ఎన్ని కుట్రలు చేసిన సభ విజయవంతం చేస్తాం.. కేటీఆర్ | We will make the Jagityala Sabha a success KTR | Sakshi
Sakshi News home page

ఎన్ని కుట్రలు చేసిన సభ విజయవంతం చేస్తాం.. కేటీఆర్

Apr 18 2026 2:32 PM | Updated on Apr 18 2026 2:41 PM

We will make the Jagityala Sabha a success KTR

జగిత్యాల : మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరికతో జగిత్యాలలో పండగ వాతావరణం నెలకొందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో పార్టీనేతలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జగిత్యాల సభను ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎన్ని కుట్రలు చేసిన ఎట్టిపరిస్థితుల్లో సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. రెండేళ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 20న జరిగే సభకు  సాయంత్రం 5.30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల చేరుకుంటారని ఆయన రాకకోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన బిల్లు రాజకీయ కుట్రలో భాగమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు కలిసి రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. కాగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 20 న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు కేసీఆర్‌ హాజరవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement