హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతి.. తెలంగాణ ఇచ్చిన జాతి అని స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చె తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడమేగాక, తెలంగాణ భవిష్యత్తు తరాలకు బాసటగా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ..
ఎక్కుపెట్టిన తుఫాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీదని మంత్రి అన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది మీరని గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని వివరించారు.
యువకుల బలిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తిన్నడమేకాకుండా..తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేశారని..అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని అహంకారం చూపించినందుకే..తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చెత్త కుప్పలో పడ్డ విషయాన్ని కేటీఆర్ మరిచిపోవొద్దని మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు.


