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 73 పైసలు తీసుకువచ్చాడా?. హిట్లర్ ఆదర్శమని చెబుతున్న రేవంత్‌పై రాహుల్ గాంధీ చూస్తూ ఊరుకుంటాడా.. ఎన్డీఎస్ఏ కార్యాలయానికి ఎందుకు వెళ్లలేదు?. ఎన్డీఎస్ఏ కేవలం ఒక సలహా సంఘం మాత్రమే’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రైతులు, నిరుద్యోగులు ఆశపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. సర్వేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్‌లో హీరోయిన్ల ఫోన్లు రికార్డ్ చేశామన్నారు. ఎక్కడ ఆధారాలు పెట్టలేదు. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా అలాంటివేవీ రికార్డు లేదని చెప్పాడు.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్.. కేంద్రమంత్రితో ప్రత్యేక భేటీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (బుధవారం) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీకానున్నారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయనున్నారు.ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరనున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రికి వివరించనున్నారు. ఈ బృందంలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న , ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఉన్నారు.ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984 ఉత్పత్తిని ప్రారంభించింది. తీవ్రమైన నిధుల కొరత అధికంగా నిలిచిపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర కారణాలతో కేవలం 14 సంవత్సరాలకే తన ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాలలో తీవ్రంగా నష్టపోయారు. -
ఎన్కౌంటర్ల పేరుతో పిట్టల్లా కాల్చారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లలని కాల్చి చంపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయన్నారు. నెత్తురు ఇస్తేనే నీళ్లిస్తామంటే అందుకు తాము సిద్ధమని.. మీ రక్తదాహం తీర్చుకొని పొలాల జలదాహం తీర్చండన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన రక్తం వ్యాఖ్యలపై కేటీఆర్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఘాటుగా బదులిచ్చారు.కేటీఆర్ మాట్లాడుతూ'' నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ! ఇంకా తీరలేదా మీ రక్తదాహం ? 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా? తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు! 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్ల జూశారు. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయని మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారు. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..! మీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, రైతులకు దయచేసి నీళ్లు ఇవ్వమని కేటీఆర్ విమర్శించారు.తాము పేగులు తెగే దాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లమని రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని తాము నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లమని నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తామని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి తీవ్ర పదజాలంతో విమర్శించారు. -
ఎప్పుడూ అనుములే కాదు.. అన్నారం కూడా పట్టించుకోండి: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని అన్నారు. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయవచ్చు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీల్లు లిఫ్ట్ చేయవచ్చు. గోదావరి బేసిన్లో 77 శాతం నీళ్లు లేవు. సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోతున్నారు. మేము కన్నెపల్లికి పోగానే సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని.. భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటున్నారు. ఎల్‌నినో అంటూ రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారు. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం బండారం బయటపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. రోజుకు 9 టీఎంసీల నీళ్లు కొందకు వృథాగా పోతున్నాయి. ఈ నీళ్లతో తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు నింపవచ్చు.గేట్లు తెరిస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్ అంటున్నారు. రేవంత్‌కు ప్రాజెక్ట్‌లపై అవగాహన తెచ్చుకోవాలి. గతంలో భారీ వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు. వరదను తట్టుకని మేడిగడ్డ.. మేటిగడ్డగా నిలబడింది. కాళేశ్వరంపై బురద చల్లేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్ అజ్ఞాన ప్రదర్శన చేశాడు.మాపై కక్ష ఉంటే కేసులు.. కానీ, రైతులను పగబట్టకు. మీ రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ, మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ఒక్కనాడైనా సీఎం రేవంత్ రివ్యూ చేశారా?. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు. ఎప్పుడు అనుముల గురించే కాదు.. అన్నారం గురించి కూడా పట్టించుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా
-
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సొంత సర్వేలో తేలిందన్న కేటీఆర్.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేల భయంతోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైంది. మరోసారి ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని తెల్చిచెప్పారు...సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని.. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
హిమాన్షుకు గాయం.. హైదరాబాద్‌కు కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్పగాయమైంది. హిమాన్షుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కొన్ని రోజుల్లో కోలుకుంటారని కేటీఆర్ ఎక్స్‌లో చెప్పారు. తన కుమారుడి గురించి కాల్స్, మెసేజ్‌లు చేస్తున్న వారికి థ్యాంక్యూ చెప్పారు.తన మనవడు హిమాన్షును చూడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హిమాన్షుతో కాసేపు మాట్లాడి పరామర్శించారు. కాగా, హిమాన్షు జిమ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన ముక్కుకు గాయమైనట్లు సమాచారం. My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern— KTR (@KTRBRS) July 7, 2026 -
ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల డిజైన్ల తయారీ, నిర్మాణం, కూలిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, బరాజ్‌ల వైఫల్యానికి నాటి సీఎం, ఇరిగేషన్, ఆర్థిక శాఖల మంత్రులే బాధ్యులని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయని, సీకెంట్ పైల్స్, స్టిల్లింగ్ బేసిన్ల నిర్మాణంలో తప్పిదాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ నివేదించిందని చెప్పారు. అయినప్పటికీ ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే’ అన్న తరహాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధోరణి ఉందని మంత్రి మండిపడ్డారు. బరాజ్‌ల భద్రత ప్రమాదంలో ఉందని, నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ కమిటీ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఒకవేళ నీళ్లను నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలం పట్టణం, ఆలయంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయని తెలిపారు. ‘మీరు ఇదే కోరుకుంటున్నారా?’ అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. కేటీఆర్ కంటే ఎన్డీఎస్ఏ నిపుణులకు కొద్దిగా జ్ఞానం ఎక్కువ ఉందని భావించి బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేయడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మీరే సరిగ్గా కట్టి ఉంటే.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా కట్టి ఉంటే ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇంత దురదృష్టకరమైన దుస్థితి ఉండేది కాదు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టును ఇష్టమొచి్చనట్లు నిర్మించారు. కాళేశ్వరం చేపట్టకుండా రూ.38,500 కోట్లతో ప్రాణహిత–చేవెళ్లను పూర్తి చేసి ఉంటే ఎల్‌నినో పరిస్థితుల్లో సైతం తెలంగాణ సస్యశామలమయ్యేది. బీఆర్ఎస్ పాలకుల ఘోర తప్పిదంతోనే మూడు బరాజ్‌లు పనికి రాకుండా పోయాయి. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలూ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్చి రాష్ట్రానికి ద్రోహం చేశారు. నిర్మాణం పూర్తైన కొన్ని రోజులకే మూడు బరాజ్‌లలో లోపాలు, సీపేజీలు బయపడ్డాయి. అయినా మరమ్మతులు చేయకుండా గత సర్కారు నిర్లక్ష్యం చేసింది. మరమ్మతుల కోసం బరాజ్‌లలో నీళ్లను ఖాళీ చేసేందుకు గత ప్రభుత్వ పెద్దలు అనుమతించలేదు. అంతేకాదు..పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు. వ్యవస్థ కుప్పకూలిపోయింది. బీఆర్ఎస్ వాళ్లు ఏది ముడితే అది నాశనమైంది. మన పిల్లలు, వారి పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టి అధిక వడ్డీలతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పులు తెచ్చారు. దేశంలో మరే రాష్ట్రం చేయనంతగా రూ.1.81 లక్షల కోట్లను కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ఎకరం కూడా కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురాలేదు..’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2027 ఆగస్టు నాటికి బరాజ్‌ల పునరుద్ధరణ ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లకు పరీక్షలు, మరమ్మతులను పూర్తి చేసి 2027 జూలై/ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వినియోగంలోకి తెస్తాం. మూడు బరాజ్‌లకు రక్షణగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు స్టిల్లింగ్ బేసిన్ సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని అంచనా వేశాం. నెల రోజుల్లో బరాజ్‌ల పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేసి పనులను ప్రారంభిస్తాం..’ అని మంత్రి తెలిపారు.కాగా బరాజ్‌లకు గేట్లను దింపితేనే నీళ్లను పంపింగ్ చేయడానికి వీలుంటుందని, ప్రస్తుతం గేట్లు దింపే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ చెప్పారు. నీటిపారుదల శాఖ సలహాదారులతో కలిసి ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్డీఎస్ఏ సూచించిన అన్ని రకాల టెస్టులను పకడ్బందీగా నిర్వహిస్తుండడంతోనే పునరుద్ధరణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సొరంగాల నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు గోస
సాక్షి ప్రతినిధి, వరంగల్: కేసీఆర్‌పై రాజకీయ కక్షతో తెలంగాణ రైతులను ఈ ప్రభుత్వం గోస పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తెలంగాణకు వరప్రదాయిని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. ఓ వైపు ఎల్‌నినోతో 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు 98 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తుంటే ముఖ్యమంత్రి సిగ్గులేకుండా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటిౖకైనా పంప్‌హౌస్‌లు ప్రారంభించకపోతే 60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్ ముట్టడించి గేట్లు తెరుస్తామని హెచ్చరించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం రైతుల ఆత్మహత్యలు ఆపింది.. ‘రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కన్నెపల్లి పంప్‌హౌస్‌లను నిలిపివేశారు. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది. రైతు ఆత్మహత్యలను ఆపింది. భూముల విలువ, తెలంగాణ రైతు విలువ పెంచింది. కానీ ముఖ్యమంత్రి దు్రష్పచారం చేస్తున్నారు. ప్రాజెక్టు రూ.94 వేల కోట్లు అయితే, రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ స్వయానా ముఖ్యమంత్రి మామే అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డైలాగులు చెప్పారు. 2014 కంటే ముందు మీరే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు? ఉత్తమ్‌కుమార్.. మీ శ్రీమతి ప్రాతినిథ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్లో ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయా?..’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందనే.. ‘కాళేశ్వరం ద్వారా ఇప్పుడు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలన్న భయంతోనే రేవంత్ ఇలా చేస్తున్నారు. అంతేకాదు నీళ్లిస్తే పంటలు పండుతాయి. పంట పండితే బోనస్ అడుగుతారు. ఆ పంట మళ్ళీ కొనాలి. కాబట్టే నీళ్లు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. కాళేశ్వరం రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన ఒక అద్భుత వరం. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్‌రెడ్డి అని జగిత్యాల సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చెప్పారు. ఒక వారం పాటు కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పజెప్పండి. మొత్తం తెలంగాణ నిండా నీటిని పారించే బాధ్యత మాది. కన్నెపల్లి నుంచి రోజుకు దాదాపు రెండు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ట్యాంక్‌బండ్ కెపాసిటీ ఒక టీఎంసీ, హుస్సేన్‌సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ. రెండు హుస్సేన్‌సాగర్‌లను లిఫ్ట్ చేసే కెపాసిటీ కాళేశ్వరం మోటార్లకు ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం ‘హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి నాలుగు గంటల్లో చేరాల్సిన మా బృందం, పోలీసులు విధించిన ఆంక్షల కారణంగా ఏడు గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. పెంబర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు..’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు మలోత్ కవిత, వినోద్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, రాజయ్య, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది: కేటీఆర్
కన్నెపల్లికి తాము రాకుండా ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్‌ను వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వృథాగా పోతున్న జలాలను పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రతో జలదౌత్యం చేశాం. నీళ్లు పల్లమెరుగు అనే నానుడిని తప్పు అని కేసీఆర్ నిరూపించారు. బీఆర్ఎస్ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నీళ్లు తీసుకొచ్చాం. నీళ్లు ఎత్తేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరం కాళేశ్వరం. ఆంక్షలు, ఆటంకాల నడుమ కన్నెపల్లి వద్దకు చేరుకున్నా. పంప్ హౌస్ వద్దకు రాకుండా మా కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోతుంది. నీళ్లు, నిధులు, నియామకాల మీద తెలంగాణ పోరాటం సాగింది. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సంకల్ప బలంతో నీటి పారుదల కోసం ఒక యజ్ఞంలా శ్రీకారం చుట్టారు. సముద్రానికి 80, 90 మీటర్ల ఉన్న గోదావరి నీటిని ఒడిసి పట్టి లిఫ్ట్ సాయంతో ఎగువకు పంపిచవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హెట్టి నిర్మాణానికి ప్రయత్నం చేయలేదు. తెలంగాణ బీడు భూములకు నీరు అందించాలని ఉద్దేశంతో జలదౌత్యం చేశారు. మూడున్నర సంవత్సర కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. సెంట్రల్ వాటర్ కమీషన్ పెట్టి బెస్ట్ పాయింట్ ని గుర్తించి ప్రాజెక్టు నిర్మించాం. మహారాష్ట్ర వెళ్లి ఒప్పించి వేగంగా నిర్మించారు’’ అని తెలిపారు. -
కన్నెపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన అప్డేట్స్కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలువృథాగా పోతున్న జలాలను పరిశీలించిన కేటీఆర్కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణంపెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా కేవలం కేటీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తామని, మిగిలిన నాయకులు, కార్యకర్తల వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్.. తన వాహనాన్ని రహదారిపైనే నిలిపివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను నెట్టేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పెంబర్తి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
ఆగని అప్పుల రగడ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్‌తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు. -
కుర్చీ, శాలువా రెడీ చేసినా రాలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తానని చెప్పడంతో ప్రత్యేకంగా కుర్చి, శాలువా సిద్ధం చేసి మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గన్‌పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు సిద్ధమైతే హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. నన్ను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు రానీయకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఒకవైపు మంత్రులు సవాళ్లు విసురుతుంటే మరోవైపు పోలీసులతో మమ్మలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. కంచ¯న్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పార్టీ నేతలను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చర్చించే ధైర్యం లేక ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో సదస్సులు ‘రాష్ట్రంలో ’ఆర్ఆర్ టాక్స్’వసూళ్లపై ప్రధానమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అమత్, హోలోగ్రామ్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరగడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నేతలకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 14 డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. త్వరలో రైతు, యువజన, విద్యార్థి సదస్సులు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ముఖ్యమంత్రి, మంత్రులు ఈరోజు చర్చ నుంచి తప్పించుకున్నా ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆగదు..’అని కేటీఆర్ అన్నారు. వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి‘ముఖ్యమంత్రి రేవంత్‌కు నిజంగా చర్చించే ధైర్యం ఉంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సభలో మైక్ కట్ చేయకుండా మాకు మాట్లాడే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, ఎన్నికల హామీల అమలుపై పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతాం. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం పొంతన లేని గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్బీఐ, కాగ్ వెల్లడించిన లెక్కలే దీనికి ప్రామాణికం. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై వాస్తవాలు ప్రజలకు తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శిఖండి రాజకీయాలు చేస్తోంది..’అని కేటీఆర్ మండిపడ్డారు. -
చర్చ.. రచ్చ!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్‌పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్‌పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రెండు రోజులుగా మాటల యుద్ధం అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్‌రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. గన్‌పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు హరీశ్ తరలింపు మంత్రులతో గన్‌పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ భవన్‌లోనే కేటీఆర్ బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్‌పార్క్‌కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్‌పార్క్‌కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు. అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి గాందీభవన్‌లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్‌పార్క్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్‌తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మళ్లీ తెలంగాణ భవన్‌కు హరీశ్ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. -
మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో
-
‘మంత్రులు గన్‌పార్క్‌కు కాదు.. జూపార్క్‌కి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: మంత్రులు తొడ కొట్టడం ఎందుకు? తోక మూడవటం ఎందుకు?. చేత కానప్పుడు.. మంత్రులు ఎందుకు సవాళ్లు విసిరారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తప్పుల మీద.. మా మీద వేస్తున్న అప్పులు నిందల గురించి సవాల్ చేశాను. టైము, డేటు, ప్లేస్ రేవంత్‌నే చెప్పమన్నా.. మధ్యలో జూపల్లి దూరారు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘జూపల్లి ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తున్న అని తొడగొట్టారు.. జూపల్లికి స్వాగతం చెబుదామని శాలువా, దండలు రెడీ చేసుకుంటే తోక ముడిచి పారిపోయి గాంధీభవన్‌లో దాక్కున్నాడు. మంత్రులు రావాల్సింది గన్ పార్క్‌కు కాదు.. జూ పార్క్‌కి.. విచిత్రమైన వ్యక్తుల్ని జూ పార్క్‌లో పెట్టాలి. గన్ పార్క్‌కి బయలుదేరితే మా వాళ్లని అరెస్ట్ చేశారు.. పోలీసులను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు.’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటూ ఊరుకోవటానికి కాదు ఇక్కడ ఉన్నది కేసీఆర్ దళం.. తెలంగాణ అప్పుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ ఏం చెప్పింది?. పార్లమెంట్లో చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు.. రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్ల అంటాడు.. భట్టి విక్రమార్క 7 లక్షల కోట్ల అప్పంటాడు. రేవంత్ రెడ్డికి అప్పులు చేయటం.. భూములను అమ్మటం, అనుముల బ్రదర్స్‌కి దోచి పెట్టడం ఇదే తెలుసు.’’ అంటూ కేటీఆర్ ఆరోపించారు. -
పోలీసులతో వాగ్వాదం KTR అరెస్ట్
-
బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్ల నడుమ.. కేసీఆర్‌కు అద్దంకి ఫోన్
కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్డేట్స్.. తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో హరీష్తెలంగాణ భవన్‌కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదు: హరీష్జూపల్లికి చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిమంత్రి జూపల్లికి విషయం లేకనే చర్చకు రాలేదుమంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానని సెల్ఫ్‌గోల్ వేసుకున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదుకేసీఆర్ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు: అద్దంకికేసీఆర్ బయటకు రావడానికి బయపడుతున్నాడు.బీజేపీ పొత్తులొ ఎక్కువ సీట్లు లాగేందుకు బిఆర్ఎస్ బలంగా ఉందని చెప్పేందుకు కేటీఆర్- హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు.జీతం తీసుకునేందుకే మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ వస్తున్నారు.కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్.కేటీఆర్, హరీష్ ను పంపి తెలంగాణను ఆగం చేస్తున్నారు.కేటీఆర్- హరీష్ రావు సైడ్ యాక్టర్స్.బీజేపీ- బిఆర్ఎస్ మధ్య సీట్ల ఒప్పందం జరుగుతుంది.ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫోన్మీడియా సమావేశం నుంచే కేసీఆర్‌కు ఫోన్ చేసిన అద్దంకిఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఇలాగే చేస్తానంటుంన్న అద్దంకిఅసెంబ్లీకి రావాలని కోరడానికే కేసీఆర్‌కు ఫోన్ చేస్తున్నా అంటున్న అద్దంకి. తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.తెలంగాణ భవన్ వద్ద మరోసారి హైటెన్షన్..గన్‌పార్క్‌కు బయలుదేరిన కేటీఆర్.గన్‌పార్క్‌కు వెళ్తుండగా కేటీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం.పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం.కేసీఆర్ రావాలంటే రాహుల్ గాంధీ రావాలిరాహుల్ గాంధీని తోలుకొస్తే.... కేసీఆర్ ను తెచ్చే భాద్యత నాదిఅక్కడేమో మంత్రులు తొడలు కొడుతున్నారు.. ఇకడేమో పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారుముఖ్యమంత్రి సవాల్ విసిరితే సందట్లో సడేమియా అన్నట్టు మద్యలో జూపల్లి దూరిండుఅన్ని లెక్కలు చెప్పడానే సిద్ధంగా ఉన్నాం.సీఎం, జూపల్లికి కేటీఆర్ సవాల్.. అరెస్ట్ ఎందుకు.. చర్చకు దమ్ము లేదా?: కేటీఆర్ సవాల్తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌తో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.సవాల్ చేసిన సీఎం తోక ముడిచి పారిపోయారు.సవాళ్ల మధ్యలో మంత్రి జూపల్లి దూరారు.చర్చకు సిద్దమైతే మంత్రి జూపల్లి ఎక్కడికి పోయారు.బహిరంగంగా చర్చించే దమ్ము మంత్రులకు లేదు.చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేయాలి?.చర్చించేందుకు కనీసం అసెంబ్లీ అయినా పెట్టండి.సవాళ్లు చేయడం.. పారిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం.ముఖ్యమంత్రి, మంత్రులు చేతకాని వాళ్లని తేలిపోయింది.విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు.చర్చకు మంత్రి వస్తారనుకుంటే ముఖం చాటేశారు.ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం బయటపడింది.మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు.అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్ విసిరారు.గురుకులాల్లో అవినీతిపై చర్చకు వెళ్తే హరీష్‌రావును అరెస్ట్ చేశారు.తెలంగాణ భవన్‌కు వస్తానని జూపల్లి అన్నారు.తెలంగాణ భవన్‌కు రాకుండా జూపల్లి ఎక్కడో మాట్లాడుతున్నారు.దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, సభలోనే చర్చిద్దాం.గన్‌పార్క్ దగ్గర జూపల్లి ఉంటే, మేం అక్కడికే చర్చకు వస్తాం.మేం గన్‌పార్క్ వెళ్తే చార్మినార్ రమ్మంటారు.చార్మినార్ వెళ్తే కొల్లాపూర్ రమ్మంటారు.అసలు తన శాఖలో ఏం జరుగుతుందో జూపల్లికే తెలియదు.లేదంటే మా వాళ్లను కంచన్‌బాగ్‌కు పంపించారు కదా..అక్కడికే రండి అక్కడే చర్చిద్దాం.సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే.. అక్కడ చర్చకు మేం రెడీ.ముఖ్యమంత్రి రేవంత్.. సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలి.హరీష్‌రావు చర్చలకు వస్తే అరెస్ట్ చేయిస్తారు. కంచన్‌బాగ్ పీఎస్‌కు బీఆర్ఎస్ నేతలుతెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. హరీష్ సహా గులాబీ పార్టీలను కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలింపుపోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నేతల బృందాన్ని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సిటీ చుట్టూ తిప్పుతున్న పోలీసులుపోలీసుల వాహనం వెంబడి వందలాది వాహనాల్లో బయల్దేరిన బీఆర్ఎస్ శ్రేణులుహరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు వెంటే వస్తామంటున్న బీఆర్ఎస్ శ్రేణులు https://t.co/BwNMKhesLv pic.twitter.com/Z8VfKmNEG8— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026 జూపల్లి కోసం కేటీఆర్ వెయిటింగ్..మంత్రి జూపల్లి కోసం తెలంగాణభవన్‌లో ఎదురుచూస్తున్న కేటీఆర్తెలంగాణభవన్లో చర్చ కోసం జూపల్లికి కుర్చీ ఏర్పాటు.సవాల్ చేయడం కాదు.. జూపల్లి రావాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..హరీష్, కేటీఆర్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూశాంముగ్గురం మంత్రులం అమర వీరుల స్తూపం దగ్గరకి వచ్చి వెయిట్ చేశాంహరీష్, కేటీఆర్ చర్చకు రాలేదుబీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధంపోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? అంటూ ప్రశ్నలు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే..హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.హరీష్‌ను అరెస్ట్ చేసి వాహనం ఎక్కించిన పోలీసులు. హరీష్ కామెంట్స్..మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానన్నారు.. తోక ముడిచారు.గురుకులాలపై చర్చలకు గన్‌పార్క్‌కు రమ్మన్నారు.మేము వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు.చర్చకు రావాలని పిలిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?.అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే.పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.ప్రభుత్వ అవినీతిని ప్రజలు, అసెంబ్లీ ముందు పెడతాం. మరోవైపు.. మంత్రి పొంగులేటి సీఎల్పీకి చేరుకున్నారు. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోవద్దు..గన్‌పార్క్ బయలుదేరిన హరీష్‌రావును అడ్డుకున్న పోలీసులు.పాదయాత్రగా గన్‌పార్క్ వెళ్లేందుకు సిద్దమైన హరీష్.హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు.పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం.ప్రభుత్వానికి దమ్ముంటే తమను అడ్డుకోవద్దని సవాల్మంత్రి జూపల్లి కామెంట్స్గాంధీ భవన్లో మంత్రి జూపల్లిహరీష్ రావు గన్ పార్క్ వస్తున్నానని చెప్పారుబావ బామ్మర్దులు ఇద్దరు రండినేను సైతం గన్ పార్క్ దగ్గరికి వస్తున్నానువారి సవాల్‌కు సమాధానం అక్కడే ఇస్తానుబావ ఒక దగ్గర బామ్మర్ది ఒక దగ్గర ఎందుకు?.ఇద్దరూ గన్ పార్క్ రండి ఇద్దరికీ అక్కడే సమాధానం ఇస్తాను.హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటున్న మంత్రులు..ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి అంటూ మంత్రుల వ్యాఖ్యలు... తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా..కారులో నుంచే మంత్రి పొన్నంకు హరీష్ ఫోన్ కాల్.మంత్రి పొన్నం తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్న హరీష్.పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ సీరియస్.మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని వ్యాఖ్యలు..పోలీసులతో హరీష్ వాగ్వాదం..పోలీసుల అదుపులో హరీష్. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. హరీష్‌రావు అడ్డగింత.. గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్‌రావును అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదంమంత్రులే గన్‌పార్క్ వద్దకు తనను రమ్మనారంటూ హరీష్ వాగ్వాదంమా కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారు. గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చకోసం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలుమంత్రి జూపల్లితో చర్చ కోసం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎదురుచూస్తున్న మరో బృందంతెలంగాణభవన్లోనే కేటీఆర్ ఉంటారు.ఎక్కడైనా మేం చర్చకు సిద్దం.గురుకులాలపై అన్ని ఆధారాలతో మేము వస్తున్నాం.చర్చకు మేం సిద్ధం.మంత్రులు అక్కడే ఉండాలి.మీ చాలెంజ్‌లు, బహిరంగ సవాళ్లకు మేం భయపడం: మంత్రి అడ్లూరిఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వద్ద ఆధారాలుంటే చూపించాలి: మంత్రి పొన్నంఅవినీతి చేసినట్టు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తాం: పొన్నం తెలంగాణలో పొలిటికల్ హీట్.. తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపుకాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్గురుకులాల్లో అవినీతి జరిగిందంటోన్న బీఆర్ఎస్మంత్రులు అడ్లూరి, అజహారుద్దీన్, పొన్నం చర్చకు రావాలంటోన్న బీఆర్ఎస్దీంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు గన్‌పార్క్ చేరుకున్న మంత్రులు..గన్ పార్క్‌కి చేరుకున్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలుచర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్..కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. తెలంగాణ భవన్ వద్ద మోహరించిన పోలీసులు లు.తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలుమినిస్టర్ క్వార్టర్స్ నుంచి గన్ పార్క్‌కి బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్రాష్ట్ర అప్పులపై సవాళ్లు..రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు.10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటున్న బీఆర్ఎస్కాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్న కేటీఆర్ , హరీష్ రావు.మంత్రులు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ మంత్రులకు సవాల్ విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు బయలుదేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు రావాలంటున్న మంత్రులు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు.మంత్రి అడ్లూరి కౌంటర్.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్.ఆరోపణలు చేసి తొక ముడవడం కాదు.. నిరూపించాలని డిమాండ్.ఆర్ఎస్ ప్రవీణ్ చిట్టా మా దగ్గర ఉందిఅందరి లెక్కలు తేలుస్తాం. -
నేను రెడీ.. మీరు రెడీనా?
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చకు వరంగల్ చౌరస్తానా? అశోక్‌నగర్ చౌరస్తానా? అసెంబ్లీ, ప్రెస్‌క్లబ్, కొత్తగా రూ.200 కోట్లతో కట్టుకున్న సీఎం ఇంద్రభవనంలో అయినా చర్చకు సిద్ధమని అందుకు తేదీ, సమయం, ప్రాంతం సీఎం చెప్పాలని ఏ టాపిక్ అయినా సరే చర్చకు సిద్ధమని, ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి నల్లగొండ సభ, శిల్పకళావేదిక సభలో బీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శించడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే సంఖ్యలో తేడాలున్నాయని, వీరిద్దరూ చెప్పే దానికి పార్లమెంట్లో వీరి చీకటి మిత్రుడు రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రం కాగ్, ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చిన లెక్కలకు చాలా తేడాలున్నాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు అయితే.. తాము దిగిపోయేనాటికి ఉన్న అప్పులు మొత్తం రూ.3.5 లక్షల కోట్లు అని, తమ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.2.78 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేశారంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1.56 లక్షల కోట్లు వ్యయం చేశారంటున్నారని, ఇద్దరి మధ్య ఐదు నిమిషాల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల తేడా చెబితే ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. నెలకు అప్పులు, అసలు కింద ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.2,500 కోట్లలోపు ఉంటుందని కాగ్ నివేదిక చెబుతుంటే.. వీరు బయట మాత్రం రూ.6,000 కోట్లు చెల్లిస్తున్నారని అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కుటుంబం, మంత్రుల దోపిడీతోనే... సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాలా తీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి భావదారి్రద్యంతో మాట్లాడుతూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దివాలా, ఎయిడ్స్ రోగి, కేన్సర్ పేషెంట్ అంటూ తాను పాలించే రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో.. కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మొన్నటికి మొన్ననే సంపూర్ణంగా రైతుబంధు వేస్తాను..అందరికీ ఇస్తాను అని చెప్పి కేవలం ఒక ఎకరానికి ఇచ్చి, ఒక్కొక్క ఎకరానికి డబ్బులు వేసిన ప్రతిసారి సంబరాలు చేసుకుంటూ ఉత్త మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ... రాహుల్‌గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పాలన మాత్రం పాతాళానికి పడిపోతుందని చెప్పారు. అది రాష్ట్ర ఆదాయం అయినా కావొచ్చు...రియల్ ఎస్టేట్ రంగం కావొచ్చు...చివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జీఎస్టీ వసూలు ఇలా ప్రతి ఒక్క రంగంలో మందగమనం ఉందన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో మిగిలింది మందగమనం, మందు గమనం తప్పించి ఇంకేమీ లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిజంగానే రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు. నాలుక మడత తిప్పిన రేవంత్‌రెడ్డి ధాన్యం ప్రతి గింజా కొంటాం..తాము సేకరించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాడుతాం అన్న సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు కేంద్రం ఎంత కోటా ఇస్తే అంతే కొంటాం అంటూ నాలుక మడత తిప్పారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అంగుష్ట మాత్రుడని, ఆయన నోరు మూసీ కంపుకంటే ఘోరం అని వ్యాఖ్యానించారుం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు ఆదాయం పెంచాం రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు వచ్చే నెలసరి ఆదాయం రూ.4 వేల కోట్లు అయితే, తాము దిగిపోయేనాటికి ఆ ఆదాయాన్ని రూ.18,500 కోట్లకు పెంచామని కేటీఆర్ అన్నారు. జీఎస్డీపీని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు గడిచిన 30 నెలల్లోనే రూ.1.13 లక్షల కోట్ల బకాయి పడిందన్నారు. రైతుబంధు కింద రూ.30 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.22వేల కోట్లు, రుణమాఫీ రూ.29 వేల కోట్లు, ధాన్యానికి బోనస్ రూ.16 వేల కోట్లు, కూలీలకు రూ.15 వేల కోట్లు బకాయిపడ్డారని చెప్పారు. -
రాజీనామా చేస్తానంటూ.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్: కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు అప్పులే కాదా? అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మిషన్ భగీరథ పేరుతోనే రూ.40 వేల కోట్ల అప్పు తెచ్చారని అన్నారు. జూపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్పొరేషన్ల అప్పును నేను నిరూపిస్తా.. నేను చెప్పిన లెక్క తప్పు అయితే రాజీనామా చేస్తా.. చర్చకు మీ బీఆర్ఎస్ భవన్‌కు రావడానికి సిద్ధం. నేను చెప్పిన లెక్క తప్పు అయితే ఈ రోజే రాజీనామా చేస్తాను. నేను చెప్పింది అబద్దం అయితే స్పీకర్‌కు నా రాజీనామాను ఇస్తాను. అప్పుల గురించి ఇజ్జత్ పోతుందని మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనించే మిమ్మల్ని గద్దె దించారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది సోనియా గాంధీ. తామే తెచ్చామని చెప్పుకోవడం బీఆర్ఎస్ వాళ్ల భ్రమ. బీజేపీ మూడు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం కూడా బీజేపీనే. తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాల వల్ల రాష్టం ఏర్పడింది’’ అని విమర్శించారు.పాత ముచ్చట్లు చెబుతున్నారు.. కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పాత ముచ్చట్లు చెబుతున్నారని జూపల్లి చెప్పారు. ‘‘50 శాతం ఈ ప్రభుత్వం టర్మ్ అయిపోయింది.. ఏం చేసిందో ప్రభుత్వం చెప్పుకోవడం లేదంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తీరు దేశం మొత్తం చూసింది. త్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్టం. మిగులు బడ్జెట్, ధనిక రాష్టం, తర్వాత రూ.8 లక్షల కోట్లు అప్పు.. ఇది బీఆర్ఎస్ పరిపాలన తీరు. తాము చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నారు కేటీఆర్.కేసీఆర్‌కు, కేటీఆర్‌కు చిన్న మెదడు, పెద్ద మెదడుకు చిల్లు పడి రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న రూ.2 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? రూ.20 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇది ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలా? బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవి అన్ని అబద్ధాలు’’ అని అన్నారు. -
టాపిక్.. ప్లేస్.. డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టామన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘సీఎం రేవంత్, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్‌తో చర్చకు నేను సిద్ధం. టాపిక్.. ప్లేస్, డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి. సవాల్ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్‌దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. -
కేటీఆర్ ర్యాలీలో జగనన్న ఫ్లెక్సీ
వికారాబాద్: సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఓ అభిమాని కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోలో కూడిన ఫ్లెక్సీని పట్టుకుని ర్యాలీలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నాడు. వికారాబాద్ కేటీఆర్ పర్యటనలో కేసీఆర్, వైఎస్ఆర్, కేటీఆర్, జగన్ ఫ్లెక్సీ 🔥@KTRBRS, @ysjagan 🔥 pic.twitter.com/RYsIyWUysQ— ShashanKTR1🚗 (@Shashanktrs8) June 28, 2026 -
మోదీ అంటే రేవంత్‌కు భయం: కేటీఆర్
వికారాబాద్/మొయినాబాద్: స్పీకర్.. సీఎం..ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల పేరిట రైతుల భూములు కొల్లగొడుతున్నారని, బాధిత రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అధ్యక్షతన సర్, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ‘స్పీకర్ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు... పోలీసులారా ఖబడ్దార్.. వచ్చేది మేమే.. మా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మేము మిమ్మల్ని గుర్తు బెట్టుకుంటం.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’అన్నారు. సీఎంను ప్రశ్నిస్తే ‘ఎంత మొగోడైనా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తరా అంటడు.. మూడు నెలల్లో పుట్టరు.. ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏమనాలో మీరే చెప్పాలి’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ అంటే భయమని, బడేభాయ్ ఏది చెప్తే.. చోటా భాయ్ జీ హుజూర్ అంటారని, అందుకే బడేబాయ్ అడగ్గానే దామగుండం అడవిలో 2,700 ఎకరాలు నేవీకి రాసిచ్చిండని, నాడు తమకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అడవి జోలికి రాకుండా మోదీని అడ్డుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు బూత్ స్థాయినుంచి గట్టిగా పనిచేయాలని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే నినాదంతో ముందుకు వెళితే అధికారంలోకి వచ్చేది మనమే అన్నారు. లోక్‌సభకు ఎన్నికకు నామినేట్ చేసిన మీనాక్షినటరాజన్ అభ్యర్థిత్వాన్ని నాశనం చేసింది ముమ్మాటికి సీఎం రేవంత్‌రెడ్డే అని, బీజేపీ కాంగ్రెస్‌ది అక్రమ పొత్తులని అందరికి అర్థం అవుతోందన్నారు. ఓట్లు తొలగించి పశ్చింబెంగాల్లో మమతను బీజేపీ ఓడించిందని, ఏపీలోనూ చంద్రబాబు ఇదే చేయించి వైసీపీని ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎనికేపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. పార్టీ పరంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం
పరిగి: ‘మోసపోతే గోస పడుతామని పరిగి గడ్డపై నిలబడి కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు నరకం చూస్తున్నారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ‘సర్’పై నిర్వహించిన శిక్షణ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ రైతులకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల పేరిట వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ధాన్యం కూడా పూర్తిగా కొనలేకపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపం లాంటివారని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. కమీషన్ల కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి చేశామని.. కానీ రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్ నిలదీశారు. ఉద్దండాపూర్ నుంచి గ్రావిటీ ద్వారా వికారాబాద్ జిల్లాకు కాల్వల ద్వారా నీటిని తీసుకురావచ్చని సిద్ధం చేస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ. 440 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని.. రైతులకు పరిగితోపాటు కొడంగల్, జిల్లా మొత్తానికి సాగు నీరు అందించే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పార్టీ నేతలు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, శివనోళ్ల భాస్కర్, రాజిరెడ్డి, సురేందర్, అశోక్‌కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు: కేటీఆర్
సాక్షి, చేవెళ్ల: రైతులు సహా అన్నివర్గాలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చి.. అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. గురువారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ‘సర్’ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు సాయాన్ని వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి రేవంత్‌ను ఏమనాలో రైతులే చెప్పాలన్నారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయని అన్నారు. పెట్టుబడులు తగ్గడంతో పాటు నిర్మాణ రంగం కూడా మందగించిందని చెప్పారు.రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. "72 సార్లు ఢిల్లీకి వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేకపోయారు" అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. "హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
మెట్రో పేరుతో డ్రామాలు
గచ్చిబౌలి/మియాపూర్: సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో విషయంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కేంద్రాన్ని రేవంత్‌రెడ్డి ఏదో అడిగినట్లు, కిషన్‌రెడ్డి ఏదో తీసుకొస్తున్నట్లుగా ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ, ‘సర్’శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులపై సీఎం రేవంత్ కన్నేశారని.. అందుకే అధికారులను బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. 250 ఎకరాలను కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి మెట్రో రైళ్లను దివాలా తేయించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్డీకాపూల్ నుంచి పటాన్చెరు వరకు గతంలో తాము ప్రతిపాధించిన మెట్రో రైలు అలైన్‌మెంట్‌కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసాంద్రత ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. శేరిలింగంపల్లిని రూ. 9,500 కోట్లతో అభివృద్ధి చేశాం.. శేరిలింగంపల్లిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 9,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కేటీఆర్ చెప్పారు. సినీహీరో రజనీకాంత్ శేరిలింగంపల్లి ప్రాంతాన్ని చూసి హైదరాబాద్‌లో ఉన్నానా లేక అమెరికాలో ఉన్నానా అనే సందేహం కలుగుతోందని అన్నారంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో అందరూ గుర్తుచేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు వారిని లక్షాధికారులను చేయాలని సూచించారు. ఒక్కో మహిళకు రూ. లక్షన్నర ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తలే డ్రైవర్లు.. ‘కారు’కు కార్యకర్తలే డ్రైవర్లని, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం అహారి్నశలూ శ్రమిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ కేటీఆర్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, నాయకులు రాగడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబ, బొబ్జానవతా రెడ్డి, రోజా రంగారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు. -
అర్జున్‌రెడ్డి హిట్.. రేవంత్‌రెడ్డి ఫట్
శంషాబాద్: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్‌రెడ్డి అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్ వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి సినిమా మాత్రం ఫట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ‘సర్’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్ బంధు మా త్రమే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను బూత్ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. -
గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం అధికార పీఠానికి దూరమైన బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరోవైపు సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాదయాత్ర ఉంటుందని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో నాయకత్వలేమి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేష్కిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. చురుగ్గా యువనేతలు...2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఇతర పార్విల్లోకి వలసపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అటు పార్టీ అధినాయకత్వం, ఇటు కేడర్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరితో పార్వికి చెడ్డపేరు వచ్చిందనే ఆరోపణలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే అభిప్రాయాన్ని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త తరానికి అవకాశమివ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. అదీగాక, గతంలో విద్యార్థి, యువజన విభాగాలతోపాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలే ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందనే ఆశావహ దృక్పథం వీరిలో కనిపిస్తోంది. మరోవైపు పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు సందడి చేస్తున్నారు. పార్విలో అనేక మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో అరంగేట్రం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు చెందిన వారు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్వైపు చూస్తున్నట్లు సమాచారం. నిష్క్రమణలు.. చేరికలు.. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పొసగక తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకుని క్రియాశీలమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. నిర్మల్‌లో ఓటమి అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకుడి కోసం అన్వేష్కిస్తోంది. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడిపై కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితయ్యారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని పార్విలో ఆయన ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా వారి వయసు, ఆరోగ్య కారణాలతో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘనపూర్‌లో పార్టీని వీడిన కడియం శ్రీహరి స్థానంలో మాజీ మంత్రి రాజయ్య తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో పార్టీ కేడర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం (ఎస్టీ) ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సాగుతోంది. కొత్తగూడెంలోనూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానంలో వెతుకులాట సాగుతోంది. ⇒ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్‌కు చేరువ కావడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు తన కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ⇒ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో ఎంఐఎంతో దోస్తీ మూలంగా ఏడు చోట్ల స్నేహపూర్వక పోటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు.


